Senior director
-
ఎమ్మెస్ నారాయణ చెంప పగలకొట్టా: సీనియర్ డైరెక్టర్
దర్శకుడిగా ఎంతో సక్సెస్ అయ్యాడు విద్యాసాగర్ రెడ్డి. ఆయన డైరెక్ట్ చేసిన రామసక్కనోడు మూవీ మూడు నంది అవార్డులు గెలుచుకుంది. ఇంకా ఎన్నో సినిమాలతో హిట్స్ అందుకున్న ఆయన నిర్మాతగా మాత్రం అంతగా రాణించలేకపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాగర్.. కోట శ్రీనివాసరావు, ఎమ్మెస్ నారాయణల మీద ఫైర్ అయిన సంఘటనలను పంచుకున్నాడు. 'సినిమా షూటింగ్ ఎప్పుడు పెట్టుకుందామని కోట శ్రీనివాసరావును అడిగితే ఆయన ఓ తారీఖు చెప్పాడు. సరేనని ఆరోజు అందరం సెట్స్‌కు వచ్చేస్తే అతడు మాత్రం రాలేనన్నాడు. మళ్లీ ఆయన్ను అడిగి వేరే తేదీ సెట్ చేశాం, ఆరోజు కూడా అలాగే హ్యాండిచ్చాడు. నేను తన దగ్గరకు వెళ్లి ఏం కోట, ఏంటిదంతా.. నన్ను ఇంకో యాంగిల్లో చూడొద్దు. పిచ్చోడిలా కనిపిస్తున్నానా? షూటింగ్‌కు రా అని సీరియస్ అయ్యాను. అతడు షూటింగ్‌కు వచ్చాడు, పూర్తి చేశాం. నిజానికి ఆయన ఇంట్లో ఎవరో చనిపోయారు, అందుకే రాలేదు. కానీ రెండుసార్లు అతడే ఒక తేదీ చెప్పి సరిగ్గా సమయానికి రాకపోతే ఎలా ఉంటుంది? ఓసారి ఎమ్మెస్ నారాయణ కూడా ఎక్కువ వాగాడు. అతడికి నిర్మాత పదివేలు ఇవ్వాల్సి ఉండగా వచ్చి ఇస్తానన్నాడు. ఎమ్మెస్ నారాయణ రాత్రి ఊరెళ్లాల్సి ఉంది. మందు తాగుతూ తింటున్నాడు. ఆ మత్తులో నిర్మాతను బూతులు తిడుతూ.. ఎప్పుడూ ఇలాగే చెప్తారండీ వీళ్లు అన్నాడు. నాకు కోపం వచ్చి చెంప చెళ్లుమనిపించాను. అలా తిట్టడం తప్పు కదా అన్నాను. ఇది జరిగిన నిమిషానికే నిర్మాత మనిషి వచ్చి అతడికి పది వేలిచ్చి వెళ్లిపోయాడు. ఇప్పుడు నీ మాట వెనక్కు తీసుకోగలవా? అని అడిగాను' అని సాగర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఫిల్మీదునియాలో వైరల్‌గా మారాయి. చదవండి: జోర్దార్ సుజాతను స్మశానానికి తీసుకెళ్లిన రాకింగ్ రాకేశ్ యువతితో ప్రముఖ నటుడి రెండో పెళ్లి? -
సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
Senior Director KS Sethu Madhavan Passed Away In Chennai: సినీ పరిశ్రమలో మరోసారి విషాదం నెలకొంది. దక్షిణ భారత ప్రమఖ దర్శకుడు కెఎస్. సేతు మాధవన్ కన్నుమూశారు. వయో సంబంధ సమస్యలతో బాధపడుతున్న 90 ఏళ్ల సేతు మాధవన్ చెన్నైలోని నివాసంలో తుది శ్వాస విడిచారు. 1961లో మలయాళంతో డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 60కిపైగా చిత్రాలను తెరకెక్కించారు. ఇక తెలుగులో 1995లో వచ్చిన స్త్రీ సినిమాను డైరెక్ట్ చేశారు సేతు మాధవన్. కేరళలోని పాలక్కడ్‌లో 1931లో జన్మించిన ఆయన పూర్తి పేరు కే. సుబ్రహ్మణ్యం సేతు మాధవన్. ఆయనకు భార్య వల్సాల, పిల్లలు సోను కుమార్, ఉమ, సంతోష్ సేతు మాధవన్ ఉన్నారు. 1991లో మరుపక్కమ్ అనే తమిళ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. -
టాలీవుడ్లో విషాదం : ప్రముఖ దర్శకుడు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు దుర్గా నాగేశ్వర రావు బుధవారం హైదరాబాద్, రామాంతపూర్‌లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. బొట్టు కాటుక, సుజాత, స్వర్గం,పసుపు-పారాణి వంటి విజయవంతమైన కుటుంబ కథా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన వయసు 87 ఏళ్లు. విజయ బాపినీడు నిర్మించిన 'విజయ' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. గతంలో దర్శక రత్న దాసరి నారాయణరావు వద్ద పలు చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. అప్పటి ప్రముఖ నటుడు చిలకలపూడి సీతారామంజనేయులుకు, నాగేశ్వరరావు స్వయానా మేనల్లుడు. దర్శకుల సంఘం సంతాపం.. బుధవారం తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ముగ్గురు దివంగత దర్శకులకు నివాళులు అర్పించింది. దుర్గా నాగేశ్వరరావుతో పాటు, కొద్ది రోజుల క్రితం మరణించిన మరో ప్రముఖ దర్శకుడు ఈరంకి శర్మ, సీనియర్ కో డైరెక్టర్ రామ సూరిలకు దర్శకుల సంఘం శ్రద్ధాంజలి ఘటించింది. ప్రధాన కార్యదర్శి రామ్ ప్రసాద్ , సీనియర్ సభ్యుడు రాజేంద్రప్రసాద్‌ల ఆధ్వర్యంలో ఈ సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా ఈరంకి శర్మ ద్వారా వెండి తెరకు పరిచయమైన నటులు జీవీ నారాయణ రావు, హేమ సుందర్, రూపా దేవిలు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కర్యక్రమంలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత కానూరి, దర్శకులు ధవళ సత్యం, సీవీ రావు, పర్వతనేని సాంబశివరావు, గార సత్యంలు దివంగత దర్శకులతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. -
ఈరంకి శర్మకు చిరంజీవి నివాళులు
ప్రముఖ సినీ దర్శకుడు ఈరంకి శర్మ(93) గుండెపోటుతో శుక్రవారం స్వర్గస్థులైన సంగతి తెలిసిందే. మచిలీపట్నానికి చెందిన శర్మ అసలు పేరు ఈరంకి పురుషోత్తమశర్మ. ఎడిటర్‌గా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి, బాలచందర్ వంటి పలువురు దర్శక దిగ్గజాల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా, అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేశారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బ, నాలాగే ఎందరో, చిలకమ్మ చెప్పింది, సీతాదేవి, అగ్నిపుష్పం వంటి 15 చిత్రాలకు దర్శకత్వం వహించారు. శర్మకు కుమారుడు ప్రసాద్, కుమార్తె కవిత ఉన్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి వంటి వారితో ఈరంకి సినిమాలు తెరకెక్కించారు. కాగా ఈరంకి మృతి పట్ల చిరంజీవి ఆయన కుటుంబానికి అమెరికా నుంచి ఫోన్ సందేశం ద్వారా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒక నెల రోజుల క్రితమే ఆయన ఫోన్ చేసి తన మనవరాలి పెళ్లికి తప్పకుండా రావాలని నన్ను ఆహ్వానించారు. కానీ విధికి ఎవరూ అతీతులు కారు. ఆయన మరణం నన్ను ఎంతగానో బాధించిందని చిరంజీవి దిగ్ర్భాంతిని వ్యక్తం చేసారు. -
