relationship status
-
మంగోలియా, జపాన్లలో నేటి నుంచి రాజ్‌నాథ్ పర్యటన
న్యూఢిల్లీ: మంగోలియా, జపాన్లలో ఐదు రోజుల పర్యటనకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం బయలుదేరి వెళ్లారు. మారుతున్న ప్రపంచ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ రెండు దేశాలతో వ్యూహాత్మక, రక్షణ సంబంధాల బలోపేతమే లక్ష్యంగా పర్యటన సాగనుందని విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. 5 నుంచి 7 వరకు మంగోలియాలో ఆయన పర్యటన ఉంటుంది. భారత రక్షణ మంత్రి ఒకరు మంగోలియాలో పర్యటించడం ఇదే ప్రథమం. అనంతరం 8, 9 తేదీల్లో జపాన్ పర్యటన సందర్భంగా జరిగే 2+2 విదేశాంగ, రక్షణ మంత్రుల సమావేశాల్లో రాజ్‌నాథ్‌తోపాటు జై శంకర్ కూడా పాల్గొంటారు. -
డేటింగ్లో ఉన్నా.. కానీ ఆమెకు ఇష్టం ఉండదు: విజయ్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సాన పనిలేదు. విడుదలకు ముందే ఆయన నటించిన లైగర్ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తుంది. ఈనెల25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న విజయ్ తాజాగా తన రిలేషన్షిప్ స్టేటస్‌పై ఓపెన్ అయ్యాడు. ఓ ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ.. 'నా పర్సనల్ లైఫ్ గురించి బయటపెట్టడం ఇష్టం ఉండదు. నటుడిగా పబ్లిక్ లైఫ్‌లో ఉండటం నాకు ఇష్టమే. కానీ పబ్లిక్‌లో ఫోకస్ కావడం ఆమెకు నచ్చకపోవచ్చు. అందుకే ఆమె స్వేచ్ఛకు భంగం కలిగించాలనుకోవడం లేదు ' అంటూ చెప్పుకొచ్చాడు దీంతో విజయ్ డేటింగ్లో ఉన్న అమ్మాయి ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదని తేలిపోయిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా విజయ్ స్టేట్మెంట్తో రష్మికతో డేటింగ్ రూమర్స్‌కి కూడా చెక్ పెట్టినట్లయ్యింది. -
తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించిన లవ్‌బర్డ్స్
గత కొంతకాలంగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, హీరో జహీర్ ఇక్బాల్‌తో డేటింగ్లో ఉన్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పుకార్లను కొట్టిపారేసింది ఈ జంట. అయినా వీరిద్దరి రిలేషన్‌పై రూమార్స్ వస్తూనే ఉన్నాయి. దీనికి కారణం ముంబై రోడ్లపై వీరిద్దరు జంటగా చక్కర్లు కొట్టడం, విందులు, వినోదాలకు హజరవ్వడమే. అంతేకాదు ఇద్దరు క్లోజ్‌గా దిగిన ఫొటోలను కూడా తరచూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వారు ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ ఫిక్సయిపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల సోనాక్షి బర్త్‌డే సందర్భంగా తమ సీక్రెట్ రిలేషన్‌ను అఫిషీయల్ చేసింది ఈ జంట. చదవండి: ‘విక్రమ్’.. 13 మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు కమల్ సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఈ సందర్భంగా సోనాక్షితో కలిసి విమానంలో పయనిస్తున్న ఓ ఫన్నీ వీడియోను షేర్ చేసిన ఇక్బాల్ ఆమెకు పబ్లిక్‌గా లవ్యూ చెప్పాడు. ‘హ్యాపీ బర్త్ డే. నన్ను చంపనందుకు థాంక్యూ. ఐ లవ్యూ’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీనిపై సోనాక్షి సైతం స్పందించింది. ‘ఐ లవ్యూ. ఇప్పుడు నేను నిన్ను చంపడానికి వస్తున్నా’ అని అతడి పోస్ట్‌పై కామెంట్ చేసింది. దీంతో వీరిద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నారని స్పష్టమైంది. ఇది చూసిన వీరి ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక్బాల్ పోస్ట్ బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం స్పదించారు. కాగా ఇటీవల సోనాక్షి చేతికి డైమండ్ రింగ్ పెట్టుకున్న ఫొటోలను షేర్ చేస్తూ తన డ్రీమ్ నిజమైందంటూ క్యాప్షన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: సాయి పల్లవికి పెద్ద ఫ్యాన్‌ని: బాలీవుడ్ డైరెక్టర్ అంతేకాదు ఈ ఫొటో పక్కనే ఉన్న వ్యక్తి కనిపించకుండ జాగ్రత్త పడింది. దీంతో ఇక్బాల్‌కు తనకు నిశ్చితార్థమైందని ఒక్కసారిగా వార్తలు గుప్పమనగా.. మిమ్మల్ని ఫూల్ చేశానంటూ మరో పోస్ట్ చేసింది సోనాక్షి. అది రింగ్ కాదని, తన కొత్త బ్రాండ్ నెయిల్ పాలిష్‌ను ప్రమోట్ చేశానంటూ నెటిజన్లకు షాకిచ్చింది. దబాంగ్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సోనాక్షికి పలు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె ఏడాది ఒక సినిమా చేస్తూ వస్తోంది. ఇక జహీర్ ఇక్బాల్ 2019లో నోట్‌బుక్ మూవీతో సినీరంగ ప్రవేశం చేశాడు. ఆ వెంటనే డబుల్ ఎక్సెల్ మూవీ చేశాడు. ఇందులో సోనాక్షితో జతకట్టాడు. ఈ మూవీ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడినట్లు సమాచారం. View this post on Instagram A post shared by Zaheer Iqbal (@iamzahero) -
నేను సింగిల్, కాదు మింగిల్.. ఏం చెప్పాలో తెలియట్లేదు: అనుపమ పరమేశ్వరన్
Anupama Parameswaran Reveals Her Love Life In Latest Interview: ‘ప్రేమమ్’ మూవీతో సినీ పరిశ్రమకు పరిచయమైంది మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. చేసింది కొన్ని సినిమాలే అయినా అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. సినిమాల్లో డిసెంట్ రోల్స్ ఎంచుకుంటూ అందం, అభినయంతో ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. ఎక్కువ సమయంలో సోషల్ మీడియాలో గడిపే అనుపమ తరచూ తన ఫొటోలను, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు చేరువుగా ఉంటోంది. ఈ క్రమంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇటీవల రౌడీబాయ్స్ మూవీతో సందడి చేసిన అనుపమ ప్రస్తుతం కార్తికేయ 2, 18 పేజీస్, బటర్ ఫ్లై సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఈ క్యూట్గుమ్మ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రిలేషన్‌షిప్‌పై ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'నాకు లవ్ మ్యారేజ్‌పై మంచి అభిప్రాయమే ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న కపుల్స్‌ను చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది. నాకు కూడా ప్రేమ వివాహమే చేసుకోవాలని ఉంది. మా పేరేంట్స్‌కు కూడా ఈ విషయం తెలుసు. నేను పెళ్లంటు చేసుకుంటే కచ్చితంగా లవ్ మ్యారెజే చేసుకుంటా. నేను సింగిల్.. కాదు మింగిల్.. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే నా రిలేషన్షిప్ స్టేటస్ నాకు కూడా సరిగ్గా తెలియట్లేదు. నేనైతే ప్రేమలో ఉన్నా.. మరి అవతలి సైడ్ నుంచి ఏమనుకుంటున్నారో తెలియదు. ప్రస్తుతం వన్ సైడ్ లవ్ అని చెప్పగలను.' అంటూ తెలిపింది అనుపమ పరమేశ్వరన్. చదవండి: లిప్ లాక్ సీన్లు.. అందుకే ఆ రేంజ్లో అనుపమ రెమ్యునరేషన్! -
రిలేషన్ షిప్ స్టేటస్‌ను బయటపెట్టనున్న కియారా..
Kiara Advani And Sidharth Malhotra Relationship: బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాలు గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్‌లో వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. . అయితే వీరి రిలేషన్‌పై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు. వారి ప్రేమాయణాన్ని గొప్యంగా ఉంచుతూ వస్తున్నారు. కానీ వీళ్లిద్దరూ కలిసి హాలీడే వెకేషన్స్‌కి వెళ్లడం,ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకుంటూ కెమెరాలకు చిక్కారు. అంతేగాక కియారా పలుసార్లు మల్హోత్రా ఇంటికి వెళ్లిన వీడియో, ఫొటోలు గతంలో విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రేమజంట తమ రిలేషన్ షిప్‌ను బయటపెట్టాలని చూస్తున్నారట. కొత్త సంవత్సరం సందర్భంగా ఇద్దరూ తమ ప్రేమను అఫీషియల్‌గా అనౌన్స్ చేయడానికి సిద్ధమైనట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. అంతేకాకుండా త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. కాగా కాగా సిద్దార్థ్, కియారాలు తొలిసారి జంటగా‘షెర్షా’మూవీలో కలిసి నటించారు. ఆ సినిమా సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని బీటౌన్ టాక్. -
17ఏళ్ల తర్వాత.. ‘మాస్క్ ముద్దు’తో మళ్లీ కలిసిన ‘బెన్నీఫర్’
పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్, హాలీవుడ్ నటుడు బెన్ అఫ్లెక్ మళ్లీ ఒకటై అభిమానులను సంతోషంలో ముంచెత్తారు. ఒకటైన తర్వాత వారిద్దరూ మాస్క్‌తోనే ముద్దు పెట్టుకున్నా పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెన్నిఫర్‌గా గుర్తింపు పొందిన ఈ జంట 2002లో నిశ్చితార్థం చేసుకుంది. నిజానికి 2003లో వివాహం చేసుకున్నారు. అయితే అది డిలే అయ్యింది. అనంతరం 2004లో విభేదాలతో విడిపోయారు. బ్రేకప్ తర్వాత జెన్నీ,మార్క్ ఆంటోనిని వివాహం చేసుకోగా.. ఆమె ప్రియుడు బెన్, జెన్నిఫర్ గార్నెర్ని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరూ వారి లైఫ్ పార్టనర్స్ నుంచి విడాకులు తీసుకున్నారు. కాగా వీరిద్దరూ మళ్లీ ఒకటైన విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ జెన్నీ తన 52 పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేసి తన సంతోషాన్ని తెలిపింది. అయితే మళ్లీ కలిసిన వారిద్దరూ మొదటి సారి గత వారం వెనిస్ లిడోలో జరిగిన 78 వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్‌కార్పెట్‌పై జంటగా నడిచారు. తాజగా సోమవారం (సెప్టెంబర్ 14న) మెట్ గాలా 2021లో రెడ్ కార్పెట్‌పై మరోసారి కనిపించిన ఈ జంట మాస్క్‌తోనే ముద్దు పెట్టుకొని అభిమానులకు కనులవిందు కలిగించారు. బెన్నీఫర్ ముద్దు ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా 17ఏళ్ల కలిసిన ఈ కపుల్‌ని చూసిన అభిమానులు ‘వావ్ అమేజింగ్’‘ఎప్పటికీ బెస్ట్ జోడి’ అంటూ కామెంట్ పెడుతున్నారు. "And then we kiss your our love comes alive on my lips"#MetGala2021 #Bennifer #BritneySpears pic.twitter.com/SfV2qngBj7 — I'm Still... (@BraveOnthe6) September 14, 2021 Living for #bennifer pic.twitter.com/s3HLurWllq — Momo (@MomoCominThru) September 14, 2021 -
హీరోయిన్ను ఆ విషయం గురించి డైరెక్ట్‌గా అడిగేసిన నెటిజన్
కరోనా ప్రభావం సినీ ఇండస్ర్గీపై గట్టిగానే పడింది. సినిమా షూటింగులు కూడా ఇప్పుడిప్పుడే తిరిగి ప్రారంభిస్తున్నారు. సో కొంచెం ఖాళీ సమయం దొరకగానే అభిమానులతో ముచ్చటిస్తున్నారు. ఇటీవలి కాలంలో చాలామంది నటీనటులు యూజర్లతో చిట్‌చాట్ సెషన్లు నిర్వహిస్తున్నారు. వాళ్లు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానమిస్తున్నారు. తాజాగా ఓ మలయాళ బ్యూటీ మంజిమ మోహన్ అభిమానులతో ఆస్క్ మీ ఏనీథింగ్ సెషన్ నిర్వహించింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్..మీరు మీ రిలేషన్ షిప్ స్టేటస్ ఏంటి అని డైరెక్ట్‌గా అడిగేశాడు. దీనిపై స్పందించిన మంజిమ..అందరూ లవ్‌లో పడుతుంటే..నేను మాత్రం తిండిపై దృష్టి పెడుతున్నాను అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది. అంటే పరోక్షంగా తన రిలేషన్షిప్ స్టేటస్ సింగిల్ అని చెప్పుకొచ్చింది. అయితే మంజిమ షేర్ చేసిన ఫన్నీ మీమ్ నెటిజన్లను మరింత ఆకట్టుకుంది. మీ లైఫ్‌లో చాలా ముఖ్యమైనవి ఏంటి అని మరో నెటిజన్ ప్రశ్నించగా..'ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్, ఫ్యామిలీ, కంపాషన్'అంటూ బదులిచ్చింది. ఇక మొదటి సినిమాతోనే మళయాలంలో హిట్ కొట్టిన మంజిమ ఆ తర్వాత వరుస అవకాశాలతో గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో నాగచైతన్యతో కలిసి 'సాహసం శ్వాసగా సాగిపో' అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. చదవండి : మోనాల్‌ని అఖిల్ ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా? ఆర్ఆర్ఆర్ పోస్టర్‌పై ట్రాఫిక్ పోలీసుల సెటైర్.. టీమ్ ఫన్నీ రిప్లై -
నేను ప్రేమలో ఉన్నా.. నా దృష్టి మొత్తం దానిపైనే : నటి
ప్రముఖ తమిళ నటి ప్రియా భవాని ప్రేమలో పడిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియా భవాని ఇటీవలె లైవ్‌లో నెటిజన్లతో సంభాషించింది. ఈ సందర్భంగా ఆమె వివాహం గురించి ఓ నెటిజన్ ప్రశ్నించగా దానికి స్పందించిన ప్రియా భవాని ప్రస్తుతం తాను ప్రేమలో ఉన్నానని, అయితే ఇప్పుడు తన దృష్టి అంతా కెరీర్‌పైనే ఉందని స్పష్టం చేసింది. సమయం వచ్చినప్పుడు తన వ్యక్తిగత జీవితం గురించి మరిన్ని వివరాలు వెల్లడిస్తాను అని పేర్కొంది. అయితే తాను ప్రేమిస్తున్న వ్యక్తి ఇండస్ర్టీకి చెందిన వ్యక్తి ఏనా? కాదా అన్న విషయాలను మాత్రం ఆమె రివీల్ చేయలేదు. దీంతో ప్రియా భవానీ ప్రేమిస్తున్న వ్యక్తి ఎవరా అనా ఇప్పడే నెటిజన్లలో రకరకాల సందేహాలు మొదలయ్యాయి. ఇక న్యూస్‌రీడర్‌గా కెరీర్ మొదలు పెట్టిన ప్రియా భవానీ అతి కొద్ది కాలంలోనే మంచి పాపులారిటీని సంపాదించింది. ఆ తర్వాత పలు సీరియల్స్‌తో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అనంతరం ఆమెకున్న క్రేజ్‌తో సినిమాల్లోనూ అవకశాలు వచ్చాయి. ఇప్పటికే మేయాధ మాన్, కడైకుట్టి వంటి చిత్రాల్లో నటించిన ప్రియా భవానీ ప్రస్తుతం కమల్‌హాసన్ చేస్తోన్న ఇండియన్-2 చిత్రంలో నటిస్తుంది. చదవండి : ముఖంపై మొటిమలు రాకుండా ఉమ్మి వాడుతా: తమన్నా మరోసారి రిపీట్ కానున్న ధనుష్-సాయిపల్లవి జోడీ -
ఆ కల తీరుతుందా?
ప్రపంచ దేశాలపై అమెరికా పట్టు నిలుపుకోవాలంటే భారత్‌తో స్నేహసంబంధాలు కొనసాగించడం అగ్రరాజ్యానికి అత్యంత అవసరం. రక్షణ రంగంలో ఒబామా అనుసరించే విధానాలే బైడెన్ కొనసాగించనున్నారు. ఉగ్రవాదం పాక్ భూభాగంపై ఉగ్రవాదుల్ని పెంచి పోషించడానికి ఆయన ఏ మాత్రం అంగీకరిం చరు. ఉగ్రవాదం అంశంలో పాక్‌పై ఒత్తిడి గట్టిగానే కొనసాగిస్తారన్న ఆశాభావంతో భారత్ ఉంది. చైనాతో వైఖరి వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో అమెరికా, చైనా మధ్య సంబంధాలు భారత్‌కి కీలకం. ట్రంప్ భారత్‌కే మద్దత పలుకుతూ చైనాపై కస్సుబుస్సులాడుతూనే ఉన్నారు. కానీ బైడెన్ నుంచి ఆ స్థాయి మద్దతు లభించదని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో ఒక దేశం నుంచి మరొక దేశానికి ముప్పు ఉండకూడదన్న వైఖరినే ఆయన పాటించే అవకాశాలున్నాయి. మానవ హక్కులు మానవ హక్కుల ఉల్లంఘన అంశంలో భారత్ పట్ల కొత్త అధ్యక్షుడి వైఖరి ఎలా ఉంటుందో ఇప్పట్నుంచి అంచనా వెయ్యలేని పరిస్థితైతే ఉంది. మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తోందంటూ పాకిస్తాన్‌పై బైడెన్ గుర్రుగానే ఉన్నారు. మరోవైపు కశ్మీర్లో 360 ఆర్టికల్ రద్దుని ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన కమల మొదట్నుంచి వ్యతిరేకిస్తున్నారు. వీసా విధానం హెచ్–1బీ వీసా విధానం, ఉద్యోగాల కల్పన అంశంలో బైడెన్ విధానాలు భారత్‌కు సానుకూలంగా మారే అవకాశాలున్నాయి. అమెరికా ఫస్ట్ నినాదంతో ట్రంప్ హెచ్–1బీ వీసాలపై కఠిన ఆంక్షలు విధించారు. అయితే బైడెన్ వాటిని సరళతరం చేస్తానని ఇప్పటికే హామీ ఇచ్చారు. అంతేకాదు చట్టవిరుద్ధంగా ఉండే వలసదారులకి అమెరికా పౌరసత్వం కల్పిస్తానని ఎన్నికల హామీ కూడా ఉంది. అదే జరిగితే 5 లక్షల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది కమలా హ్యారిస్ పాత్ర వివిధ అంశాలపై కమలకు స్పష్టమైన అభిప్రా యాలున్నాయి. అవన్నీ భారత్‌తో సంబంధాల్లో ప్రభావాన్ని చూపిస్తాయి. మరోసారి పోటీ చేయబోనని బైడెన్ చెప్పడంతో అధ్యక్షురాలయ్యే వ్యూహంతో కమలా అడుగులు వేస్తారు. ఆమె మూలాలు భారత్‌తో ముడిపడి ఉండడంతో మన దేశానికి కలిసొచ్చే అంశంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘2020 నాటికి అమెరికా, భారత్ ప్రపంచంలోనే అత్యంత సన్నిహిత దేశాలుగా అవతరించాలి. అప్పుడే ప్రపంచం హాయిగా ఉంటుంది. ఇదే నా కల — 2006లో ఓ ఇంటర్వ్యూలో బైడెన్ -
కాలేజ్ బ్రేకప్ నేర్పేదేమిటి?
ఇష్టపడ్డవారితో బ్రేకప్ చేసుకోవటం మాటల్లో చెప్పినంత తేలికైన పనికాదు. అదీ ముఖ్యంగా కాలేజీ రోజుల్లో అయితే మరీ కష్టం. బ్రేకప్ తర్వాత రోజులు ఎంత స్తబ్దుగా.. బాధతో గడపాల్సివస్తుందో వర్ణనాతీతం. బంధానికి వీడ్కోలు పలకడం అంటే ప్రేమకు దూరమవుతున్నట్లు కాదు. ఓ కొత్త బంధానికి తలుపులు తెరుస్తున్నట్లు. కాలేజీ టైంలో అయిన బ్రేకప్ మనకు ఎన్నో విషయాలను నేర్పిస్తుంది. కొత్త అనుభవాలను రుచిచూపిస్తుంది. ఇక గతం తాలూకూ అనుభవాలతో భవిష్యత్తుకు బాటలు వేసుకోవటమే మన జీవితం. కాలేజ్ బ్రేకప్ మనకు ఏం నేర్పిస్తుంది.. 1) ఎదుటి వ్యక్తి భావాలను ప్రభావితం చేయలేం మనం ప్రాణంగా ప్రేమించినంత మాత్రాన ఎదుటి వ్యక్తి మనల్ని ప్రేమించాలన్న రూలేమీ లేదు. మనపై ఫీలింగ్స్లేని వారిని ప్రేమించమని బలవంతపెట్టడం కూడా దండగే. ఎదుటి వ్యక్తి శ్రద్ధను తమపైకి మరల్చుకోవటానికి నానాతంటాలు పడేవారు లేకపోలేదు. మన చేష్టలు ఎదుటి వ్యక్తి భావాలను ఏవిధంగానూ ప్రభావితం చేయలేవని గుర్తించాలి. సంతోషాన్ని ఎదుటి వ్యక్తి ప్రేమలో కాకుండా మనలో వెతుక్కోవటం ఉత్తమం. 2) చదువులు అటకెక్కుతాయి ఓ వయసుకు.. ముఖ్యంగా కాలేజీ వయసుకు రాగానే ప్రేమలో పడటం మామూలే. ప్రేమ రెండు మనసులకు సంబంధించింది కాబట్టి దానితో ఎన్నో భావోద్వేగాలు ముడిపడి ఉంటాయి. అందుకే ప్రేమలో ఉన్న చాలా మంది చదువును సక్రమంగా సాగించలేక చతికిలబడిపోతుంటారు. ఎదుటి వ్యక్తులు అర్థం చేసుకునేవారైతే ఇటు బంధం, అటు చదువులు ఎలాంటి గొడవలేకుండా సాగిపోతాయి. అలా కాకపోతే నిత్యం గొడవలు పడుతూ బ్రేకప్‌కు దారితీస్తుంది. 3) అంగీకారమే తుది బంధాని బ్రేక్ పడగానే మనలో కొత్త ఆలోచనలు మొదలవుతాయి. తప్పు ఎక్కడ జరిగిందా అన్న ఆలోచనతో సతమతమవుతాము. ఆ సమయంలో మనల్ని మనం దోషులుగా చిత్రీకరించుకోవటమో లేదా ఎదుటి వ్యక్తిని దోషిని చేయటమో జరుగుతుంది. అయినా ఏం లాభం ఉండదని తెలుసు. ఆ జ్ఞాపకాలతో, కొత్తకొత్త భయాలతో రోజులు గడిపేస్తుంటాము. ఇలాంటప్పుడు జరిగింది ఏదో మన మంచి కోసమేనని, జరగబోయేదేదో కూడా మన మంచికేనని అంగీకరించటం ముఖ్యం. 4) కొత్త ప్రారంభాలు బ్రేకప్‌తో మన జీవితమేమీ ఆగిపోదు. మొదట్లో కొద్దిగా కష్టంగా ఉంటుంది. మరో సారి ప్రేమలో పడకూదదు.. ఎవర్నీ నమ్మకూడదురా భగవంతుడా అనుకుంటాము. కాలం బ్రేకప్ చేసిన గాయాన్ని మాన్పగానే కొత్త ఆశలు చిగురిస్తాయి. మళ్లీ ప్రేమలో పడతాం. గతాన్ని దృష్టిలో ఉంచుకుని ముందకు సాగుతాం. 5) బంధంలో మనకేం కావాలి! బ్రేకప్ తర్వాత మనలో చాలా మార్పులు వస్తాయి. ఆ మార్పులు గతాన్ని ఓ గుణపాఠంగా మనసులో వల్లెవేసుకుంటాయి. ఇకపై అడుగుపెట్టబోయే బంధంలో మనకేం కావాలో సుత్తిలేకుండా సూటిగా తెలుసుకోగలుగుతాం. 6) కమ్యూనికేషన్ బంధం కలతలులేకుండా సాగిపోవాలంటే కమ్యూనికేషన్ అవసరం చాలా ఉంది. చక్కటి కమ్యూనికేషన్ కారణంగానే బంధం దృఢంగా ఉంటుంది. మన భావాలను ఎదుటి వ్యక్తితో చక్కగా కమ్యూనికేట్ చేస్తూ బంధాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ప్రతి రోజూ ఆ ప్రశ్న అడగాలి!
సాక్షి, హైదరాబాద్: వివాహ జీవితం, రిలేషన్షిప్లో సంతోషంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు కానీ చాలా సార్లు అనుకున్నట్లుగా ఉండలేకపోతుంటారు. డబ్బు, పలుకుబడి ఉంటేనే సంతోషంగా ఉండగలమని కొన్ని జంటలు అనుకుంటాయని కానీ అది కూడా సరైన అభిప్రాయం కాదని నిపుణులు అంటున్నారు. ప్రేమలో నిజాయితీగా ఉండటమే సంతోషానికి కారణమని తెలిపారు. కింది సూచనలు పాటించడం ద్వారా రిలేషన్‌షిప్‌ను ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 1. భాగస్వామికి అండగా నిలవాలి... జీవితం విషయంలో, ఉద్యోగ విషయాల్లో మీ పార్టనర్‌కు తోడుగా నిలబడండి. వారికి ఉన్న గోల్స్‌ను సాధించుకొనే క్రమంలో మీ వంతు సహకారాన్ని వారికి అందించండి. ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో ప్రోత్సాహాన్ని అందించండి. గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం అలవర్చుకోవాలి. 2. అన్నీ మంచి రోజులే ఉండవు... రిలేషన్షిప్లో అన్నీ సంతోషకరంగా గడిచే క్షణాలే ఉండవు. కొన్నిసార్లు మనస్పర్థలు, గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో సంయమనం పాటించడం నేర్చుకోవాలి. మంచిరోజులైనా, చెడురోజులైనా ఒకరినొకరు అర్థం చేసుకొని అండగా నిలవాలి. ఏరోజు జరిగిన గొడవలను ఆ రోజు రాత్రికల్లా పరిష్కరించుకొని తర్వాతి రోజును ప్రేమతో ఆరంభించాలి. 3. సమయం గడపాలి... ఉద్యోగాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ మీ భాగస్వామితో కొంత సమయం గడపడానికి ప్రయత్నించాలి. రిలేషన్షిప్లో మీ వారితో మీరు ఎంత సమయం గడుపుతున్నారన్నదే ఆ బంధం లోతును తెలియజేస్తుంది. ఈ రోజు ఎలా గడిచింది ? అనే ప్రశ్న ప్రతి రోజూ అడగాలి. మీ భాగస్వామి మీతో ఎంతో మాట్లాడాలని, చెప్పాలని ఉన్నప్పటికీ మీరు అడగకపోతే కొన్నిసార్లు చెప్పలేకపోవచ్చు. సమయం దొరికినపుడు విహారయాత్రలకు కలిసి వెళ్లి సంతోషంగా గడిపిరావాలి. 4. నిజమైన మిత్రులు... కుటుంబమైనా, రిలేషన్షిప్ అయినా పురుషులు, మహిళలు మిత్రులుగా ఉంటేనే ఆ బంధం ఎక్కువ కాలం నిలుస్తుంది. ఇద్దరి మధ్యలో ఎలాంటి రహస్యాలు ఉండకూడదు. మీకు ఎదురయ్యే ఇబ్బందులను, ఆనందాలను ఒకరితో ఒకరు పంచుకోవాలి. ప్రేమ బంధానికి స్నేహం జతకలిస్తేనే అది అవిభాజ్య బంధంగా మారుతుంది. 5. బయటకు కనిపించాలి.... రిలేషన్షిప్లో ఎదురయ్యే పలు ఇబ్బందులను మీరు అధిగమించడం మీ తోటి మిత్రులు చూడాలి. రోజురోజుకు బలపడుతున్న మీ బంధానికి వారే సాక్షులుగా నిలవాలి. దాని నుంచి వారు నేర్చుకోవడం మాత్రమేగాక సమాజంలో ఇదో బాధ్యత అనే విషయం మీకు కూడా బోధపడుతుంది. ఈ విషయాల పట్ల కొంచెం జాగ్రత్త తీసుకొని, అనుదిన జీవితంలో పాటించడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది. -
అది ప్రశ్నలా మిగిలిపోయింది
నటిగా అటు బాలీవుడ్, ఇటు సౌత్‌లో మంచి పేరు సంపాదించుకున్నారు టబు. ‘చాందినీ బార్, చీనీ కమ్, నిన్నే పెళ్లాడతా, ప్రేమ దేశం’ వంటి సూపర్ హిట్స్‌లో నటించిన ఈ 46 ఏళ్ల సుందరి రిలేషన్షిప్ స్టేటస్ ఇంకా సింగిలే. ‘సింగిల్‌గా ఉంటున్నానని నేనెప్పుడూ బాధపడలేదు’ అని అంటున్నారు టబు. ఇటీవల ఓ ఫిల్మ్ ఫెస్టివల్లో సింగిల్‌గా ఉండటం, పెళ్లి గురించి టబు మాట్లాడుతూ –‘‘నా లైఫ్‌లో సింగిల్‌గా ఉన్న ఏ మూమెంట్లోనూ నేను బాధపడలే దు. ప్రతి నిమిషాన్ని బెస్ట్ అని ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇంకో సైడ్ (రిలేషన్షిప్) ఏంటో నాకు తెలియదు. నేను పెళ్లి చేసుకోలేదు. రెండు సైడ్స్‌ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే ఏది బెస్టో చెప్పగలం. సో.. సింగిల్‌గా ఉండటమా? రిలేషన్షిప్లో ఉండటమా? ఏది బెస్టో కచ్చితంగా చెప్పలేను. పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉన్నందుకు ఎప్పుడూ పశ్చాత్తాపపడలేదు. లైఫ్‌లో పెళ్లి చేసుకుంటానా? అనే ప్రశ్న కూడా ప్రశ్నలా ఉంది. దానికి నా దగ్గర ప్రస్తుతానికైతే సమాధానం లేదు’’ అని పేర్కొన్నారు టబు. -
బ్లైండ్ రిలేషన్షిప్
