
కంటతడి పెట్టిన నటులు
హైదరాబాద్: హాస్యనటుడు ఎంఎస్ నారాయణ భౌతికకాయాన్ని ఈ మధ్యాహ్నం ఫిలిం ఛాంబర్ కు తరలించారు. సినిమా ప్రముఖులు ఆయన పార్థీవదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
కొంత మంది నటులు భావోద్వేగానికి లోనయి కంటతడి పెట్టుకున్నారు. నటుడు బెనర్జీ దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఎంఎస్ నారాయణ భౌతికకాయానికి శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఎర్రగడ్డ శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని ఎంఎస్ నారాయణ కుటుంబ సభ్యులు తెలిపారు.