సినిమాల్లో హద్దులు దాటుతున్నారు
సాక్షి , చెన్నై: మితిమీరిన శృంగారం, హద్దులు దాటిన హింస నేటి సినిమాల్లో పెరిగిపోయిందని ప్రముఖ సినీ నిర్మాత, దర్శకులు తాతినేతి రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేక్షకులు ఆశిస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాము అని సినీ ప్రముఖులు వాదించడం సరికాదు, ప్రేక్షకులు అలాంటి హింస, శృంగారాన్ని కోరుకోవడం లేదు, అవి లేకుండానే చిత్రాలను ఆదరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. తన 80 ఏళ్ల జీవితంలో 50ఏళ్లపాటూ తెలుగు సినీ ప్రపంచంలో గడిపిన తాతినేని రామారావు నాటితరం ప్రేక్షకులకు చిరపరిచితులే. ఎన్టీఆర్‌తో యమగోల, ఏఎన్ఆర్తో నవరాత్రి, శోభన్‌బాబుతో జీవనతరంగాలు, అమితాబ్‌తో అంధాకానూన్ చిత్రాలను నిర్మించారు. తెలుగులో 40, హిందీలో సుమారు 35 సినిమాలకు దర్శకత్వం వహించారు. శ్రీలక్ష్మీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అనేక చిత్రాలను నిర్మించారు. తమిళంలో 15 సినిమాలకు నిర్మాతగా వ్యహరించారు. ప్రస్తుతం తన కుమారుడు టీ అజయ్‌కుమార్ నిర్మించే చిత్రాలకు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. 2000లో ‘పూలందీ’ (హిందీ) అయన నిర్మించిన చివరి చిత్రం. ఆ తరువాత నుంచీ పరిశ్రమకు దూరంగా ఉంటూ వచ్చిన తాతినేని, మంగళవారం మీడియా సమావేశం నిర్వహించి తెలుగు సినీరంగంలో తాజా పరిస్థితులు పరిణామాలపై ముచ్చటించారు. ఒకప్పుడు తెలుగు సినీరంగాన్ని బ్రాహ్మణులు శాసించేవారు. చిత్తూరు నాగయ్య అంటే పరిశ్రమలో ఎంతో గౌరవం ఉండేది. క్రమేణా ఇతరులు ఆ స్థానాన్ని అందుకున్నారు. తరువాతి కాలంలో అదే నాగయ్యను ఒక జూనియర్ ఆర్టిస్టులా అగౌరవపరిచారు. పరిశ్రమలో కుల పరమైన విభజన, మంచి, చెడు అనేవి నాడు, నేడూ కూడా మిళితమై ఉన్నాయి. సినిమా ఫెయిలైతే నిర్మాతను ఆదుకునేందుకు నటీనటులు మరో సినిమాకు సిద్ధమయ్యేవారు. మా హయాంలో షెడ్యూలు వేళల ప్రకారం నటీనటులు, సాంకేతిక నిపుణలు స్పాట్‌కు వచ్చేవారు. నేడు సినీ రంగంలో అలాంటి క్రమశిక్షణ లోపించింది. వారసత్వం పెరిగిపోవడం వల్ల హీరో అనే పదానికి అర్థం మారిపోయింది. ఒకప్పుడు హీరో అంటే ఎన్టీఆర్ లా ఉండాలని నిర్మాతలు ఆశించేవారు. నేడు అలాంటి పరిస్థితి లేదు. అందుకే సినిమాలు ఆపేశాను. సినీ పరిశ్రమపై అవగాహన లేనివారంతా రంగ ప్రవేశం చేయడం వల్లనే నష్టాలు, కొందరు నిర్మాతల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. హీరో క్రేజును అడ్డుపెట్టుకుని అత్యధిక రేట్లకు సినిమా హక్కులు అమ్మిన నిర్మాతలు అదే సినిమా ఫ్లాప్ అయినపుడు నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు కొంత సొమ్ము చెల్లించడం సరైన విధానమే. సక్సెస్ ఉంటేనే సినీరంగంలో