అశ్విన్ బాబు, దిగంగనా జంటగా నటించిన చిత్రం 'శివం భజే'. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర్ రెడ్డి నిర్మాతగా.. అప్సర్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ''వైవిధ్యమైన కథతో మా సంస్థ నిర్మాణంలో వస్తోన్న చిత్రం 'శివం భజే'. టైటిల్, ఫస్ట్ లుక్‌కు మించి టీజర్‌కు స్పందన రావడం ఆనందంగా ఉంది. జూలైలో ప్రపంచవ్యప్తంగా విడుదల చేయడానికి సిద్దమవుతున్నాం. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం' అని అన్నారు.
దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ.. " శివం భజే టైటిల్ తోనే అందరి దృష్టి ఆకర్షించాం. టీజర్‌కు ప్రేక్షకుల నుంచి ఊహించని విధంగా రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాత మహేశ్వర రెడ్డి పూర్తి సహకారంతో ఈ చిత్రం అద్భుతంగా రూపొందిస్తాం. విడుదల తేదీ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం" అని అన్నారు.
హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ.. "టీజర్‌కు అనూహ్య స్పందన వస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. అన్ని వర్గాలు ప్రేక్షకులని అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుంది. దర్శకుడు అప్సర్, నిర్మాత మహేశ్వర రెడ్డి ఈ చిత్రాన్ని ఊహించిన దానికంటే అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. మీ అందరి ఆశీర్వాదంతో త్వరలోనే మా చిత్రాన్ని మీ ముందుకి తెస్తాం" అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో అర్బాజ్ ఖాన్, హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల్తాన కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment