వారి తలరాతలు బాగున్నాయి... | fortunes of the people on the plane | Sakshi
Sakshi News home page

వారి తలరాతలు బాగున్నాయి...

Published Tue, Jan 13 2015 3:55 AM | Last Updated on Sat, Sep 2 2017 7:36 PM

వారి తలరాతలు బాగున్నాయి...

వారి తలరాతలు బాగున్నాయి...

ఫొటో చాలా కలర్‌ఫుల్‌గా, అద్భుతంగా ఉంది కదూ? ఫొటోయే కాదు.. ఆ విమానంలో ఉన్నవారి తలరాత కూడా చాలా బావుంది. అందుకే పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఐస్‌లాండ్‌లోని హోలుహ్‌రౌన్ ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వతంపై సరదాగా చక్కర్లు కొట్టాలని కొందరు సందర్శకులు ఈ విమానంలో బయలుదేరారు.

 

సరిగ్గా అగ్నిపర్వతం దగ్గరకు వెళ్లేసరికి అది బద్దలై ఒక్కసారిగా లావా ఇంతెత్తున లేచింది. దాదాపు 850 డిగ్రీల సెల్సియస్ వేడితో ఉన్న లావా.. ఏకంగా 200 మీటర్ల ఎత్తుకు పెల్లుబికింది. అయితే అదృష్టం కలిసిరావడంతో ఈ విమానానికి ఎలాంటి ముప్పూ వాటిల్లలేదు. అదే సమయంలో ఈ అగ్నిపర్వతం చుట్టూ చక్కర్లు కొడుతున్న మరో విమానంలో నుంచి బల్దూర్ అనే వ్యక్తి ఈ చిత్రాన్ని చకచకా కెమెరాలో బంధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement