
ప్రముఖ సినీ దర్శకుడు ఈరంకి శర్మ(93) గుండెపోటుతో శుక్రవారం స్వర్గస్థులైన సంగతి తెలిసిందే. మచిలీపట్నానికి చెందిన శర్మ అసలు పేరు ఈరంకి పురుషోత్తమశర్మ. ఎడిటర్‌గా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి, బాలచందర్ వంటి పలువురు దర్శక దిగ్గజాల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా, అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేశారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బ, నాలాగే ఎందరో, చిలకమ్మ చెప్పింది, సీతాదేవి, అగ్నిపుష్పం వంటి 15 చిత్రాలకు దర్శకత్వం వహించారు. శర్మకు కుమారుడు ప్రసాద్, కుమార్తె కవిత ఉన్నారు.
రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి వంటి వారితో ఈరంకి సినిమాలు తెరకెక్కించారు. కాగా ఈరంకి మృతి పట్ల చిరంజీవి ఆయన కుటుంబానికి అమెరికా నుంచి ఫోన్ సందేశం ద్వారా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒక నెల రోజుల క్రితమే ఆయన ఫోన్ చేసి తన మనవరాలి పెళ్లికి తప్పకుండా రావాలని నన్ను ఆహ్వానించారు. కానీ విధికి ఎవరూ అతీతులు కారు. ఆయన మరణం నన్ను ఎంతగానో బాధించిందని చిరంజీవి దిగ్ర్భాంతిని వ్యక్తం చేసారు.
Comments
Please login to add a commentAdd a comment