Ranbir Kapoo
-
యానిమల్ మూవీ కాస్ట్ ఫోటోలు
-
కొత్త కారు కొన్న రణబీర్ కపూర్ - ధర తెలిస్తే అవాక్కవుతారు!
Ranbir Kapoor Range Rover: ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ 'రణబీర్ కపూర్' ఇటీవల బ్రిటీష్ బ్రాండ్ 'రేంజ్ రోవర్' (Range Rover) కంపెనీకి చెందిన ఖరీదైన కారుని తన గ్యారేజిలో చేర్చారు. దీని ధర ఏకంగా రూ. 4 కోట్లు వరకు ఉంటుందని సమాచారం. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి కార్ల మీద సాధారణ ప్రజలకంటే కూడా సెలబ్రిటీలకు మక్కువ చాలా ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భాగంగానే వారు ఎప్పటికప్పుడు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. కాగా ఇప్పుడు రణబీర్ మరో ఖరీదైన కారుని తన గ్యారేజిలో చేర్చారు. రేంజ్ రోవర్ ఫీచర్స్.. రణబీర్ కపూర్ కొత్త రేంజ్ రోవర్ లాంగ్ వీల్‌బేస్ వెర్షన్, ఇది VIP నంబర్ ప్లేట్ కలిగి ఉంది. అద్భుతమైన డిజైన్ అధునాతన ఫీచర్స్ కలిగిన ఈ కారులో 35 స్పీకర్లతో కూడిన మెరిడియన్ సౌండ్ సిస్టమ్, 13.1 ఇంచెస్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, రియర్ సీట్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి. భారతదేశంలో రేంజ్ రోవర్ మల్టిపుల్ ఇంజిన్ ఎంపికలతో వస్తుంది. ఇదీ చదవండి: ప్రపంచంలో ఖరీదైన ఎలక్ట్రిక్ కారు - కేవలం 10 మందికి మాత్రమే.. రణబీర్ బెల్గ్రావియా గ్రీన్ షేడ్‌లో కనిపించే కొత్త ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ బ్రాండ్ కార్లను అజయ్ దేవగన్, సంజయ్ దత్, నిమ్రత్ కౌర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి నటులు కూడా కలిగి ఉన్నారు. రణ్‌బీర్ కపూర్‌కు లగ్జరీ ఎస్‌యూవీలంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే ఆతని వద్ద కొత్త రేంజ్ రోవర్ కారుతో పాటు మెర్సిడెస్-AMG G63, ఆడి A8L వంటి మరెన్నో ఖరీదైన కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం. -
రణబీర్‌కపూర్ ప్రేమలో శ్రుతి పడిందా..?
బాలీవుడ్ యువ నటుడు రణబీర్‌కపూర్, నటి శ్రుతిహసన్ ప్రేమలో పడ్డారనే ప్రచారం మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇలాంటి వ్యవహారాల్లో రణబీర్ కపూర్ చాలా చరిత్రనే ఉంది. ఈ సంచలన నటుడు నటి కత్రినాకైఫ్ డీప్‌గా ప్రేమించుకున్నారు. ఎంతగా అంటే ఇద్దరూ కలిసి కొన్నాళ్లు సహజీవనం సాగించేంతగా. రణబీర్‌కపూర్, కత్రినాకైఫ్‌ల ప్రేమ పెళ్లికి దారి తీస్తుందనే అనుకున్నారంతా. అయితే ఇటీవలే వారిద్దరూ విడిపోయారు. అయితే వీరు విడిపోవడానికి నటి దీపికాపదుకోనే కారణం అనే ప్రచారం జరిగింది. అంతకు ముందు రణబీర్‌కపూర్, దీపికల మధ్య ప్రేమకు ముసలం పుట్టడానికి కారణం కత్రినాకైఫేనని, అందుకు దీపకాపదుకోనే ప్రతీకారం తీర్చుకున్నారని బాలీవుడ్లో ప్రచారం జోరుగా జరిగింది. ఇలాంటి పరిస్థితిలో నటుడు రణబీర్‌కపూర్ కొత్త లవర్ వేటలో ఉన్నారని, అది నటి శ్రుతిహాసన్‌తో నెరవేరిందని తాజాగా ఒక ఆంగ్ల పత్రిక ప్రచురించి సంచలన చర్చకు దారి తీసింది. శ్రుతిహసన్ బహుభాషా నటి అన్న విషయం తెలిసిందే. తమిళం,తెలుగు, హిందీ భాషల్లో క్రేజీ నాయకిగా రాణిస్తున్నారు. ఇటీవల రణబీర్‌కపూర్,నటి శ్రుతిహసన్ కలిసి ఒక వాణిజ్య ప్రకటనలో నటించారు. ఈ ప్రకటనలో వారి జంట బాగుందనే ప్రశంసలు అందుకున్నారు. అయితే ఆ యాడ్‌లో వర్కౌట్ అయిన రణబీర్‌కపూర్, శ్రుతిల కెమిస్ట్రీ వారి మధ్య ప్రేమకు దారి తీసిందనే వదంతులు దొర్లుతుండడం గమనార్హం. ఏ విషయాన్నైనా నిర్భయంగా చెప్పే శ్రుతిహాసన్ ఇప్పుడు రణబీర్‌కపూర్‌తో తనను కలుపుతూ జరుగుతున్న ప్రచారం గురించి ఎలా స్పందిస్తారో చూడాలి.