ప్రముఖ తమిళ నటి ప్రియా భవాని ప్రేమలో పడిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియా భవాని ఇటీవలె లైవ్‌లో నెటిజన్లతో సంభాషించింది. ఈ సందర్భంగా ఆమె వివాహం గురించి ఓ నెటిజన్ ప్రశ్నించగా దానికి స్పందించిన ప్రియా భవాని ప్రస్తుతం తాను ప్రేమలో ఉన్నానని, అయితే ఇప్పుడు తన దృష్టి అంతా కెరీర్‌పైనే ఉందని స్పష్టం చేసింది. సమయం వచ్చినప్పుడు తన వ్యక్తిగత జీవితం గురించి మరిన్ని వివరాలు వెల్లడిస్తాను అని పేర్కొంది.
అయితే తాను ప్రేమిస్తున్న వ్యక్తి ఇండస్ర్టీకి చెందిన వ్యక్తి ఏనా? కాదా అన్న విషయాలను మాత్రం ఆమె రివీల్ చేయలేదు. దీంతో ప్రియా భవానీ ప్రేమిస్తున్న వ్యక్తి ఎవరా అనా ఇప్పడే నెటిజన్లలో రకరకాల సందేహాలు మొదలయ్యాయి. ఇక న్యూస్‌రీడర్‌గా కెరీర్ మొదలు పెట్టిన ప్రియా భవానీ అతి కొద్ది కాలంలోనే మంచి పాపులారిటీని సంపాదించింది. ఆ తర్వాత పలు సీరియల్స్‌తో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అనంతరం ఆమెకున్న క్రేజ్‌తో సినిమాల్లోనూ అవకశాలు వచ్చాయి. ఇప్పటికే మేయాధ మాన్, కడైకుట్టి వంటి చిత్రాల్లో నటించిన ప్రియా భవానీ ప్రస్తుతం కమల్‌హాసన్ చేస్తోన్న ఇండియన్-2 చిత్రంలో నటిస్తుంది.
చదవండి : ముఖంపై మొటిమలు రాకుండా ఉమ్మి వాడుతా: తమన్నా
మరోసారి రిపీట్ కానున్న ధనుష్-సాయిపల్లవి జోడీ
Comments
Please login to add a commentAdd a comment