
శ్రీను వైట్లకు హీరో దొరికాడు..!
ఆగడు, బ్రూస్ లీ సినిమాల ఫెయిల్యూర్స్తో కష్టాల్లో పడ్డ శ్రీను వైట్ల ప్రస్తుతం తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. స్టార్ హీరోలతో సినిమా చేయడానికి ప్రయత్నించినా ఇప్పట్లో ఎవరూ డేట్స్ ఇచ్చే ఛాన్స్ కనిపించకపోవటంతో ఇక యంగ్ హీరోల మీద దృష్టి పెట్టాడు. తన మార్క్ కామెడీ సబ్జెక్ట్తో తిరిగి బ్లాక్బస్టర్ హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు.
ఇన్నాళ్లు రామ్తో సినిమా చేయడానికి వెయిట్ చేసిన శ్రీను వైట్ల, రామ్ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో మరో హీరో కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. లోఫర్ సినిమా తరువాత ఇంత వరకు సినిమా స్టార్ట్ చేయని వరుణ్ తేజ్తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే శ్రీను వైట్ల చెప్పిన కథ నాగబాబు, వరుణ్లకు నచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. మరి వరుణ్తో అయినా శ్రీను వైట్ల సినిమా పట్టాలెక్కుతుందేమో చూడాలి.