
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంటుకు లేదంటూ సుప్రీం కోర్టు సంచలన తీర్పునివ్వడానికి కారణమైన స్వామి కేశవానంద భారతి (79) పరమపదించారు. దాదాపు గత ఐదు దశాబ్దాలుగా కేరళలోని ఎదనీరు మఠాధిపతిగా కేశవానంద భారతి శ్రీపాద గల్వరు ఉన్నారు. వృద్ధాప్య సమస్యలతో ఆదివారం తెల్లవారు జాము 3.30 గంటల సమయంలో ఆయన కన్నుమూశారు. కేశవానంద భారతి మృతి పట్ల ఉప రాష్ట్రపతి, ప్రధాని తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment