భారత్‌లో సరికొత్త జర్మన్ బ్రాండ్ కారు లాంచ్: వివరాలు | Mercedes GLE 300d 4Matic AMG Line Launched In India, Check Price Details And Specifications | Sakshi
Sakshi News home page

భారత్‌లో సరికొత్త జర్మన్ బ్రాండ్ కారు లాంచ్: వివరాలు

Published Tue, Aug 13 2024 9:23 PM | Last Updated on Wed, Aug 14 2024 11:01 AM

Mercedes GLE 300d 4Matic AMG Line launched in India

మెర్సిడెస్ బెంజ్ ఇండియన్ మార్కెట్లో 'జీఎల్ఈ 300డీ 4మ్యాటిక్ ఏఎంజీ లైన్' లాంచ్ చేసింది. సంస్థ లాంచ్ చేసిన ఈ లగ్జరీ కారు ధర రూ. 97.85 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఎక్కువ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.

కొత్త మెర్సిడెస్ బెంజ్ కారు త్రీ-పాయింటెడ్ స్టార్ ప్యాటర్న్‌తో కూడిన డైమండ్ గ్రిల్, స్పోర్టియర్ ఎయిర్ ఇన్‌లెట్‌లు, క్రోమ్ ఇన్సర్ట్ & బ్లాక్ సరౌండ్‌తో మ్యాట్ డార్క్ గ్రేలో పెయింట్ చేసి ఉండటం చూడవచ్చు. ఇందులోని అప్డేటెడ్ ఫీచర్స్ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 300డీ 4మ్యాటిక్ ఏఎంజీ లైన్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 269 హార్స్ పవర్, 550 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 48వీ మైల్డ్-హైబ్రిడ్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్-జెనరేటర్ కూడా పొందుతుంది. ఇది 20 హార్స్ పవర్, 200 న్యూటన్ మీటర్ టార్క్ అదనంగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ లగ్జరీ కారు టాప్ స్పీడ్ గంటకు 230 కిమీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement