ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ శనివారం అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఆయన నివాసం నుంచి ప్రారంభమైన
హైదరాబాద్ : ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ శనివారం అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఆయన నివాసం నుంచి ప్రారంభమైన ఆ యాత్రలో పలువురు సినీ నటులు పాల్గొన్నారు. ఎంఎస్ నారాయణ అంత్యక్రియలు ఈరోజు ఉదయం ఈఎస్‌ఐ శ్మశానవాటికలో జరుగుతాయి. ఇటీవల అస్వస్థతకు గురైన ఎంఎస్ నారాయణ శుక్రవారం హైదరాబాద్‌లోని కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.