ఇప్పుడున్న టాప్ హీరోల్లో ఒకరైన స్టార్ నటించిన సినిమాలోని సన్నివేశాలివి. ఈ సినిమా దర్శకుడు ఈమధ్య కాలంలో నటుడిగానూ సూపర్ అనిపించుకుంటున్నారు. తెలుగు సినిమా రొమాంటిక్ కామెడీలకు ఒక కొత్త దారిని చూపించిన ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం!? సిద్ధు, మధు.. ఇద్దరిదీ చూడముచ్చటైన జంట. కాలేజీలో ఎక్కడ చూసినా వీరిద్దరూ కలిసే కనిపిస్తారు. ఒకరంటే ఒకరికి పిచ్చి ఇష్టం. సిద్ధు అందరినీ ఫ్రెండ్.. ఫ్రెండ్.. అని పరిచయం చేయగలడు కానీ, మధును మాత్రం కేవలం ఫ్రెండ్ అని పరిచయం చేయలేడు. అతడికి తెలుసు.. మధు ఫ్రెండ్ కంటే ఎక్కువే అని. మధు కూడా అలా పరిచయం చేయడంలో సిద్ధు పడే ఇబ్బందిని గ్రహించి నవ్వుతుంది. ఆమెకూ తెలుసు సిద్ధు తనకు ఫ్రెండ్ కంటే ఎక్కువ అని. ప్రేమా? ఎవ్వరూ ఆ విషయాన్ని ఒప్పుకోలేదు, చెప్పుకోలేదు కూడా. సరిగ్గా కాలేజీలో ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడే సమయానికి సిద్ధు, మధులకు ఒక గొడవ జరిగింది. అది చూడ్డానికి సిల్లీగానే అనిపించొచ్చు. సిల్లీ అయితే కాదు. గొడవలో మాటా మాటా పెరిగి, ఇద్దరూ మాట్లాడుకోవద్దని ఒక నిర్ణయానికి వచ్చేశారు. విడిపోయారు. సిద్ధు, మధు ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా కాదు.పరీక్షలైపోయాయి. సెలవులు అయిపోయాయి. మళ్లీ కాలేజీ మొదలైంది. సిద్ధు, మధు ఎవరికి వారే అన్నట్టుగానే ఉన్నారు. ఒక విషయం మాత్రం వాళ్లను మళ్లీ మాట్లాడుకునేలా చేసింది. బాబు – శాంతిల ప్రేమ. ఆ ప్రేమ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది. వాళ్లిద్దరూ కలవాలంటే, వీళ్లిద్దరూ కలవాలి. యూనివర్సిటీలో మధు ఎదురైనా, ఆమెను పట్టించుకోకుండానే ముందుకు కదిలాడు సిద్ధు. అలా వెళ్లిపోతున్న సిద్ధును, ‘‘సిద్ధు..’’ అని పిలిచి ఆపింది మధు. ‘ఏంటి?’ అన్నట్టు చూశాడు సిద్ధు. ‘‘నేన్నీతో రాజీపడటానికి వచ్చానని తప్పుగా అనుకోకు.’’ మధు మాట్లాడటం మొదలుపెట్టింది. ‘‘రాజీ పడటం తప్పని ఎవరన్నారు?’’ సిద్ధు. ‘‘ఇలాచూడూ.. నీతో.. సారీ.. మీతో.. ఆర్గ్యుమెంట్‌కి రాలేదు. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చాను. ఈ టు మంత్స్ సమ్మర్ హాలీడేస్‌లో మనం ఊరికెళ్లినప్పుడు ఇక్కడ ఏమేమో జరిగాయి. బాబు శాంతిని చూడటానికి వాళ్లింటికి వెళ్లి శాంతి అనుకొని వాళ్ల నాన్నను లేపి దొరికిపోయాడు. శాంతిని వాళ్ల నాన్న హౌస్ అరెస్ట్ చేశారు. బాబు క్లాస్‌కి వచ్చాడా?’’ చెప్పాలనుకున్నదంతా చెప్పేస్తూ అడిగింది మధు. సిద్ధుపై కోపం ఆమెకు ఏమాత్రం తగ్గలేదు.‘‘రాలేదే?’’ ‘‘మనం పెంచిన లవ్. ఇప్పుడు ప్రాబ్లమ్‌లో ఇరుక్కుపోయింది.’’ సిద్ధు ఆ మాటకు ఎలా రియాక్ట్ అవుతున్నాడో చూస్తోంది మధు. తన మాటను వెంటనే సరిచేస్తూ, ‘‘ఐ మీన్, బాబు – శాంతిల లవ్ గురించి మాట్లాడుతున్నాను’’ అంది. ‘‘శాంతిని చూశావా? సారీ.. చూశారా?’’ సిద్ధు పెద్దగా ఆసక్తి చూపనట్టుగానే అడిగాడు. ‘‘నేనిప్పుడు అక్కణ్నుంచే వస్తున్నాను. శాంతి కుమిలి కుమిలి ఏడుస్తోంది. నిన్ను, బాబును కలిపే బాధ్యత నాదని చెప్పొచ్చాను. ఆ విషయం గురించే మిమ్మల్ని కలవడానికి వచ్చాను. మీరు కూడా మీ ఫ్రెండ్‌కి ప్రామిస్ చేశారు. సో, నేను నా ఫ్రెండ్‌కు చేసిన ప్రామిస్ కోసం.. మీరు మీ ఫ్రెండ్‌కు చేసిన ప్రామిస్ కోసం మనిద్దరం కలిసి..’’ అంటూ సిద్ధును చూస్తూ మాట్లాడ్డం ఆపేసింది మధు.సిద్ధు సిగరెట్ వెలిగిస్తున్నాడు. అంతకు కొన్ని రోజుల ముందరే మధు కోసం సిగరెట్ మానేశాడు సిద్ధు. ఇప్పుడు మళ్లీ వెలిగించడం ఆమెకు చిరాకు తెప్పించింది.మధు అలా చూస్తూ ఉండటం గమనించిన సిద్ధు,‘‘కలసి?’’ పూర్తి చేయమన్నట్టు అడిగాడు.‘‘కలసి.. కలసి వాళ్లిద్దరినీ కలపాలి.’’ కోపాన్ని దాచుకుంటూనే, బాధను బయటపెడుతూనే చెప్పింది మధు.‘‘మనిద్దరం కలసి అన్నాను చూడండీ.. ఆ విషయంలో మనం కొంచెం కరెక్ట్‌గా ఉండాలి.’’ కొంచెం గట్టిగా, కోపాన్నంతా దాచుకుంటూ చెప్పింది మధు.‘‘మనిద్దరం కలసి తిరగబోయే రోజుల్లో మన మధ్య ఉండేది ఎలాంటి సంబంధమో ఇప్పుడే మనం నిర్ణయించుకోవాలి’’ మధు మాట్లాడుతూ పోతుంటే సిద్ధు ఏదీ పట్టనివాడిలా సిగరెట్ పొగను గాల్లోకి వదులుతున్నాడు.‘‘అది స్నేహం కాదు. ప్రేమ కాదు. వేరే ఏ సంబంధమూ కాదు. జస్ట్ ఓ గుడ్డి సంబంధం. ఎ బ్లైండ్ రిలేషన్షిప్. ఎ రిలేషన్షిప్ విచ్ హాజ్ నో మీనింగ్. ఆ సంబంధం కూడా వాళ్లిద్దరూ కలిసేవరకే!’’ సిగరెట్ పొగను గట్టిగా పీల్చి వదిలాడు సిద్ధు. ‘‘నేను చెప్పినట్టు మీరుంటారని ఆశిస్తున్నాను. నడుచుకుంటారని నమ్ముతున్నాను’’ ఆ మాటతో ముగించింది మధు.‘‘నేను ఏదైతే చెప్పాలనుకున్నానో, మీరూ అదే చెప్పారు.’’ మధు మాట్లాడటం ఆపేసిన కొన్ని సెకండ్లకు సిద్ధు నోరు విప్పాడు. కొన్ని నిమిషాల తర్వాత. ఒంటరిగా పార్క్‌లో ఓ బెంచీపై కూర్చున్న బాబును కలిసేందుకు వచ్చారు మధు, సిద్ధు. బాబును చూడ్డమే, ‘‘ఆ గడ్డమేంట్రా?’’ అంటూ గట్టిగా నవ్వాడు సిద్ధు. మధు.. సిద్ధును కోపంగా చూస్తూ నిలబడింది. ‘‘ఆ.. అందుకే.. అందుకే ప్రేమ, దోమాలాంటి తొక్కలో కమిట్మెంట్స్ పెట్టుకోకూడదు. ఇప్పుడు నన్ను చూడు.. ఎంత సంతోషంగా ఉన్నానో, ఎంత ఉల్లాసంగా ఉన్నానో.. ఎందుకంటే నేనెవర్నీ లవ్ చేయలేదూ.. ఏ సమస్యలోనూ ఇరుక్కోలేదు.. నీలాగా..’’ అంటూ మరింత గట్టిగా నవ్వాడు సిద్ధు. ఇంక కోపాన్ని దాచుకోలేకపోయిన మధు, ‘‘సిద్ధు.. మనసులో బాధను ఉంచుకొని పైకి సంతోషంగా ఉన్నట్టు నటించడం, చూడ్డానికి అసహ్యంగా ఉంది’’ అంది కోపాన్ని బయటపెడుతూ. ‘‘ఏంటీ?’’ అన్నాడు సిద్ధు. ‘‘ఐ మీన్.. బాబు కోసం నువ్ లోలోన పడుతున్న బాధను గురించి చెప్తున్నాను.’’ మధు మాటలకు కొన్ని సెకండ్లు ఆగిపోయి మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టాడు సిద్ధు. -
అనుష్కతో బ్రేకప్ను ఇలా చెప్పాడా?
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవల సోషల్ మీడియాలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కంటే పాపులర్ అయ్యాడు. టి-20 ప్రపంచ కప్‌లో విరాట్ బ్యాటింగ్ మెరుపులను నెటిజన్లు తెగ ప్రశంసించారు. ఇక సోషల్ మీడియాలో విరాట్ ఆటతీరుతో పాటు అతని ప్రేమాయణం కూడా హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మతో రెండున్నరేళ్ల బంధాన్ని టి-20 ప్రపంచ కప్‌నకు ముందు విరాట్ తెగదెంపులు చేసుకున్నాడు. కోహ్లీ చేసిన పెళ్లి ప్రతిపాదనను అనుష్క ఒప్పుకోకపోవడం వల్లే వీరి బంధం తెగిపోయిందని వదంతులు షికారు చేశాయి. విరాట్ ఆడుతుంటే స్టేడియంలోని గ్యాలరీలో సందడి చేసే అనుష్క టి-20 ప్రపంచ కప్ సందర్భంగా ఎక్కడా కనిపించలేదు. అయితే గతవారం ఇద్దరూ కలసి మళ్లీ కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. గత బుధవారం ముంబై బాంద్రాలోని రాయల్టీ క్లబ్లో ఈ ఇద్దరూ కలిసి డిన్నర్ చేశారు. దీంతో వీరి ప్రేమ మళ్లీ చిగురించిందంటూ బాలీవుడ్లో ఊహాగానాలు మొదలయ్యాయి. కాగా ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విరాట్ కొత్త ఫొటో బాగా పాపులరయింది. ఆ ఫొటోలో విరాట్ టీ షర్ట్ వేసుకున్నాడు. దానిపై 'వు వర్ ఆన్ ఏ బ్రేక్' అని రాసి ఉంది. అనుష్కతో బంధాన్ని తెగదెంపులు చేసుకున్నట్టు ఇలా టీ షర్ట్ ద్వారా వెల్లడించాడా అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పోస్ట్ చేశారు. ఇంతకీ అనుష్కతో బంధాన్ని బ్రేకప్ చేసుకున్నాడా? లేక మళ్లీ కలసిపోయారా అన్నది కోహ్లీకే తెలియాలి!