శాస్త్రవేత్తగా...! | Brahmanandam's New Avatar In Aditya | Sakshi
Sakshi News home page

శాస్త్రవేత్తగా...!

Published Tue, Sep 16 2014 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM

శాస్త్రవేత్తగా...!

శాస్త్రవేత్తగా...!

 ఇప్పటివరకు వెండితెరపై పలు రకాల పాత్రలు పోషించిన బ్రహ్మానందం ఇప్పుడు ‘ఆదిత్య’ చిత్రంలో శాస్త్రవేత్తగా కనిపించనున్నారు. శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో స్వీయదర్శకత్వంలో భీమగాని సుధాకర్ గౌడ్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్  హైదరాబాద్‌లో జరుగుతున్న సందర్భంగా సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ -‘‘బాల్య దశలోనే విద్యార్థులు సృజనాతక్మ శక్తిని పెంపొందిస్తే వాళ్లు మంచి పౌరులుగా ఎదుగుతారనేది ఈ చిత్రం ప్రధాన ఇతివృత్తం. ఇందులో బ్రహ్మానందం శాస్త్రవేత్త పాత్రను పోషించడం ఆనందంగా ఉంది. అభ్యుదయవాదిగా సుమన్, స్కూల్ ప్రిన్సిపాల్‌గా ఎమ్మెస్ నారాయణ చేస్తున్నారు. ఇది చక్కని విద్యా వైజ్ఞానిక చిత్రం అవుతుంది. ఈ నెలాఖరున పాటలను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: కందేటి శంకర్, ఎడిటింగ్: నందమూరి హరి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement