దర్శకుడిగా ఎంతో సక్సెస్ అయ్యాడు విద్యాసాగర్ రెడ్డి. ఆయన డైరెక్ట్ చేసిన రామసక్కనోడు మూవీ మూడు నంది అవార్డులు గెలుచుకుంది. ఇంకా ఎన్నో సినిమాలతో హిట్స్ అందుకున్న ఆయన నిర్మాతగా మాత్రం అంతగా రాణించలేకపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాగర్.. కోట శ్రీనివాసరావు, ఎమ్మెస్ నారాయణల మీద ఫైర్ అయిన సంఘటనలను పంచుకున్నాడు.
'సినిమా షూటింగ్ ఎప్పుడు పెట్టుకుందామని కోట శ్రీనివాసరావును అడిగితే ఆయన ఓ తారీఖు చెప్పాడు. సరేనని ఆరోజు అందరం సెట్స్‌కు వచ్చేస్తే అతడు మాత్రం రాలేనన్నాడు. మళ్లీ ఆయన్ను అడిగి వేరే తేదీ సెట్ చేశాం, ఆరోజు కూడా అలాగే హ్యాండిచ్చాడు. నేను తన దగ్గరకు వెళ్లి ఏం కోట, ఏంటిదంతా.. నన్ను ఇంకో యాంగిల్‌లో చూడొద్దు. పిచ్చోడిలా కనిపిస్తున్నానా? షూటింగ్‌కు రా అని సీరియస్ అయ్యాను. అతడు షూటింగ్‌కు వచ్చాడు, పూర్తి చేశాం. నిజానికి ఆయన ఇంట్లో ఎవరో చనిపోయారు, అందుకే రాలేదు. కానీ రెండుసార్లు అతడే ఒక తేదీ చెప్పి సరిగ్గా సమయానికి రాకపోతే ఎలా ఉంటుంది?
ఓసారి ఎమ్మెస్ నారాయణ కూడా ఎక్కువ వాగాడు. అతడికి నిర్మాత పదివేలు ఇవ్వాల్సి ఉండగా వచ్చి ఇస్తానన్నాడు. ఎమ్మెస్ నారాయణ రాత్రి ఊరెళ్లాల్సి ఉంది. మందు తాగుతూ తింటున్నాడు. ఆ మత్తులో నిర్మాతను బూతులు తిడుతూ.. ఎప్పుడూ ఇలాగే చెప్తారండీ వీళ్లు అన్నాడు. నాకు కోపం వచ్చి చెంప చెళ్లుమనిపించాను. అలా తిట్టడం తప్పు కదా అన్నాను. ఇది జరిగిన నిమిషానికే నిర్మాత మనిషి వచ్చి అతడికి పది వేలిచ్చి వెళ్లిపోయాడు. ఇప్పుడు నీ మాట వెనక్కు తీసుకోగలవా? అని అడిగాను' అని సాగర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఫిల్మీదునియాలో వైరల్‌గా మారాయి.
చదవండి: జోర్దార్ సుజాతను స్మశానానికి తీసుకెళ్లిన రాకింగ్ రాకేశ్
యువతితో ప్రముఖ నటుడి రెండో పెళ్లి?
Comments
Please login to add a commentAdd a comment