‘‘ప్రేమించండి. మిమ్మల్ని మీరు ప్రేమించండి’’ అంటున్నారు శ్రుతీహాసన్. ఈ విషయం గురించి వివరంగా మాట్లాడుతూ– ‘‘మన అమ్మానాన్నలను, తోడబుట్టినవాళ్లను, స్నేహితులను, జీవిత భాగస్వామిని.. ఇలా లైఫ్‌టైమ్‌లో చాలామందిని ప్రేమిస్తాం. మరి మనల్ని మనం ప్రేమిస్తున్నామా? అని ఎవరైనా ఒక్కక్షణం ఆలోచించాలి. మిమ్మల్ని మీరు ప్రేమిస్తే ఓకే. లేకపోతే ఈ క్షణం నుంచి మిమ్మల్ని మీరు ప్రేమించడం మొదలుపెట్టండి. మీ తొలి ప్రాధాన్యత మీరే అవ్వాలి. ఆ తర్వాతే వేరే ఎవరైనా.
వాళ్లేదో అనుకుంటారు.. వీళ్లేదో అనుకుంటారని ఆలోచించొద్దు. ఎవరేం అనుకున్నా ఫర్వాలేదు. మీకు నచ్చినట్లుగా మీరు ఉండండి. అప్పుడే జీవితానికో అర్థం ఉంటుంది. ఇతరుల కోసం బతికితే మన జీవితం మనది కానట్లే’’ అన్నారు శ్రుతీహాసన్. ప్రస్తుతం హిందీలో ఓ సినిమా చేస్తున్న శ్రుతి ఇటీవల తమిళంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.
అప్పుడే జీవితానికో అర్థం!
Published Sun, Feb 24 2019 12:53 AM | Last Updated on Sun, Feb 24 2019 12:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment