సినీ నటుడు ఎంఎస్ నారాయణకు అస్వస్థత | Actor MS narayana sickness | Sakshi
Sakshi News home page

సినీ నటుడు ఎంఎస్ నారాయణకు అస్వస్థత

Published Tue, Jan 20 2015 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 7:55 PM

సినీ నటుడు ఎంఎస్ నారాయణకు అస్వస్థత

సినీ నటుడు ఎంఎస్ నారాయణకు అస్వస్థత

భీమవరం: సినీ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందించి  అనంతరం  విజయవాడ ఆయుష్ ఆస్పత్రికి తరలించారు. ఎంఎస్ నారాయణ స్వస్థలమైన భీమవరానికి సంక్రాంతి పండుగని వచ్చి ఆదివారం సాయంత్రం స్థానిక హోటల్‌లో గది తీసుకున్నారు.

 

ఆహారం తీసుకున్న అనంతరం రాత్రివేళ ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సన్నిహితులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఫుడ్ పాయిజన్ జరిగినట్లు వైద్యులు  చికిత్స చేశారు. విషయం తెలుసుకున్న ఎంఎస్ కుమారుడు, సినీ హీరో విక్రమ్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు  వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఎంఎస్ నారాయణను హైదరాబాద్ లోని కిమ్స్ కు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement