
Ranbir Kapoor Range Rover: ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ 'రణబీర్ కపూర్' ఇటీవల బ్రిటీష్ బ్రాండ్ 'రేంజ్ రోవర్' (Range Rover) కంపెనీకి చెందిన ఖరీదైన కారుని తన గ్యారేజిలో చేర్చారు. దీని ధర ఏకంగా రూ. 4 కోట్లు వరకు ఉంటుందని సమాచారం. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నిజానికి కార్ల మీద సాధారణ ప్రజలకంటే కూడా సెలబ్రిటీలకు మక్కువ చాలా ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భాగంగానే వారు ఎప్పటికప్పుడు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. కాగా ఇప్పుడు రణబీర్ మరో ఖరీదైన కారుని తన గ్యారేజిలో చేర్చారు.
రేంజ్ రోవర్ ఫీచర్స్..
రణబీర్ కపూర్ కొత్త రేంజ్ రోవర్ లాంగ్ వీల్‌బేస్ వెర్షన్, ఇది VIP నంబర్ ప్లేట్ కలిగి ఉంది. అద్భుతమైన డిజైన్ అధునాతన ఫీచర్స్ కలిగిన ఈ కారులో 35 స్పీకర్లతో కూడిన మెరిడియన్ సౌండ్ సిస్టమ్, 13.1 ఇంచెస్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, రియర్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి. భారతదేశంలో రేంజ్ రోవర్ మల్టిపుల్ ఇంజిన్ ఎంపికలతో వస్తుంది.
ఇదీ చదవండి: ప్రపంచంలో ఖరీదైన ఎలక్ట్రిక్ కారు - కేవలం 10 మందికి మాత్రమే..
రణబీర్ బెల్గ్రావియా గ్రీన్ షేడ్‌లో కనిపించే కొత్త ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ బ్రాండ్ కార్లను అజయ్ దేవగన్, సంజయ్ దత్, నిమ్రత్ కౌర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి నటులు కూడా కలిగి ఉన్నారు. రణ్‌బీర్ కపూర్‌కు లగ్జరీ ఎస్‌యూవీలంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే ఆతని వద్ద కొత్త రేంజ్ రోవర్ కారుతో పాటు మెర్సిడెస్-AMG G63, ఆడి A8L వంటి మరెన్నో ఖరీదైన కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment