Ravi Kishore
-
ఏసీబీకి చిక్కిన పెదకాకాని ఏఈ
నగరంపాలెం: మంజూరైన బిల్లులను ప్రాసెస్ చేసేందుకు లంచం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. ఏసీబీ ఏఎస్పీ మహేంద్ర మత్తే మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పెదకాకాని పంచాయతీ పరిధిలో సమ్మర్ స్టోరేజీ (ఎస్ఎస్) ట్యాంకర్‌కు సంబంధించి మంచినీటి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, ఫెన్సింగ్ పనులను గుంటూరు రూరల్ మండల పరిధిలోని నల్లపాడు గ్రామానికి చెందిన శ్యామల రవికిషోర్‌రెడ్డి అనే కాంట్రాక్టర్ పూర్తి చేశారు. అందుకుగాను మూడు బిల్లుల్లోనూ దాదాపు రూ.42 లక్షలు మంజూరయ్యాయి. అయితే మంజూరైన బిల్లులను ప్రాసెస్ చేసేందుకు రూరల్ వాటర్ సప్లయి/శానిటేషన్ గుంటూరు డివిజన్ పరిధిలోని పెదకాకాని ఏఈ పి.శివరామకృష్ణ కాంట్రాక్టర్ రవికిషోర్‌రెడ్డిని లంచం డిమాండ్ చేశారు. రూ.42 లక్షల బిల్లులకు నాలుగు శాతం చొప్పున రూ.1.68 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ రవికిషోర్‌రెడ్డి టోల్‌ఫ్రీ నంబర్ 14400ను సంప్రదించారు. ఏసీబీ వారి సూచనల మేరకు నగదు ఇవ్వడానికి రవికిషోర్‌రెడ్డి ఒప్పకున్నాడు. దీంతో శుక్రవారం సాయంత్రం జెడ్పీ ప్రాంగణంలో ఉన్న పీఆర్ (ఆర్డబ్ల్యూఎస్) డివిజన్ కార్యాలయం వద్దకు రావాలని కాంట్రాక్టర్‌కు ఏఈ శివరామకృష్ణ సూచించారు. దీంతో అక్కడకు వెళ్లిన కాంట్రాక్టర్ నుంచి రూ.1.68 లక్షల లంచం తీసుకుంటున్న శివరామకృష్ణను గుంటూరు ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పలకలూర్‌రోడ్‌లోని ఏఈ నివాసంలో తనిఖీలు నిర్వహించనున్నారు. ఈ దాడిలో డీఎస్పీలు టీవీవీ ప్రతాప్ కుమార్, ఎన్.సత్యానందం, సీఐలు రవిబాబు, నాగరాజు, అంజిబాబు, సురేష్ బాబు, నరసింహా రెడ్డి, ఎస్ఐ మూర్తి పాల్గొన్నారు. -
దీపావళి మనసుని హత్తుకుంటుంది
‘‘ఇప్పుడు ప్రేక్షకులు పెద్ద చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా చూస్తున్నారు. మా ‘దీపావళి’ చిన్నదైనా అందమైన సినిమా. ఇందులోని భావోద్వేగాలు ప్రేక్షకుల మనసులను హత్తుకుంటాయి’’ అని నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ అన్నారు. పూ రాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రల్లో ఆర్ఏ వెంకట్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘కీడా’ (తెలుగులో ‘దీపావళి’). కృష్ణ చైతన్య సమర్పణలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ– ‘‘నిర్మాతగా 38 ఏళ్ల జర్నీలో దాదాపుగా నేను చేసిన సినిమాలన్నీ సంతృప్తినిచ్చాయి. నేను డబ్బుల గురించి ఆలోచించను. ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ అవుతుందా? లేదా అని మాత్రమే ఆలోచిస్తా. కథ పూర్తయ్యాకే సినిమాని సెట్స్ మీదకు తీసుకెళతాను. ఓ సినిమా పూర్తయ్యాకే మరొకటి చేస్తాను. నేను తక్కువ సినిమాలు చేయడానికి కారణం అదే. ‘దీపావళి’ కథనిప్రాణం పెట్టి రాశాడు వెంకట్. చెప్పిన కథను చెప్పినట్లు స్క్రీన్ మీదకు తీసుకొచ్చాడు. మా సినిమా ఇండియన్ పనోరమాకి ఎంపికవడం గొప్ప అనుభూతి. చెన్నై ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ప్రదర్శించడం సంతోషంగా ఉంది. ఇక రామ్ హీరోగా ఓ సినిమా చేసేందుకు స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అలాగే రామ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ఉంది. ఇందుకు సరైన కథ కుదరాలి’’ అన్నారు. -
రవికిశోర్ ద్వారా మరో ముగ్గురికి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వి స్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించిన పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజి కేసులో సిట్ అధికారులు గురువారం మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 43కి, అరెస్ట్ అయిన వారి సంఖ్య 42కు చేరింది. ఈ వ్యవహారంలో సూత్రధారులుగా ఉన్న కమిషన్ మాజీ ఉద్యోగులు పులిదిండి ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి ద్వారా అనేక ప్రశ్నపత్రాలు ఒకప్పుడు కమిషన్‌లో పని చేసిన వీరి స్నేహితుడు సురేశ్‌కు చేరాయి. ఇతడు వీటిలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పేపర్లను తన అపార్ట్మెంట్లో నివసించే వారికి మధ్యవర్తి ద్వారా విక్రయించాడు. ఈ వ్యవహారంలో నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పూల రవికిశోర్ మధ్యవర్తిగా వ్యవహరించాడు. సురేశ్ గతంలోనే అరెస్టు కాగా... రవికిశోర్‌తోపాటు ఏఈ, డీఏఓ పేపర్లు ఖరీదు చేసిన అన్నాచెల్లెళ్లు రాయపురం విక్రమ్, దివ్యలను బుధవారం అరెస్టు చేశారు. సురేశ్ ద్వారా మొత్తం 14 పేపర్లు చేరినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. వీరిలో దళారులతోపాటు అభ్యర్థులూ ఉన్నారు. మరోపక్క రవికిశోర్ ఏఈ సివిల్ పేపర్లను తమ బంధువులకు ఉచితంగా ఇవ్వడంతోపాటు బయటి వారికి అమ్మినట్లు గుర్తించారు. ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్‌ను రూ.3 లక్షలకు కొనేందుకు ఒప్పందం చేసుకుని, రూ.లక్ష అడ్వాన్స్ చెల్లించిన భరత్ నాయక్‌ను, వరంగల్‌కు చెందిన బంధువులు పసి కాంతి రోహిత్‌కుమార్, గాడె సాయి మధులను గురువారం అరెస్టు చేశారు. ప్రశ్నపత్రాలు సొంతం చేసుకుని రాసిన వారిలో చాలామందికి అత్యధిక మార్కులు వచ్చినట్లు సిట్ అధికారులు చెప్తున్నారు. -
శనివారపుపేట కార్యదర్శి సస్పెన్షన్
గ్రామం వదిలి వెళ్లకూడదని కలెక్టర్ ఆదేశాలు శనివారపుపేట (ఏలూరు రూరల్): ఏలూరు మండలం శనివారపుపేట గ్రామ కార్యదర్శి నిట్టా రవికిషోర్‌ను కలెక్టర్ కె.భాస్కర్ సస్పెండ్ చేశారు. గ్రామం వదిలి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులను ఎంపీడీవో ఎన్.ప్రకాశరావు తన సిబ్బంది ద్వారా కార్యదర్శి రవికిషోర్‌కు అందజేశారు. సర్వే విధులు నిర్వహణలో నిర్లక్ష్యం వహించాడని జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు గతనెల 17న రవికిషోర్‌పై తాత్కాలిక సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ సంగతి తెలిసిన కార్యదర్శి ఏకబిగిన పనిచేసి సర్వే పూర్తి చేశారు. ఇదే సమయంలో జేసీ ఆదేశాలు అందుకోకుండా కాలయాపన చేస్తూ రాజకీయ పైరవీలు నడిపారు. ఫలితం లేకపోవడంతో తనను సస్పెన్షన్ చేసే అధికారం ఎంపీడీవోకు లేదని రాష్ట్ర పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనిపై ట్రిబ్యునల్ కార్యదర్శి అప్పీల్‌ను కొట్టేసింది. గత్యంతరం లేని సమయంలో రవికిషోర్ హైకోర్టు డివిజన్ బెంచ్ నుంచి ఎంపీడీవో ఆదేశాలు చెల్లవంటూ ఉత్తర్వులు తెచ్చుకున్నారని తెలిసింది. ఈ ఉత్తర్వుల కాపీను గత శనివారం ఎంపీడీవోకు చూపించి తనకు బాధ్యతలు అప్పగించాలని రవికిషోర్ కోరారు. ఈ మొత్తం వ్యవహారం కలెక్టర్ భాస్కర్ దృష్టికి వెళ్లడంతో ఆయన తక్షణం కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
అలాంటి థ్రిల్లే కలిగింది - రామ్
‘‘మా పెదనాన్న రవికిశోర్‌గారు ‘నువ్వే కావాలి’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘నువ్వే నువ్వే’తీస్తున్న టైమ్‌లో నేను చెన్నైలో ఉండేవాణ్ణి. వాటిల్లోని డైలాగ్స్ పెదనాన్నగారు చెబుతుంటే ఆ సినిమా ఎలా ఉంటుందో ఊహించుకుని థ్రిల్ ఫీలయ్యేవాణ్ణి. ఈ సినిమా డైలాగ్స్ విన్నప్పుడు కూడా నాకలాంటి థ్రిల్లే కలిగింది’’ అని రామ్ చెప్పారు. రామ్, కీర్తీ సురేశ్ జంటగా శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ‘నేను...శైలజ’ పాటల ఆవిష్కరణ సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ చిత్రం పాటల సీడీని రామ్ ఆవిష్కరించారు. సీనియర్ నటుడు సత్యరాజ్ మాట్లాడుతూ-‘‘ఎనర్జీకి మారు పేరు రామ్. అతనితో చేయడం చాలా బాగా అనిపించింది. ‘బాహుబలి’ తర్వాత నేను చేసిన తెలుగు సినిమా ఇది’’అని తెలిపారు. సీనియర్ నరేశ్ మాట్లాడుతూ-‘‘ ‘ శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ ’ సినిమా దగ్గర నుంచి నాకీ సంస్థతో అనుబంధం ఉంది. ‘మస్కా’లో రామ్‌తో నటించాను. అతని ఎనర్జీ సూపర్బ్. నాకు స్క్రిప్ట్ తెలుసు.అతనిది చాలా కష్టమైన క్యారెక్టర్. రామ్ తప్ప ఈ క్యారెక్టర్ ఎవరూ చేయలేరు. రామ్‌కి మరో మైల్స్టోన్ మూవీ ఇది’’ అని చెప్పారు. ‘‘కిశోర్ , రామ్ లతో కలిసి ఓ కాఫీ షాప్‌లో కూర్చుని గంటన్నరలో ‘క్రేజీ ఫీలింగ్’ అనే పాటను రాశాను. ఈ పాటను కిశోర్ బాగా తెరకెక్కించారు’’ అని రచయిత రామజోగయ్య శాస్త్రి అన్నారు. ఈ వేడుకలో నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్ , లగడపాటి శ్రీధర్, దర్శకుడు కరుణాకరన్, నటులు ప్రిన్స్, రోహిణి, శ్రీముఖి, తానియా హోప్, ప్రదీప్ రావత్, రచయితలు భాస్కరభట్ల, అనంత్‌శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
వినాయకచవితికి ఈ శివుడు
మొన్న సమ్మర్‌కు ‘పండగ చేస్కో’ సినిమాతో పెద్ద కమర్షియల్ హిట్ సాధించిన యువ హీరో రామ్. ఇప్పుడు ఆయన తరువాతి సీజన్‌కు సిద్ధమైపోతున్నారు. ఈ వినాయక చవితికి ‘శివం’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించడానికి అన్ని సన్నాహాలూ చేసుకుంటున్నారు. ఈ ప్రేమకథా చిత్రాన్ని శ్రీ స్రవంతీ మూవీస్ పతాకంపై రామ్ పెదనాన్న పి. రవికిశోర్ నిర్మిస్తున్నారు. ప్రసిద్ధ దర్శకుడు సురేందర్ రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన శ్రీనివాసరెడ్డి ఈ చిత్రానికి తొలిసారిగా మెగాఫోన్ చేత పట్టారు. ఇప్పటికే అత్యధిక భాగం షూటింగ్ పూర్తయింది. మిగిలిన టాకీ భాగం షెడ్యూల్ సోమవారం హైదరాబాద్‌లోని ఆర్.ఎఫ్.సి.లో మొదలైంది. ‘‘జూలై 31 వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది. దాంతో, పాటలు మినహా మిగతా సినిమా చిత్రీకరణంతా పూర్తయిపోతుంది. ఆగస్టులో పాటల చిత్రీకరణ జరుపుతాం’’ అని నిర్మాత రవికిశోర్ తెలిపారు. ఒకపక్క ఈ పాటల చిత్రీకరణ సాగుతుండగానే, మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంతో జరపడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 17న వినాయక చవితి పర్వదినం కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారు. ఈ చిత్రంలో రామ్ సరసన రాశీఖన్నా కథా నాయిక. అభిమన్యు సింగ్ ప్రతి నాయక పాత్రధారి. బ్రహ్మానందం, జయప్రకాశ్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితర ప్రముఖులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ‘‘దర్శకుడు కొత్తవాడైనప్పటికీ, ఎక్కడా అలా అనిపించడం లేదు. చాలా చక్కగా ఈ హై ఓల్టేజ్ లవ్‌స్టోరీని తెర కెక్కిస్తున్నారు’’ అని రవికిశోర్ వ్యాఖ్యానించారు. రసూల్ ఎల్లోర్ (కెమేరా), దేవిశ్రీ ప్రసాద్ (సంగీతం), పీటర్ హెయిన్ (యాక్షన్), ఏ.ఎస్. ప్రకాశ్ (ఆర్ట) లాంటి అనుభవజ్ఞులైన టెక్నీషియన్స ఈ చిత్రానికి మరో అండ. ఆ మధ్య ‘రఘువరన్ బి.టెక్’ చిత్రానికి మాటలు రాసి, ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రామ్ ‘హరికథ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్న కిశోర్ తిరుమల ఈ సినిమాకు మాటలు అందిస్తుండడం విశేషం. లవ్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ -ఇలా అన్ని అంశాలతో రావ్‌ు ఎనర్జీ స్థాయికి తగినట్లుండే ఈ ‘శివం’తో రావ్‌ు ఈ ఏడాది మరో హిట్ సాధిస్తారా? లెటజ్ వెయిట్ అండ్ సీ. -
రామ్ ‘హరికథ’
రామ్ హరికథ చెప్పడానికి సిద్ధమవుతున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదూ. వేరే ఏం లేదు. ఇప్పటికే ‘పండగ చేస్కో’, ‘శివమ్’ చిత్రాల్లో నటిస్తున్న రామ్ మరో చిత్రం షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. దీనికి వర్కింగ్ టైటిల్‌గా ‘హరికథ’ అనుకుంటున్నారు. హరి అనే కుర్రాడి కథ ఇది అని ఊహించవచ్చు. ‘రఘువరన్ బీటెక్’ చిత్రానికి సంభాషణలు రాసిన కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.