అరుదైన కలయిక | malupu movie First copy ready | Sakshi
Sakshi News home page

అరుదైన కలయిక

Published Tue, Apr 7 2015 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 11:59 PM

అరుదైన కలయిక

అరుదైన కలయిక

ఇటీవలి కాలంలో ఇదొక అరుదైన సందర్భం. తండ్రి నిర్మాత... ఒక కొడుకు హీరో... మరొక కొడుకు దర్శకుడు. పైగా, సినిమా ఏమో రెండు భాషల్లో!     ఈ అరుదైన దృశ్యానికి సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుటుంబం కారణమైంది. రవిరాజా నిర్మాతగా, ఆయన కుమారుల్లో ఒకరైన సత్యప్రభాస్ పినిశెట్టి దర్శకుడిగా, ఆది పినిశెట్టి హీరోగా, తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తయారవుతున్న చిత్రం ‘మలుపు’. నిక్కీగల్ రాణి కథానాయిక. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే నెలలో విడుదల కానుంది. ‘‘ఆది ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ పాత్ర చేస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన ‘మలుపు’ టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఫస్ట్ కాపీ రెడీ అయింది. ఈ నెలలో పాటలను విడుదల చేస్తాం’’ అని నిర్మాత తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement