కరోనా ప్రభావం సినీ ఇండస్ర్గీపై గట్టిగానే పడింది. సినిమా షూటింగులు కూడా ఇప్పుడిప్పుడే తిరిగి ప్రారంభిస్తున్నారు. సో కొంచెం ఖాళీ సమయం దొరకగానే అభిమానులతో ముచ్చటిస్తున్నారు. ఇటీవలి కాలంలో చాలామంది నటీనటులు యూజర్లతో చిట్‌చాట్ సెషన్లు నిర్వహిస్తున్నారు. వాళ్లు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానమిస్తున్నారు. తాజాగా ఓ మలయాళ బ్యూటీ మంజిమ మోహన్ అభిమానులతో ఆస్క్ మీ ఏనీథింగ్ సెషన్ నిర్వహించింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్..మీరు మీ రిలేషన్ షిప్ స్టేటస్ ఏంటి అని డైరెక్ట్‌గా అడిగేశాడు.
దీనిపై స్పందించిన మంజిమ..అందరూ లవ్‌లో పడుతుంటే..నేను మాత్రం తిండిపై దృష్టి పెడుతున్నాను అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది. అంటే పరోక్షంగా తన రిలేషన్‌షిప్ స్టేటస్ సింగిల్ అని చెప్పుకొచ్చింది. అయితే మంజిమ షేర్ చేసిన ఫన్నీ మీమ్ నెటిజన్లను మరింత ఆకట్టుకుంది. మీ లైఫ్‌లో చాలా ముఖ్యమైనవి ఏంటి అని మరో నెటిజన్ ప్రశ్నించగా..'ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్, ఫ్యామిలీ, కంపాషన్'అంటూ బదులిచ్చింది. ఇక మొదటి సినిమాతోనే మళయాలంలో హిట్ కొట్టిన మంజిమ ఆ తర్వాత వరుస అవకాశాలతో గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో నాగచైతన్యతో కలిసి 'సాహసం శ్వాసగా సాగిపో' అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
చదవండి : మోనాల్‌ని అఖిల్ ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా?
ఆర్‌ఆర్‌ఆర్ పోస్టర్‌పై ట్రాఫిక్ పోలీసుల సెటైర్.. టీమ్ ఫన్నీ రిప్లై
Comments
Please login to add a commentAdd a comment