
ముఖ్యంగా పరిశ్రమలో తన తమ్ముడిగా చెప్పుకునే ఎంఎస్ నారాయణను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. కాగా ఈ షో హోస్ట్ తెలుగులో మీకు నచ్చిన కమెడియన్ ఎవరని అడగగా.. దానికి ఎంఎస్ నారాయణ అని సమాధానం చెప్పారు.
Brahmanandam About MS Narayana In Latest Interview: టాలీవుడ్ హాస్య బ్రహ్మ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం. తెలుగు కమెడియన్స్ జాబితాలో ఆయనది అగ్రస్థానం. ఇక ఆయన తర్వాత ఎంఎస్ నారాయణ ఉంటారు. ఒకప్పుడు వీరిద్దరి లేకుండా సినిమాలు ఉండేవే కాదు. అంతగా తమ కామెడీతో ప్రేక్షకులను నవ్వించారు. ఇక వీరద్దరూ కలిసి చేసిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే 2017లో ఎంఎస్ నారాయణ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వయసు రీత్యా బ్రహ్మానందం కూడా సినిమాలు తగ్గించారు. ఆడపాదడపా సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ టీవీ షోకు ఇంటర్య్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు సంఘటనలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు.
చదవండి: ఊహ నన్ను చూసి వణికిపోయింది: శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముఖ్యంగా పరిశ్రమలో తన తమ్ముడిగా చెప్పుకునే ఎంఎస్ నారాయణను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. కాగా ఈ షో హోస్ట్ తెలుగులో మీకు నచ్చిన కమెడియన్ ఎవరని అడగగా.. దానికి ఎంఎస్ నారాయణ అని సమాధానం చెప్పారు. ఇక తనకు దేవుడు ఇచ్చిన తమ్ముడు ఎంఎస్ అని.. అతడిలో కేవలం కమెడియన్ మాత్రమే కాదు ఒక మంచి విద్యావేత్త ఉన్నాడంటూ ప్రశంసించారు. ఇక ఆయన చనిపోయే ముందు జరిగిన ఓ సన్నివేశం గురించి కూడా గుర్తు చేసుకుని ఆయన ఎమోషనల్ అయ్యారు. ‘హాస్పిటల్‌లో చావు బతుకుల మధ్య ఉన్న ఎంఎస్ నారాయణ తానను తలుచుకున్నారని, ఒక పేపర్‌పై బ్రహ్మానందం అన్నయ్యను చూడాలని ఉంది అని రాసి తన కూతురుకు చూపించారట.
చదవండి: ‘ఆర్‌ఆర్‌ఆర్’ ట్రైలర్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు
దీంతో ఎంఎస్ కూమార్తె తనకు ఫోన్ చేసి విషయం చెప్పిన వెంటనే షూటింగ్ మధ్యలో నుంచే కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లాను. అక్కడికి వెళ్లాక నా చేతిలో చెయ్యేసి అలా ఒకసారి కిందికి పైకి చూసి పక్కనే ఉన్న తన కొడుకును, నన్ను మరోసారి చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఆ సమయంలో ఎమ్‌ఎస్ నారాయణ పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోయింది. అక్కడే కాసేపు ఉండి ఎంఎస్‌తో మాట్లాడాను. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన 15-20 నిమిషాల వ్యవధిలోనే ఎంఎస్ చనిపోయారు అనే చేదు వార్త తెలిసింది. ఆ రోజు జరిగిన సంఘటన ఇంకా గుర్తు ఉంది’’ అంటూ బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. కాగా 2017 జనవరి 23న ఎమ్‌ఎస్ నారాయణ కన్నుమూశారు.