Zaheer Iqbal, Sonakshi Sinha Makes Their Relationship Official, Post Goes Viral - Sakshi
Sakshi News home page

Sonakshi Sinha-Zaheer Iqbal: తమ రిలేషన్‌ను అఫిషీయల్ చేసిన లవ్‌బర్డ్స్‌

Published Wed, Jun 8 2022 1:22 PM | Last Updated on Wed, Jun 8 2022 4:51 PM

Zaheer Iqbal, Sonakshi Sinha Makes Their Relationship Official - Sakshi

గత కొంతకాలంగా బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా, హీరో జహీర్‌ ఇక్బాల్‌తో డేటింగ్‌లో ఉన్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పుకార్లను కొట్టిపారేసింది ఈ జంట. అయినా వీరిద్దరి రిలేషన్‌పై రూమార్స్‌ వస్తూనే ఉన్నాయి. దీనికి కారణం ముంబై రోడ్లపై వీరిద్దరు జంటగా చక్కర్లు కొట్టడం, విందులు, వినోదాలకు హజరవ్వడమే. అంతేకాదు ఇద్దరు క్లోజ్‌గా దిగిన ఫొటోలను కూడా తరచూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వారు ప్రేమలో ఉన్నారని బాలీవుడ్‌ ఫిక్సయిపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల సోనాక్షి బర్త్‌డే సందర్భంగా తమ సీక్రెట్‌ రిలేషన్‌ను అఫిషీయల్ చేసింది ఈ జంట.

చదవండి: ‘విక్రమ్‌’.. 13 మంది అసిస్టెంట్‌ డైరెక్టర్లకు కమల్‌ సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్స్‌

ఈ సందర్భంగా సోనాక్షితో కలిసి విమానంలో పయనిస్తున్న ఓ ఫన్నీ వీడియోను షేర్‌ చేసిన ఇక్బాల్‌ ఆమెకు పబ్లిక్‌గా లవ్యూ చెప్పాడు. ‘హ్యాపీ బర్త్ డే. నన్ను చంపనందుకు థాంక్యూ. ఐ లవ్యూ’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. దీనిపై సోనాక్షి సైతం స్పందించింది. ‘ఐ లవ్యూ. ఇప్పుడు నేను నిన్ను చంపడానికి వస్తున్నా’ అని అతడి పోస్ట్‌పై కామెంట్‌ చేసింది. దీంతో వీరిద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నారని స్పష్టమైంది. ఇది చూసిన వీరి ఫ్యాన్స్‌, ఫాలోవర్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక్బాల్‌ పోస్ట్‌ బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం స్పదించారు. కాగా ఇటీవల సోనాక్షి చేతికి డైమండ్‌ రింగ్‌ పెట్టుకున్న ఫొటోలను షేర్‌ చేస్తూ తన డ్రీమ్‌ నిజమైందంటూ క్యాప్షన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.

చదవండి: సాయి పల్లవికి పెద్ద ఫ్యాన్‌ని: బాలీవుడ్‌ డైరెక్టర్‌

అంతేకాదు ఈ ఫొటో పక్కనే ఉన్న వ్యక్తి కనిపించకుండ జాగ్రత్త పడింది. దీంతో ఇక్బాల్‌కు తనకు నిశ్చితార్థమైందని ఒక్కసారిగా వార్తలు గుప్పమనగా.. మిమ్మల్ని ఫూల్‌ చేశానంటూ మరో పోస్ట్‌ చేసింది సోనాక్షి. అది రింగ్‌ కాదని, తన కొత్త బ్రాండ్‌ నెయిల్‌ పాలిష్‌ను ప్రమోట్‌ చేశానంటూ నెటిజన్లకు షాకిచ్చింది. దబాంగ్‌ మూవీతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన సోనాక్షికి పలు చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె ఏడాది ఒక సినిమా చేస్తూ వస్తోంది. ఇక జహీర్‌ ఇక్బాల్‌ 2019లో నోట్‌బుక్‌ మూవీతో సినీరంగ ప్రవేశం చేశాడు. ఆ వెంటనే డబుల్‌ ఎక్సెల్‌ మూవీ చేశాడు. ఇందులో సోనాక్షితో జతకట్టాడు. ఈ మూవీ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడినట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement