రణబీర్‌కపూర్ ప్రేమలో శ్రుతి పడిందా..?
బాలీవుడ్ యువ నటుడు రణబీర్‌కపూర్, నటి శ్రుతిహసన్ ప్రేమలో పడ్డారనే ప్రచారం మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇలాంటి వ్యవహారాల్లో రణబీర్ కపూర్ చాలా చరిత్రనే ఉంది. ఈ సంచలన నటుడు నటి కత్రినాకైఫ్ డీప్‌గా ప్రేమించుకున్నారు. ఎంతగా అంటే ఇద్దరూ కలిసి కొన్నాళ్లు సహజీవనం సాగించేంతగా. రణబీర్‌కపూర్, కత్రినాకైఫ్‌ల ప్రేమ పెళ్లికి దారి తీస్తుందనే అనుకున్నారంతా. అయితే ఇటీవలే వారిద్దరూ విడిపోయారు. అయితే వీరు విడిపోవడానికి నటి దీపికాపదుకోనే కారణం అనే ప్రచారం జరిగింది.
అంతకు ముందు రణబీర్‌కపూర్, దీపికల మధ్య ప్రేమకు ముసలం పుట్టడానికి కారణం కత్రినాకైఫేనని, అందుకు దీపకాపదుకోనే ప్రతీకారం తీర్చుకున్నారని బాలీవుడ్‌లో ప్రచారం జోరుగా జరిగింది. ఇలాంటి పరిస్థితిలో నటుడు రణబీర్‌కపూర్ కొత్త లవర్ వేటలో ఉన్నారని, అది నటి శ్రుతిహాసన్‌తో నెరవేరిందని తాజాగా ఒక ఆంగ్ల పత్రిక ప్రచురించి సంచలన చర్చకు దారి తీసింది. శ్రుతిహసన్ బహుభాషా నటి అన్న విషయం తెలిసిందే. తమిళం,తెలుగు, హిందీ భాషల్లో క్రేజీ నాయకిగా రాణిస్తున్నారు.
ఇటీవల రణబీర్‌కపూర్,నటి శ్రుతిహసన్ కలిసి ఒక వాణిజ్య ప్రకటనలో నటించారు. ఈ ప్రకటనలో వారి జంట బాగుందనే ప్రశంసలు అందుకున్నారు. అయితే ఆ యాడ్‌లో వర్కౌట్ అయిన రణబీర్‌కపూర్, శ్రుతిల కెమిస్ట్రీ వారి మధ్య ప్రేమకు దారి తీసిందనే వదంతులు దొర్లుతుండడం గమనార్హం. ఏ విషయాన్నైనా నిర్భయంగా చెప్పే శ్రుతిహాసన్ ఇప్పుడు రణబీర్‌కపూర్‌తో తనను కలుపుతూ జరుగుతున్న ప్రచారం గురించి ఎలా స్పందిస్తారో చూడాలి.