
ఎంఎస్ నారాయణ హెల్త్ బులెటిన్ విడుదల
హైదరాబాద్ : ప్రముఖ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులు గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఎంఎస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్లు అమర్చినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయనకు డయాలసిస్ కొనసాగుతుందని కిమ్స్ వైద్యులు చెప్పారు. కాగా ఎంఎస్ నారాయణ మరణించారన్న వార్తను ఆయన కుమారుడు విక్రమ్ ఖండించిన విషయం తెలిసిందే. ఎంఎస్ నారాయణ ప్రస్తుతం మాదాపూర్ కిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.