good luck
-
కలలో ఏనుగు కనిపిస్తే..? ఏమవుతుంది?
ఎవరికైనా సరే కలలు రావడం సహజంగా జరుగుతూ ఉంటుంది. కలలో పర్వతాలు .. నదులు .. అడవులు .. జంతువులు కనిపిస్తూ ఉంటాయి. పులులు .. సింహాలు .. ఏనుగులు కనిపించడం జరుగుతూ ఉంటుంది. అలాంటి జంతువులు కలలో కనిపించి నప్పుడు భయం కలుగుతుంది. మరుసటి రోజు ఉదయం ఆ విషయాన్ని ఇతరులతో పంచుకుని, ఏం జరుగుతుందోననే ఆందోళనకి లోనవుతుంటారు. అయితే కలలో ఏనుగు కనిపిస్తే మంచిదేనని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఏనుగు కుంభస్థలం .. లక్ష్మీదేవి నివాస స్థానంగా చెప్పబడుతోంది. అందువలన కలలో ఏనుగు దర్శనం వలన సంపదలు లభిస్తాయని అంటారు. ఏనుగును దర్శించుకోవడం వలన దారిద్య్రం .. దుఃఖం దూరమవుతాయని చెబుతారు. అదృష్టం .. ఐశ్వర్యం చేకూరతాయని నమ్ముతారు. ఆయా పుణ్య క్షేత్రాల్లో గజ వాహనంగా ఏనుగులు భగవంతుడి సేవలో తరిస్తుంటాయి. గజ ముఖంతోనే వినాయకుడు తొలి పూజలు అందుకుంటూ ఉంటాడు .. అందరి విఘ్నాలను తొలగిస్తూ ఉంటాడు. అలాంటి ఏనుగును కలలోనే కాదు .. బయట చూసినా ఇలాంటి ఫలితాలే కలుగుతాయట. ఇదీ చదవండి : Diwali 2024 దీపావళి లక్ష్మీపూజ : మీ ఇల్లంతా సంపదే! -
'గుడ్ లక్ స్టూడియోస్'ని ప్రారంభించిన నటుడు సూర్య (ఫొటోలు)
-
2023: సంతోషంగా స్వాగతం పలుకుదాం!
ఎప్పటికప్పుడు ఏదో కొత్తదనంతో నవనవోన్మేషంగా ఉండడం సృష్టి లక్షణం. అనుదినం తన బిడ్డలకు కొత్తదనాలనూ, కొత్త భోగవస్తువులనూ, కొత్త అనుభవాలనూ కానుక చేయడం భగవంతుడికి వాడుక, వేడుక. కాబట్టే తెల్లారేసరికి మన చుట్టూ ఎన్నో కొత్త చిగుళ్లూ, కొత్త మొగ్గలూ, కొత్త ఆరంభాలూ కళకళ లాడుతూ, కిలకిల నవ్వుతూ కనిపిస్తాయి. ఎన్నో కొత్త అందాలూ, పోకడలూ, విచిత్రాలూ, కొత్త వేష భాషలూ, వస్తువాహనాలూ, ప్రయోగాలూ, ధోరణులూ ఎదురౌతాయి. ప్రకృతి ధర్మంగా వచ్చి పలకరించే కొత్తదనాల సందడిని సుహృద్భావంతో స్వాగతించే ధీరుడు వాటిని ఆనందంగా ఆస్వాదించగలుగుతాడు. పరిచితమైనదనే పక్షపాతంతో పాతనే పట్టుకు పాకులాడుతూ, అపరిచితమైన నవ్యతకు అకారణంగా జంకుతూ ఉండే భీరువు, నిరంతమైన నిరాశతో నిరుత్సాహానికి నెలవుగా ఉంటాడు. నిన్నటి కొత్తే నేటి పాత. నేటి కొత్త రేపటికి పాత. అయినప్పుడు అన్నీ మన మంచికే. లోక క్షేమం కోసం కొత్త నీరుప్రవహిస్తూ వస్తుంటే భయమెందుకు, కొత్త సమస్యలు మోసు కొస్తుందేమోననా? సమస్య వెంటే పరిష్కారం వస్తుంది అని చరిత్ర మనకు పదే పదే చెప్పిన పాఠం. గతంలో ఇలా అనవసరంగా ముందు భయపెట్టిన సమస్యలెన్నిటినో మనం అలవోకగాదాటివచ్చిన వాళ్ళమే గదా! సృష్టి కర్త ఉన్నాడనీ, ఆయన కరుణామయుడనీ, కాలగమనానికి ఆయనే కారణం గనక కాలగతి కలిగించే ఒడుదొడుకులన్నీ ఆయన అను గ్రహంతో అధిగమించగలమనీ విశ్వసించే వారు, నవ్యతను ఆశాభావంతో ఆహ్వానించకుండా ఉండలేరు. ఎన్నో కొత్తదనాలు మన ముందు ఆవిష్కరించేందుకు, మరో నూతన సంవత్సరం మన ముంగిట నిలిచిన శుభవేళలో, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాక్ భవేత్ (అందరూ సుఖంగా ఉండాలి, అందరూ అనారోగ్యానికి దూరంగా ఉండాలి, అందరికీ శుభాలు జరగాలి, ఎవ్వరూ దుఃఖానికి ఆశ్రయం కాకూడదు) అన్న ఆర్షేయమైన ఆశీస్సు మనసారా మరోసారి మననం చేసుకొందాం. కొత్త ఏడాదిలో అందరూ ధర్మాన్ని రక్షిస్తూ, దానివల్ల సురక్షితులై సుఖశాంతులతో ఉండాలనీ, దుఃఖహేతువులైన దుర్మార్గాలకు దూరంగా ఉండాలనీ ఆకాంక్షిస్తూ, రెండు వేల ఇరవై మూడుకు సంతోషంగా స్వాగతం పలుకుదాం! – ఎం. మారుతి శాస్త్రి -
అరటి రైతుకు మహర్దశ
సాక్షి, అమరావతి: అరటి రైతుకు మహర్దశ పట్టనుంది. విత్తు నుంచి విపణి వరకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలవనుంది. దిగుబడుల్లో నాణ్యత పెంచడం, ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా రూ.269.95 కోట్లతో కార్యాచరణ సిద్ధం చేసింది. రానున్న మూడేళ్లలో వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (సీడీపీ)ని అమలు చేయనుంది. గడిచిన మూడేళ్లలో లక్ష టన్నుల ఎగుమతులు రాష్ట్రంలో 2,02,602 ఎకరాల్లో అరటి సాగవుతుండగా, 48.62 లక్షల టన్నుల దిగుబడులతో దేశంలో నం.1 స్థానంలో ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 23వేల టన్నులు ఎగుమతులు జరుగగా, కరోనా పరిస్థితులున్నప్పటికీ గడిచిన మూడేళ్లలో లక్ష టన్నులకు పైగా అరటి ఎగుమతులు చేయగలిగారు. దేశంలోనే తొలిసారి తాడిపత్రి నుంచి ముంబైకు ప్రత్యేక రైలు ద్వారా అరటిని ఎగుమతి చేసి చరిత్ర సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న వాల్యూచైన్ ప్రాజెక్టు వల్ల హెక్టార్‌కు 24 టన్నుల వరకు దిగుబడులు, టన్నుకు రూ.12వేల వరకు ఆదాయం పెరిగింది. ఎగుమతులను ప్రోత్సహించే లక్ష్యంతో అనంతపురంలో రెండు ప్యాక్ హౌస్‌లు, రెండు కోల్డ్ స్టోరేజ్‌లు నిర్మించగా, పులివెందులలో ప్యాక్ హౌస్ నిర్మాణ దశలో ఉంది. 42,500 ఎకరాల్లో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు తాజాగా ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించే లక్ష్యంతో జాతీయ ఉద్యాన బోర్డు దేశవ్యాప్తంగా 12 క్లస్టర్స్‌ను ఎంపిక చేయగా, ఏపీలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అరటి ఎగుమతులను ప్రోత్సహించనున్నారు. అరటి ఎక్కువగా సాగవుతున్న వైఎస్సార్, అనంతపురం, కర్నూలు, జిల్లాలను ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు. మూడు జిల్లాల పరిధిలో గుర్తించిన 42,500 ఎకరాల్లో సీడీపీ ప్రాజెక్టును అమలు చేసేందుకు రూ.269.95కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మొత్తంలో రూ.100 కోట్లు గ్రాంట్ రూపంలో అందించనుండగా, మిగిలిన మొత్తాన్ని పీపీపీ కింద సమీకరించనున్నారు. క్లస్టర్ గ్యాప్ అసెస్మెంట్ రిపోర్టు ఆధారంగా ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే ప్రాంతంలో మొక్కల నుంచి ఎగుమతి వరకు మూడు దశల్లో రైతులకు సపోర్టు ఇవ్వనున్నారు. విత్తు నుంచి కోత (ప్రీ ప్రొడక్షన్ – ప్రొడక్షన్)వరకు రూ.116.50 కోట్లు, కోత అనంతర నిర్వహణ–విలువ ఆపాదించడం (పోస్ట్‌హార్వెస్ట్ మేనేజ్మెంట్, వాల్యూఎడిషన్) కోసం రూ.74.75కోట్లు, ఎగుమతులకు అవసరమైన లాజిస్టిక్స్, మార్కెటింగ్, బ్రాండింగ్ కల్పనకు రూ.78.70కోట్లు ఖర్చు చేయనున్నారు. అరటికి కేరాఫ్ ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా గడిచిన మూడేళ్లలో అరటి ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. వీటిని మరింత పెంచే లక్ష్యంతో ప్రభుత్వం రూ.269.95 కోట్లతో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టుతో ఎగుమతుల్లో ఏపీకి త్వరలో అంతర్జాతీయఖ్యాతి లభించనుంది. –డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్, కమిషనర్, ఉద్యాన శాఖ రైతుకు చేయూత ఇలా.. సాగుకు అవసరమైన నాణ్యమైన టిష్యూ కల్చర్ మొక్కల నుంచి మైక్రో ఇరిగేషన్, సమగ్ర సçస్యరక్షణ (ఐఎన్ఎం), సమగ్ర ఎరువులు, పురుగు మందుల యాజమాన్యం(ఐపీఎం), ఫ్రూట్ కేర్ యాక్టివిటీ వరకు ఒక్కో రైతుకు గరిష్టంగా హెక్టార్‌కు రూ.40వేల వరకు ఆర్థిక చేయూతనివ్వనున్నారు. తోట బడుల ద్వారా15వేల మందికి సాగులో మెళకువలపై శిక్షణనిస్తారు. సాగుచేసే ప్రతీ రైతుకు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ సర్టిఫికేషన్ (జీఏపీ)ఇస్తారు. కోతలనంతర నిర్వహణకు అవసరమైన ప్యాక్ హౌసెస్, కోల్డ్ స్టోరేజ్‌లు, ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైనపెట్టుబడులు అందించడంతో పాటు బ్రాండింగ్, విదేశాల్లో ప్రమోçషన్ వంటి కార్యకలాపాలకు ఆర్థిక చేయూతనందిస్తారు. (చదవండి: సీమసిగలో మెగా పవర్ ప్రాజెక్ట్.. సీఎం జగన్ చేతులమీదుగా శంకుస్థాపన) -
మ్యాచ్‌కు ముందు ధోని గుడ్‌లక్ చెప్పడు.. కారణం అదే
ముంబై: చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి టీమిండియా మాజీ క్రికెటర్ ప్రగ్యాన్ ఓజా ఒక ఆసక్తికర విషయం చెప్పుకొచ్చాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు ఏ కెప్టెన్ అయినా వారి టీమ్‌కు గుడ్‌లక్ చెప్పి సూచనలు ఇవ్వడం చూస్తుంటాం. అయితే ధోని మాత్రం మ్యాచ్‌కు ముందు తమ జట్టు ఆటగాళ్లకు ఎలాంటి గుడ్‌లక్ చెప్పడని.. అసలు అలా చెప్పడం మానేశాడని ఓజా పేర్కొన్నాడు. అయితే ధోని ఇలా చేయడానికి ఒక కారణం ఉందని ఓజా పేర్కొన్నాడు. ''ధోని మ్యాచ్‌కు ముందు తన జట్టులోని ఆటగాళ్లకు గుడ్‌లక్ లేదా ఆల్ ది బెస్ట్ చెబితే మ్యాచ్ తర్వాత ఏదో ఒకటి తనకు వ్యతిరేకంగా జరుగుతుందని ధోని నమ్మాడు. అందుకే అతను ఆల్ ది బెస్ట్ చెప్పడం కూడా మానేశాడు. అంతేగాక ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు కూడా మ్యాచ్‌కు ముందు ధోని దగ్గరకి వెళ్లడానికి ఆలోచిస్తారు. ఒకానొక సందర్భంలో ధోనినే ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు. తనకు కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయని.. వాటిని బలంగా నమ్ముతానని.. అందుకే మ్యాచ్‌కు ముందు నా జట్టుకు ఆల్ ది బెస్ట్ చెప్పనని.. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు కూడా నాకు ఎలాంటి విషెస్ చెప్పాలని తాను కోరుకోనని చెప్పాడు.'' అంటూ తెలిపాడు. కాగా ఐపీఎల్ 14వ సీజన్‌ను ఓటమితో ఆరంభించిన సీఎస్కే ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. కాగా నేడు ముంబై వేదికగా సీఎస్కే కేకేఆర్‌ను ఎదుర్కోనుంది. చదవండి: 'రికార్డుల కోసం నేను ఎదురుచూడను' బౌలర్ గీత దాటితే చర్య.. బ్యాట్స్‌మన్ దాటితే మాత్రం -
కీర్తీ సురేష్.. ‘గుడ్ లక్ సఖి’
'మహానటి'తో జాతీయ అవార్డు అందుకున్న హీరోయిన్ కీర్తి సురేశ్. ఆమె తాజాగా నటిస్తోన్న లేడీ ఓరియంటెడ్ చిత్రం "గుడ్ లక్ సఖి". ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి.. దేశం గర్వించే షూటర్‌గా ఎలా తయారైందన్న అంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ విశేషంగా ఆకర్షిస్తోంది. గ్లామర్‌కు దూరంగా, పల్లెటూరి పడుచు పిల్ల పాత్రలో కీర్తి ఒదిగిపోయారు. ఆరు మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతున్న సఖి టీజర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఆమె నటనకు మరోసారి ఫిదా అవుతున్న అభిమానులు కీర్తికి మరో జాతీయ అవార్డు ఇవ్వాల్సిందేనంటున్నారు. 'లక్ అనేది లేదు', 'మన రాత మనమే రాసుకోవాల' అనే డైలాగులు నిజ జీవితంలోనూ ఇన్స్పిరేషనే అని చెప్తున్నారు. (గుడ్‌లక్ సఖి.. టీజర్ వచ్చేసింది) ఈ సినిమాలో కీర్తిని ప్రేమించే అబ్బాయి పాత్రలో ఆది పినిశెట్టి, ఆమెకు శిక్షణనిచ్చే కోచ్ పాత్రలో జగపతి బాబు నటిస్తున్నారు. ఓ చిన్న షెడ్యూల్ మినహా సినిమా మొత్తం పూర్తయింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. నాగేశ్ కుకునూర్ దర్శకత్వం వహిస్తుండగా రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ‘దిల్’రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్‌చంద్ర పాదిరి నిర్మిస్తున్నారు. కాగా ఆమె సాని కాయితం(పేడ పేపర్) అనే కొత్త సినిమా చేయబోతున్నట్లు శనివారం వెల్లడించారు. శనివారం ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో కీర్తి వీపు వెనక వేట కొడవలి పెట్టుకుని, ఎడమ చేతిలో తుపాకీ పట్టుకుని నాటు పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. (ఆ లవ్ లెటర్‌ను దాచుకున్నా: కీర్తి సురేష్) -
బాల్యంలోనే బీజాలు పడాలి
సందర్భం ‘‘నిర్మలమైన, పవిత్రమైన మనస్సుతో నీ విధులను నువ్వు సక్రమంగా నిర్వర్తించు, ఫలితం దానంతట అదే వస్తుంది’’ అంటారు శ్రీభారతీ తీర్థ మహాస్వామివారు. జగద్గురు ఆదిశంకరులు స్థాపించిన చతురామ్నాయ పీఠాలలో మొదటిది, దక్షిణాపథానికంతటికీ గురుస్థానం ఈ పీఠానిదే. అంతటి శృంగేరీ శారదా పీఠానికి అధిపతి శ్రీ భారతీ తీర్థ స్వామివారి 66వ వర్ధంతి ఉత్సవాలు నేడు, రేపు జరగనున్నాయి. 1951 ఏప్రిల్ 11న గుంటూరు జిల్లా నాగులేరు సమీపంలోని అలుగుమల్లెపాడులో తంగిరాల వారి ఇంట జన్మించిన సీతారామాంజనేయశర్మ ఇలా శృంగేరీ పీఠానికి 36వ అధిపతిగా సనాతన ధర్మమూలాలను రక్షించే దార్శనికుడిగా ఎదగడం తెలుగువారి అదృష్టం. ఆయన 66వ వర్ధంతి సందర్భంగా వారి బోధామృతం నుంచి రాలిన కొన్ని చినుకులు... ‘‘యువతరం క్రమశిక్షణను ఎప్పుడూ కోల్పోకూడదు. అదుపు తప్పి ప్రవర్తించకూడదు. యువతరం ఋజుమార్గంలో జీవితంలో ముందుకు సాగాలంటే, అందుకు బాల్యంలోనే బీజాలు పడాలి. పిల్లలు ఇంటర్నెట్తో ఆటలాడుకుంటుంటే, టీవీ చూస్తుంటే మురిసిపోవడం కాదు... వారికి నైతిక, పౌరాణిక కథలు చెప్పాలి. మన దేశ ఘనవారసత్వాన్నీ, సాంస్కృతిక విలువలనూ బోధించాలి. మంచి అలవాట్లు కాని, చెడు అలవాట్లు కాని మనం ఎవరి సాంగత్యంలో ఉంటామో వారి నుంచి సంక్రమిస్తాయి. కాబట్టి ఎల్లప్పుడూ సత్సాంగత్యాన్నే కోరుకోవాలి.అలాగే, కాలాన్ని కోల్పోతే దానిని తిరిగి తీసుకురావడం ఎవరి తరమూ కాదు. కాబట్టి కాలాన్ని వృథా చేయకుండా మంచి పనులతో గడపాలి.’’ శ్రీ భారతీ తీర్థుల వారి బోధలు అందరికీ శిరోధార్యం. వారి అడుగు జాడలలో నడవడమే మనం వారికి చెల్లించే గౌరవ ప్రపత్తులు. గమనిక: సన్న్యాసాశ్రమం స్వీకరించిన వారికి వారి జన్మదినాన్ని కూడా వర్ధంతిగా పరిగణించడం ఆచారం. అదే విధంగా శృంగేరీ జగద్గురువులు తమ ఉత్తరాధికారిని తామే ఎంపిక చేయడం పీఠ సంప్రదాయం. శృంగేరీ పీఠ ఉత్తరాధికారిగా శ్రీ విధుశేఖర భారతీస్వామివారిని ఎంపిక చేశారు. -
అదృష్టం తలుపుకొడితే...
అదృష్టం తలుపుకొడితే... ఆలస్యంగా తలుపు తెరిచిందీ జంట. లండన్‌కు 103 మైళ్ల దూరంలోని టామ్‌వర్త్ అనే చిన్న పట్టణంలో మాల్కమ్ బాస్వర్త్, డాన్ బాస్వర్త్లు నివసిస్తున్నారు. 64 ఏళ్ల మాల్కమ్ టిఎన్టి సంస్థ లో లోడింగ్ పనులను పర్యవేక్షిస్తుంటాడు. ఆమె ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. సెలవులకని ఈజిప్టుకు వెళ్లారు. అక్కడ బీచ్‌లో సేదదీరుతుండగా జూన్ 24న ఈ-మెయిల్ వచ్చింది. ఒకసారి మీరు కొన్న లాటరీ టిక్కెట్టును సరిచూసుకోమని. మొబైల్లో దీన్ని చూసిన మాల్కమ్ పది పౌండ్లు (దాదాపు 983 రూపాయలు) వచ్చి ఉంటుందిలే అని భార్యతో జోకేశాడు. ఆమె కూడా నవ్వుకుంది. తన లాటరీ అకౌంట్‌ను ఓపెన్ చేయడం కుదరకపోవడంతో అంతటితో తేలికగా తీసుకొని వదిలేసింది. రెండువారాల పాటు ఈజిప్టులో సెలవులను ఎంజాయ్ చేసిన ఈ దంపతులు గత మంగళవారం స్వస్థలానికి చేరుకున్నారు. సూటుకేసులు ఖాళీచేసి, ఎక్కడివక్కడ సర్దేసిన డాన్ బాస్వర్త్ దుస్తులను ఉతికేసింది. మధ్యాహ్నం రెండు గంటల షిఫ్టుకు ఆఫీసుకు వెళ్లేముందు లాటరీ అకౌంట్‌ను చెక్ చేసింది. తాము గడిచిన పదమూడేళ్లుగా కొంటున్న నెంబర్లు 14, 23, 28, 33, 35... అచ్చంగా లాటరీ నెంబర్లతో సరిపోయాయి. బహుమతిగా వచ్చిన మొత్తం చూసింది. నమ్మలేకపోయింది. కాళ్లు వణుకుతున్నాయి. కూతురిని పిలిచింది... ఆమె చూసి చెప్పింది తమకు 58,72,705 పౌండ్లు (57 కోట్ల 72 లక్షల రూపాయలు) లాటరీలో తగిలాయని. అంతే ఒక్కసారిగా కుటుంబమంతా ఆనందంతో ఎగిరిగంతేశారు. తమ నలుగురు సంతానం, మనవలు, మునిమనవలు ఆర్థికంగా మంచిస్థితిలో ఉండేలా డబ్బును జాగ్రత్త చేస్తామంటోందీ జంట. -
మీరు కష్టాన్ని నమ్మే వ్యక్తులేనా.?
సెల్ఫ్ చెక్ కొందరికి పని సులభంగా చేయాలని ఉంటుంది. అదృష్టం కలిసి వస్తేనే ఇలాంటి వారు అందలం ఎక్కగలరు... మరికొందరు కష్టపడి పనిచేస్తారు. ఆ తర్వాతే ఫలితం ఆశిస్తారు. ఇలాంటి వారికి అదృష్టం కలిసిరాకపోయినా ఫలితం దక్కుతుంది. మీరు ఏ కోవకు చెందేవారో చెక్ చేసుకోండి. 1. మీరు ఎంత కష్టపడాలో అంత కష్టపడతారు. తర్వాత ఫలితం ఆశిస్తారు. ఎ. అవును బి. కాదు 2. మీలోని అపారమైన సంకల్పబలం మీ కష్టపడే తత్వం వల్లనే వచ్చింది. ఎ. అవును బి. కాదు 3. మీ పని నాణ్యతను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉంటారు. ఎ. అవును బి. కాదు 4. ఎంత కష్టమైనా అనుకున్న పని సాధించాలని తపన పడతారు. ఎ. అవును బి. కాదు 5. ఇతరుల నుంచి మాట పడే పరిస్థితిని ఎన్నటికీ రానివ్వరు. ఎ. అవును బి. కాదు పై వాటిల్లో మూడింటికి అవును అన్నది మీ సమాధానమైతే మీరు అదృష్టం కంటే మీ కష్టాన్ని నమ్ముకునే వ్యక్తి అని అర్థం. -
శుభకరం.. మన్మథనామ సంవత్సరం
మచిలీపట్నం : మన్మథనామ సంవత్సరం జిల్లా ప్రజలకు శుభాలు కలుగజేస్తుందని పంచాంగం చెబుతోందని ఘనాపాటి విష్ణుభట్ల సూర్యనారాయణశర్మ అన్నారు. రాష్ట్ర సాంస్కృతిక మండలి, జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యాన టౌన్‌హాలులో శనివారం ఉగాది వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పంచాంగ శ్రవణం చేశారు. ఈ ఏడాది ప్రజల మంచి కోరికలన్నీ నెరవేరుతాయన్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పాడిపంటలు వెల్లివిరుస్తాయన్నారు. 2015 ఏప్రిల్ 4న చంద్రగ్రహణం, 2016 మే 9న సూర్యగ్రహణం, 2016 ఫిబ్రవరి 8న మహోదయం జరుగుతాయని చెప్పారు. జిల్లా ఆదాయం 112గానూ, వ్యయం 98గానూ ఉంటుందని చెప్పారు. ఈ ఏడాది సైన్యాధిపతిగా శుక్రుడు ఉండటంతో అంతా శుభకరంగానే ఉంటుందన్నారు. వివిధ రాశుల వారికి సంబధించిన మంచి, చెడులను ఆయన వివరించారు. ఈ ఏడాది గోదావరి పుష్కరాలకు అఖండ గౌతమిలో స్నానం చేస్తే పుణ్యం సమకూరుతుందన్నారు. పుష్కరాలు పూర్తయిన మూడు నెలల అనంతరం శుభకార్యాలు చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు పాలన - మంత్రి కొల్లు రవీంద్ర ప్రజల ఆకాంక్షల మేరకు నూతన సంవత్సరంలో పాలన ఉంటుందని బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన అధికారులు, పాలకులతో కలిసి ఉగాది పచ్చడిని స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఉగాది వేడుకలను ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్నామన్నారు. బందరుపోర్టు నిర్మాణంలో కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవమేనని, అయితే తప్పనిసరిగా పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. మచిలీపట్నంలో ఐదెకరాల విస్తీర్ణంలో స్టేడియం నిర్మించనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో రుద్రవరంలో మరో స్టేడియం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. స్థల సేకరణకు చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను ఆదేశించినట్లు తెలిపారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఉగాది వేడుకలను పురస్కరించుకుని పట్టణం, జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన కవులు, రచయితలతో కవిసమ్మేళనం నిర్వహించారు. కొట్టి రామారావు, గుడిసేవ విష్ణుప్రసాద్, కారుమూరి రాజేంద్రప్రసాద్, దత్తాత్రేయశర్మ, ముదిగొండ సీతారావమ్మ, దండిబొట్ల సత్యనారాయణశర్మ, భవిష్య, వరదా సురేష్‌కృష్ణ, విజయకుమార్, చంద్రిక, మధుబాబు, కోగంటి విజయలక్ష్మి, వక్కలంక రామకృష్ణ, ఎన్వీవీ సత్యనారాయణ, కుందా లక్ష్మీరాఘవేంద్రప్రసాద్, చోడవరపు మాదవి తదితరులు నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోల్పోయిన సౌకర్యాలు, పాలకులు చేసిన కనికట్టు, దేశంలో జరుగుతున్న అఘాయిత్యాలు తదితర అంశాలను వివరిస్తూ కవితలు వినిపించారు. తొలుత సత్యనారాయణశర్మ, వెంకటపతి అవధాని, ఘనాపాటి విష్ణుభట్ల సూర్యనారాయణశర్మ వేద పఠనం చేశారు. అనంతరం క్రొవ్విడి శివబాబు, ముత్యాలపల్లి నాగబాబు నాదస్వరం వినిపించారు. మంత్రి రవీంద్ర, మునిసిపల్ చైర్మన్ బాబాప్రసాద్, డీఆర్వో ఎ. ప్రభావతి, ఆర్డీవో పి .సాయిబాబు, వైస్‌చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథం తదితరులను వేదపండితులు ఆశీర్వదించారు. భక్తి టీవీ ప్రచురించిన పంచాంగాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ నాట్యాచార్యుడు వై పూర్ణచంద్రరావు శిష్యబృందం మహ్మద్‌బేగ్ కూచిపూడి నృత్యం, బి. కృష్ణశ్రీయ అన్నమాచార్య కీర్తనలు, నాగార్జున పబ్లిక్ స్కూలు విద్యార్థులు పవన్‌కుమార్, వరప్రసాద్, బాలచంద్రుడు, దుర్యోధన ఏకపాత్రాభినయాలు చేశారు. పంచాంగ శ్రవణం చేసిన వేదపండితులు, కవులు, కళాకారులను మంత్రి ఘనంగా సత్కరించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, బందరు ఎంపీపీ కాగిత శ్రీనివాసరావు, మునిసిపల్ కమిషనర్ మారుతీ దివాకర్, జెడ్పీటీసీ సభ్యుడు లంకే నారాయణప్రసాద్ పలువురు కౌన్సిలర్లు ప్రసంగిస్తూ జిల్లా ప్రజలకు నూతన సంవత్సరంలో మంచి జరగాలని ఆకాంక్షించారు. విసిగించిన వ్యాఖ్యాత : ఉగాది వేడుకల అధ్యక్షబాధ్యతను అధికారులు ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడికి అప్పగించారు. ఆయన విలేకరిగా కూడా పనిచేస్తుండటంతో కార్యక్రమం ఆద్యంతం ఆయన వ్యాఖ్యానంతో ప్రజలు విసిగిపోయారు. కవిసమ్మేళనం సందర్భంగా ఈయన వ్యాఖ్యానం శృతి మించింది. దీంతో వేదికపై ఉన్న భవిష్య మాట్లాడుతూ కవితలకంటే వ్యాఖ్యాత ప్రసంగమే అధికంగా ఉందని సూచించినా ఆయన తీరు మార్చుకోకపోవడం గమనార్హం. -
వారి తలరాతలు బాగున్నాయి...
ఫొటో చాలా కలర్ఫుల్గా, అద్భుతంగా ఉంది కదూ? ఫొటోయే కాదు.. ఆ విమానంలో ఉన్నవారి తలరాత కూడా చాలా బావుంది. అందుకే పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఐస్లాండ్లోని హోలుహ్రౌన్ ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వతంపై సరదాగా చక్కర్లు కొట్టాలని కొందరు సందర్శకులు ఈ విమానంలో బయలుదేరారు. సరిగ్గా అగ్నిపర్వతం దగ్గరకు వెళ్లేసరికి అది బద్దలై ఒక్కసారిగా లావా ఇంతెత్తున లేచింది. దాదాపు 850 డిగ్రీల సెల్సియస్ వేడితో ఉన్న లావా.. ఏకంగా 200 మీటర్ల ఎత్తుకు పెల్లుబికింది. అయితే అదృష్టం కలిసిరావడంతో ఈ విమానానికి ఎలాంటి ముప్పూ వాటిల్లలేదు. అదే సమయంలో ఈ అగ్నిపర్వతం చుట్టూ చక్కర్లు కొడుతున్న మరో విమానంలో నుంచి బల్దూర్ అనే వ్యక్తి ఈ చిత్రాన్ని చకచకా కెమెరాలో బంధించారు. -
అవకాశాలే కాదు.. అదృష్టమూ కలిసిరావాలి
ద్వారకాతిరుమల, న్యూస్‌లైన్ : చిత్రపరిశ్రమలో అవకాశాలతో పాటు అదృష్టం కూడా కలసిరావాలని సినీ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ తనయుడు, సినీ నటుడు విక్రమ్ అన్నారు. ద్వారకాతిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామిని శనివారం ఆయన కుటుంబ సమేతంగా కలసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ‘న్యూస్‌లైన్’తో ముచ్చటించారు. ఇప్పటివరకు ఎన్ని చిత్రాల్లో నటించారు విక్రమ్ : 10 చిత్రాల్లో నటించాను. అందులో కొడుకు, భజంత్రీలు, తెలుగమ్మాయి, బురిడి గుర్తింపుతెచ్చిన చిత్రాలు. ప్రస్తుతం ఏం చిత్రాల్లో నటిస్తున్నారు విక్రమ్ : మంచు విష్ణు కొత్త చిత్రంలో మంచి పాత్రలో నటిస్తున్నాను. విష్ణుతో ఉన్న స్నేహంతో గతంలో దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద చిత్రాలలో కలసి నటించాను. మీ తండ్రి ఎంఎస్‌తో మీరేమైనా చిత్రాల్లో నటిస్తున్నారా.. విక్రమ్ : క్రేజీవాలా అనే చిత్రంలో నటిస్తున్నాను. ఈ చిత్రం రాజకీయ ఇతివృత్తంతో సాగుతుంది. దీనిలో నా తండ్రి ఎంఎస్ పాత్ర హీరో అనే చెప్పాలి. ఆ సినిమాలో నేను స్టూడెంట్ క్యారెక్టర్లో నటిస్తున్నాను. నటనతో పాటు ఇంకేమైనా ఆశయాలు ఉన్నాయా విక్రమ్ : హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే కాకినాడ రాజీవ్‌గాంధి లా కాలేజీలో ఎంఎల్ చదువుతున్నా. మొదటి ఏడాది పూర్తి అయింది. నటనతో పాటు న్యాయవ్యవస్థలో రాణించాలన్నది నా ఆశయం.