మా అమ్మాయి దర్శకురాలిగా విజయం సాధిస్తుంది :ఎమ్మెస్ నారాయణ | Sahebha Subramanyam Audio Launched | Sakshi
Sakshi News home page

మా అమ్మాయి దర్శకురాలిగా విజయం సాధిస్తుంది :ఎమ్మెస్ నారాయణ

Jun 22 2014 11:44 PM | Updated on Jul 12 2019 4:40 PM

మా అమ్మాయి దర్శకురాలిగా విజయం సాధిస్తుంది :ఎమ్మెస్ నారాయణ - Sakshi

మా అమ్మాయి దర్శకురాలిగా విజయం సాధిస్తుంది :ఎమ్మెస్ నారాయణ

‘‘మా అమ్మాయి ఇప్పటివరకూ ఏం చేసినా విజయం సాధించింది. దర్శకురాలిగా కూడా తను విజయం సాధిస్తుంది. ఈ సినిమా విషయంలో నేను ఇన్‌వాల్వ్ కాలేదు.

 ‘‘మా అమ్మాయి ఇప్పటివరకూ ఏం చేసినా విజయం సాధించింది. దర్శకురాలిగా కూడా తను విజయం సాధిస్తుంది. ఈ సినిమా విషయంలో నేను ఇన్‌వాల్వ్ కాలేదు. ఆమె పూర్తి స్వేచ్ఛతో చేసింది’’ అని నటుడు ఎమ్మెస్ నారాయణ చెప్పారు. ఆయన తనయ శశికిరణ్ నారాయణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సాహెబా సుబ్రహ్మణ్యం’. దిలీప్‌కుమార్, ప్రియాల్ గోర్ జంటగా ఇండో ఇంగ్లిష్ ప్రొడక్షన్స్ పతాకంపై డా॥కొల్లా నాగేశ్వరరావు నిర్మిస్తోన్న ఈ చిత్రం పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.
 
  ఎమ్మెస్ నారాయణ  పాటల సీడీ ఆవిష్కరించి, దర్శకుడు దశరథ్‌కు ఇచ్చారు. బ్రహ్మానందం మాట్లాడుతూ, ‘‘టైటిల్ క్యాచీగా ఉంది. శశి మంచి దర్శకురాలిగా రాణించాలి’’ అన్నారు. పాటల్లో తెలుగుదనం ఉట్టిపడుతోందని కోట శ్రీనివాసరావు ప్రశంసించారు. దర్శకురాలు మాట్లాడుతూ, ‘‘మలయాళ చిత్రం ‘తట్టత్తిన్ మరియత్తు’కి ఇది రీమేక్. అవుట్‌పుట్ బాగా వచ్చింది’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నట శిక్షకులు ‘వైజాగ్’ సత్యానంద్, కొండవలస, సందీప్ కిషన్, ఉత్తేజ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement