వివాదానికి తెర తీస్తున్న హీరో
శాండల్ వుడ్లోనే కాదు టాలీవుడ్లో కూడా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఉపేంద్ర. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఎ, రా, ఉపేంద్ర సినిమాలు తెలుగులో కూడా సంచలనాలు నమోదు చేశాయి. అందుకే ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన కన్నడ సినిమాలో తెలుగులోనూ రిలీజ్ అవుతుంటాయి. ఇటీవల ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన కన్నడ సినిమా శివం. ముందుగా ఈ సినిమాకు బసవణ్ణ అనే టైటిల్ను నిర్ణయించిన వివాదాలు రావడంతో శివం పేరుతో రిలీజ్ చేసి విజయం సాధించారు.
అయితే ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో డబ్ చేసిన రిలీజ్ చేయనున్నారు. శివం సినిమా తెలుగు వర్షన్కు బ్రాహ్మణ అనే టైటిల్ను నిర్ణయించారు. ఇప్పటికే తెలుగు సినిమాల్లో బ్రాహ్మణులను కించపరుస్తున్నారంటూ చాలా రోజులుగా ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఉపేంద్ర ఏకంగా ఓ యాక్షన్ సినిమాకు బ్రాహ్మణ అనే టైటిల్ను పెడితే ఊరుకుంటారా..? అయితే కథ కోసం ఈ టైటిల్ను పెట్టారా..? లేక వివాదాలతో పబ్లిసిటీ చేసుకోవాలన్న ఆలోచనలో పెట్టారో గాని.. ఉపేంద్ర సినిమా టైటిల్ మరోసారి టాలీవుడ్లో వివాదాలకు కారణం అవ్వటం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది.