
'ఎంఎస్ నారాయణ చనిపోలేదు'
హైదరాబాద్ : ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ మరణించారన్న వార్తను ఆయన కుమారుడు విక్రమ్ ఖండించారు. కొన్ని మీడియాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన తెలిపారు. ఎంఎస్ నారాయణ ప్రస్తుతం మదాపూర్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. వైద్యులు ఎంఎస్ నారాయణకు వైద్యం అందిస్తున్నట్లు విక్రమ్ చెప్పారు.
కాగా ఎంఎస్ నారాయణ ఆరోగ్యం విషయంలో కొన్ని వదంతులు చెలరేగడంతో సినీ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఇటీవల భీమవరంలో అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ సభ్యులు ఎంఎస్ నారాయణ వెంటే ఉన్నారు. ఎంఎస్ నారాయణను సహచరులు, సన్నిహితులు ఆయన్ను పరామర్శిస్తున్నారు. ఈ సమయంలోనే ఎమ్మెస్ ఆరోగ్య పరిస్థితిపై వదంతులు చెలరేగాయి. అయితే అవన్నీ తప్పంటూ ఆయన కొడుకు విక్రమ్ తెలిపారు. వదంతులు నమ్మొద్దని విక్రమ్ సూచించారు.
కాగా గురువారం మధ్యాహ్నం 12.30గంటల సమయంలో ఎంఎస్ నారాయణను కమెడియన్లు బ్రహ్మానందం, రావు రమేష్‌లు.. కిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించారు. బ్రహ్మానందం, రావు రమేష్ పలకరించగా.. ఎంఎస్ నారాయణ స్పందించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన్ను జాగ్రత్తగా చూసుకోవాలని బ్రహ్మానందం కుటుంబ సభ్యులకు సూచించినట్టు తెలిసింది.