
ఎంఎస్ నారాయణకు కన్నీటి వీడ్కోలు
హైదరాబాద్: అశ్రునయనాల నడుమ సినీ హాస్యనటుడు ఎం.ఎస్.నారాయణ అంత్యక్రియలు శనివారం ఎర్రగడ్డ ఇఎస్‌ఐ హిందూ శ్మశానవాటికలో జరిగాయి. ఎం.ఎస్ అంతిమయాత్ర వెంకటగిరి హైలం కాలనీ నుంచి కొనసాగింది. ఆయన అంత్యక్రియలకు పలువురు సినీ నటులతోపాటు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించగా ఎం.ఎస్. తనయుడు విక్రమ్ చితికి నిప్పంటించారు. ఈ అంత్యక్రియల్లో నటులు శ్రీకాంత్, శివాజీరాజా, వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.