హవా. అయితే అదృష్టవశాత్తూ దక్షిణాది, ఉత్తరాదిలో కూడా నేను అనేక విజయాలు చవిచూశాను. సినీరంగంలోని నేటి పరిస్థితులకు ఇమడలేక నిర్మాణ రంగానికి దూరంగా ఉన్నాను. మంచి సినిమా తీయాలనే ఉంది. ఏమో చూద్దాం. తమిళనాడులోని సొంత వ్యాపారాల రీత్యా అందరితోపాటూ హైదరాబాద్‌కు తరలివెళ్లకుండా చెన్నైలో స్థిరపడ్డాను. సినీ పరిశ్రమలో గౌరవం అనేది అడిగి పుచ్చుకునేది కాదు, ప్రవర్తనను బట్టి వస్తుంది. నాతో పనిచేసిన వారు నేటీకి టచ్‌లో ఉంటూ నా పట్ల అభిమానం చూపుతున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై నో కామెంట్. విశాల్‌పై తెలుగువాడు అనే ముద్రలేదు. హీరోగా ఆదరిస్తున్నారు కదా. నిర్మాతల మండలి అధ్యక్షులుగా విశాల్ మంచి చేస్తున్నారు, గిట్టనివారు విమర్శిస్తున్నారు. అఖిలభారత దర్శకుల సంఘం సభ్యులుగా నేటికీ కొనసాగుతున్నాను. అయితే ఎందుచేతనో ‘మా’లో సభ్యత్వం తీసుకోలేదు. -
నవ్విస్తూ... థ్రిల్‌కు గురి చేస్తూ...
సీనియర్ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్, రమ్యా నంబీశన్ జంటగా శ్రీ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ‘ఢమాల్ డుమీల్’ చిత్రం తెలుగులోకి ‘ధనాధన్’ పేరుతో విడుదల కానుంది. శివ వై.ప్రసాద్, శ్రీనివాస్ అనంతనేని అనువదించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం కూర్చారు. ‘‘ఈ చిత్రం తమిళంలో విజయవంతమై, వైభవ్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. తెలుగులో కూడా విజయం సాధించి నిర్మాతలకు లాభాలు రావాలి. వైభవ్ తమిళంలో బిజీగా ఉన్నాడు. తెలుగులో ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నాడు’’ అని కోదండ రామిరెడ్డి ఈ చిత్రం ఆడియో వేడుకలో పేర్కొన్నారు. ‘‘ఇది మంచి కామెడీ థ్రిల్లర్. ఈ నెల 18న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని శివ వై.ప్రసాద్ అన్నారు. -
అరుదైన కలయిక
ఇటీవలి కాలంలో ఇదొక అరుదైన సందర్భం. తండ్రి నిర్మాత... ఒక కొడుకు హీరో... మరొక కొడుకు దర్శకుడు. పైగా, సినిమా ఏమో రెండు భాషల్లో! ఈ అరుదైన దృశ్యానికి సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుటుంబం కారణమైంది. రవిరాజా నిర్మాతగా, ఆయన కుమారుల్లో ఒకరైన సత్యప్రభాస్ పినిశెట్టి దర్శకుడిగా, ఆది పినిశెట్టి హీరోగా, తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తయారవుతున్న చిత్రం ‘మలుపు’. నిక్కీగల్ రాణి కథానాయిక. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే నెలలో విడుదల కానుంది. ‘‘ఆది ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ పాత్ర చేస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన ‘మలుపు’ టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఫస్ట్ కాపీ రెడీ అయింది. ఈ నెలలో పాటలను విడుదల చేస్తాం’’ అని నిర్మాత తెలిపారు.