Senior Director KS SethuMadhavan Passed Away At Age Of 90 In Chennai - Sakshi
Sakshi News home page

KS Sethu Madhavan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Published Fri, Dec 24 2021 9:17 AM | Last Updated on Fri, Dec 24 2021 9:36 AM

Senior Director KS Sethu Madhavan Passed Away In Chennai - Sakshi

Senior Director KS Sethu Madhavan Passed Away In Chennai: సినీ పరిశ్రమలో మరోసారి విషాదం నెలకొంది. దక్షిణ భారత ప్రమఖ దర్శకుడు కెఎస్‌. సేతు మాధవన్‌ కన్నుమూశారు. వయో సంబంధ సమస్యలతో బాధపడుతున్న 90 ఏళ్ల సేతు మాధవన్‌ చెన్నైలోని నివాసంలో తుది శ్వాస విడిచారు. 1961లో  మలయాళంతో డైరెక్టర్‌గా కెరీర్‌ స్టార్ట్‌  చేసిన ఆయన తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 60కిపైగా చిత్రాలను తెరకెక్కించారు. ఇక తెలుగులో 1995లో వచ్చిన స్త్రీ సినిమాను డైరెక్ట్ చేశారు సేతు మాధవన్‌. 

 కేరళలోని పాలక్కడ్‌లో 1931లో జన్మించిన ఆయన పూర్తి పేరు కే. సుబ్రహ్మణ్యం సేతు మాధవన్‌. ఆయనకు భార్య వల్సాల, పిల్లలు సోను కుమార్‌, ఉమ, సంతోష్ సేతు మాధవన్‌ ఉన్నారు. 1991లో మరుపక్కమ్‌ అనే తమిళ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement