అదృష్టం తలుపుకొడితే... | Good luck hits the door | Sakshi
Sakshi News home page

అదృష్టం తలుపుకొడితే...

Jul 12 2015 2:10 AM | Updated on Sep 3 2017 5:19 AM

అదృష్టం తలుపుకొడితే...

అదృష్టం తలుపుకొడితే...

అదృష్టం తలుపుకొడితే... ఆలస్యంగా తలుపు తెరిచిందీ జంట. లండన్‌కు 103 మైళ్ల దూరంలోని టామ్‌వర్త్ అనే చిన్న పట్టణంలో

అదృష్టం తలుపుకొడితే... ఆలస్యంగా తలుపు తెరిచిందీ జంట. లండన్‌కు 103 మైళ్ల దూరంలోని టామ్‌వర్త్ అనే చిన్న పట్టణంలో మాల్కమ్ బాస్‌వర్త్, డాన్ బాస్‌వర్త్‌లు నివసిస్తున్నారు. 64 ఏళ్ల మాల్కమ్ టిఎన్‌టి సంస్థ లో లోడింగ్ పనులను పర్యవేక్షిస్తుంటాడు. ఆమె ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. సెలవులకని ఈజిప్టుకు వెళ్లారు. అక్కడ బీచ్‌లో సేదదీరుతుండగా జూన్ 24న ఈ-మెయిల్ వచ్చింది. ఒకసారి మీరు కొన్న లాటరీ టిక్కెట్టును సరిచూసుకోమని. మొబైల్‌లో దీన్ని చూసిన మాల్కమ్ పది పౌండ్లు (దాదాపు 983 రూపాయలు) వచ్చి ఉంటుందిలే అని భార్యతో జోకేశాడు. ఆమె కూడా నవ్వుకుంది. తన లాటరీ అకౌంట్‌ను ఓపెన్ చేయడం కుదరకపోవడంతో అంతటితో తేలికగా తీసుకొని వదిలేసింది.

రెండువారాల పాటు ఈజిప్టులో సెలవులను ఎంజాయ్ చేసిన ఈ దంపతులు గత మంగళవారం స్వస్థలానికి చేరుకున్నారు. సూటుకేసులు ఖాళీచేసి, ఎక్కడివక్కడ సర్దేసిన డాన్ బాస్‌వర్త్ దుస్తులను ఉతికేసింది. మధ్యాహ్నం రెండు గంటల షిఫ్టుకు ఆఫీసుకు వెళ్లేముందు లాటరీ అకౌంట్‌ను చెక్ చేసింది. తాము గడిచిన పదమూడేళ్లుగా కొంటున్న నెంబర్లు 14, 23, 28, 33, 35... అచ్చంగా లాటరీ నెంబర్లతో సరిపోయాయి. బహుమతిగా వచ్చిన మొత్తం చూసింది. నమ్మలేకపోయింది. కాళ్లు వణుకుతున్నాయి. కూతురిని పిలిచింది... ఆమె చూసి చెప్పింది తమకు 58,72,705 పౌండ్లు (57 కోట్ల 72 లక్షల రూపాయలు) లాటరీలో తగిలాయని. అంతే ఒక్కసారిగా కుటుంబమంతా ఆనందంతో ఎగిరిగంతేశారు. తమ నలుగురు సంతానం, మనవలు, మునిమనవలు ఆర్థికంగా మంచిస్థితిలో ఉండేలా డబ్బును జాగ్రత్త చేస్తామంటోందీ జంట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement