అవకాశాలే కాదు.. అదృష్టమూ కలిసిరావాలి | Not likely .. weird authority | Sakshi
Sakshi News home page

అవకాశాలే కాదు.. అదృష్టమూ కలిసిరావాలి

Published Sun, Mar 30 2014 12:27 AM | Last Updated on Fri, Nov 9 2018 6:29 PM

అవకాశాలే కాదు.. అదృష్టమూ కలిసిరావాలి - Sakshi

అవకాశాలే కాదు.. అదృష్టమూ కలిసిరావాలి

ద్వారకాతిరుమల, న్యూస్‌లైన్ : చిత్రపరిశ్రమలో అవకాశాలతో పాటు అదృష్టం కూడా కలసిరావాలని సినీ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ తనయుడు, సినీ నటుడు విక్రమ్ అన్నారు. ద్వారకాతిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామిని శనివారం ఆయన కుటుంబ సమేతంగా కలసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ‘న్యూస్‌లైన్’తో ముచ్చటించారు.
 
ఇప్పటివరకు ఎన్ని చిత్రాల్లో నటించారు
విక్రమ్ : 10 చిత్రాల్లో నటించాను. అందులో కొడుకు, భజంత్రీలు, తెలుగమ్మాయి, బురిడి గుర్తింపుతెచ్చిన చిత్రాలు.
 
 ప్రస్తుతం ఏం చిత్రాల్లో నటిస్తున్నారు
 విక్రమ్ : మంచు విష్ణు కొత్త చిత్రంలో మంచి పాత్రలో నటిస్తున్నాను. విష్ణుతో ఉన్న స్నేహంతో గతంలో దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద చిత్రాలలో కలసి నటించాను.
 
 మీ తండ్రి ఎంఎస్‌తో మీరేమైనా చిత్రాల్లో నటిస్తున్నారా..
 విక్రమ్ : క్రేజీవాలా అనే చిత్రంలో నటిస్తున్నాను. ఈ చిత్రం రాజకీయ ఇతివృత్తంతో సాగుతుంది. దీనిలో నా తండ్రి ఎంఎస్ పాత్ర హీరో అనే చెప్పాలి. ఆ సినిమాలో నేను స్టూడెంట్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాను.
 
 నటనతో పాటు ఇంకేమైనా ఆశయాలు ఉన్నాయా
 విక్రమ్ : హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే కాకినాడ రాజీవ్‌గాంధి లా కాలేజీలో ఎంఎల్ చదువుతున్నా. మొదటి ఏడాది పూర్తి అయింది. నటనతో పాటు న్యాయవ్యవస్థలో రాణించాలన్నది నా ఆశయం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement