వినాయకచవితికి ఈ శివుడు | Ram's 'Shivam' to be released in September? | Sakshi
Sakshi News home page

వినాయకచవితికి ఈ శివుడు

Published Tue, Jul 21 2015 12:05 AM | Last Updated on Sun, Sep 3 2017 5:51 AM

వినాయకచవితికి ఈ శివుడు

వినాయకచవితికి ఈ శివుడు

మొన్న సమ్మర్‌కు ‘పండగ చేస్కో’ సినిమాతో పెద్ద కమర్షియల్ హిట్ సాధించిన యువ హీరో రామ్. ఇప్పుడు ఆయన తరువాతి సీజన్‌కు సిద్ధమైపోతున్నారు. ఈ వినాయక చవితికి ‘శివం’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించడానికి అన్ని సన్నాహాలూ చేసుకుంటున్నారు. ఈ ప్రేమకథా చిత్రాన్ని శ్రీ స్రవంతీ మూవీస్ పతాకంపై రామ్ పెదనాన్న పి. రవికిశోర్ నిర్మిస్తున్నారు. ప్రసిద్ధ దర్శకుడు సురేందర్ రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన శ్రీనివాసరెడ్డి ఈ చిత్రానికి తొలిసారిగా మెగాఫోన్ చేత పట్టారు. ఇప్పటికే అత్యధిక భాగం షూటింగ్ పూర్తయింది. మిగిలిన టాకీ భాగం షెడ్యూల్ సోమవారం హైదరాబాద్‌లోని ఆర్.ఎఫ్.సి.లో మొదలైంది.
 
  ‘‘జూలై 31 వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది. దాంతో, పాటలు మినహా మిగతా సినిమా చిత్రీకరణంతా పూర్తయిపోతుంది. ఆగస్టులో పాటల చిత్రీకరణ జరుపుతాం’’ అని నిర్మాత రవికిశోర్ తెలిపారు. ఒకపక్క ఈ పాటల చిత్రీకరణ సాగుతుండగానే, మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంతో జరపడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 17న వినాయక చవితి పర్వదినం కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారు. ఈ చిత్రంలో రామ్ సరసన రాశీఖన్నా కథా నాయిక. అభిమన్యు సింగ్ ప్రతి నాయక పాత్రధారి. బ్రహ్మానందం, జయప్రకాశ్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితర ప్రముఖులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
 
 ‘‘దర్శకుడు కొత్తవాడైనప్పటికీ, ఎక్కడా అలా అనిపించడం లేదు. చాలా చక్కగా ఈ హై ఓల్టేజ్ లవ్‌స్టోరీని తెర కెక్కిస్తున్నారు’’ అని రవికిశోర్ వ్యాఖ్యానించారు. రసూల్ ఎల్లోర్ (కెమేరా), దేవిశ్రీ ప్రసాద్ (సంగీతం), పీటర్ హెయిన్ (యాక్షన్), ఏ.ఎస్. ప్రకాశ్ (ఆర్‌‌ట) లాంటి అనుభవజ్ఞులైన టెక్నీషియన్‌‌స ఈ చిత్రానికి మరో అండ. ఆ మధ్య ‘రఘువరన్ బి.టెక్’ చిత్రానికి మాటలు రాసి, ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రామ్ ‘హరికథ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్న కిశోర్ తిరుమల ఈ సినిమాకు మాటలు అందిస్తుండడం విశేషం. లవ్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ -ఇలా అన్ని అంశాలతో రావ్‌ు ఎనర్జీ స్థాయికి తగినట్లుండే ఈ ‘శివం’తో రావ్‌ు ఈ ఏడాది మరో హిట్ సాధిస్తారా? లెటజ్ వెయిట్ అండ్ సీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement