
రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సాన పనిలేదు. విడుదలకు ముందే ఆయన నటించిన లైగర్ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈనెల25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న విజయ్ తాజాగా తన రిలేషన్‌షిప్ స్టేటస్‌పై ఓపెన్ అయ్యాడు. ఓ ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ.. 'నా పర్సనల్ లైఫ్ గురించి బయటపెట్టడం ఇష్టం ఉండదు. నటుడిగా పబ్లిక్ లైఫ్‌లో ఉండటం నాకు ఇష్టమే. కానీ పబ్లిక్‌లో ఫోకస్ కావడం ఆమెకు నచ్చకపోవచ్చు. అందుకే ఆమె స్వేచ్ఛకు భంగం కలిగించాలనుకోవడం లేదు ' అంటూ చెప్పుకొచ్చాడు
దీంతో విజయ్ డేటింగ్‌లో ఉన్న అమ్మాయి ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదని తేలిపోయిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా విజయ్ స్టేట్‌మెంట్‌తో రష్మికతో డేటింగ్ రూమర్స్‌కి కూడా చెక్ పెట్టినట్లయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment