తెలుగు యంగ్ హీరోల్లో సందీప్ కిషన్ ఒకడు. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు. కాకపోతే సరైన హిట్ పడటం లేదు. ఓవైపు యాక్టింగ్ చేస్తూనే మరోవైపు రెస్టారెంట్ బిజినెస్‌లోనూ ఉన్నాడు. ఇలా రెండు చేతులతో సంపాదిస్తున్న ఇతడు.. ఇప్పుడు తన తల్లికి అపురూపమైన బహుమతి ఇచ్చాడు. ఆ విషయాన్నే చెబుతూ తెగ మురిసిపోయాడు.
(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న రామ్ చరణ్ 'ఆరెంజ్' హీరోయిన్)
'మా అమ్మకు బర్త్ డేకి ముందే గిఫ్ట్ ఇస్తున్నా. ఇప్పటికీ అమ్మ.. ఆల్ ఇండియా రేడియోలో జాబ్ చేసేందుకు సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు కారు కొనివ్వమని అడిగింది. ఇప్పుడు అది నెరవేర్చా. చిన్న కానుకలే బోలెడంత సంతోషాన్ని ఇస్తాయి' అని సందీప్ కిషన్ రాసుకొచ్చాడు. గిఫ్ట్ ఇచ్చిన ఈ రేంజ్ రోవర్ కారు ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.1.50 కోట్ల నుంచి రూ.2 కోట్ల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది.
2010లో 'ప్రస్థానం' సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన సందీప్ కిషన్.. ఇప్పుడు తెలుగు, తమిళంలో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ ఏడాది 'ఊరు పేరు భైరవకోన', 'కెప్టెన్ మిల్లర్', 'రాయన్' తదితర సినిమాలు చేశాడు. ప్రస్తుతం 'మజాకా' అనే కామెడీ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు. ఇది సంక్రాంతికి రిలీజ్ అన్నారు. కానీ పండక్కి చరణ్, బాలకృష్ణ, వెంకటేశ్ మూవీస్ విడుదల కానున్నాయి. సందీప్ మూవీ కూడా అదే టైంకి అంటే కష్టమే.
(ఇదీ చదవండి: ఇంత దిగజారుతావ్ అనుకోలేదు.. హీరో ధనుష్‌తో నయనతార గొడవ)
Comments
Please login to add a commentAdd a comment