రేంజ్ రోవర్ తన మొట్టమొదటి ఇండియా ఎక్స్‌క్లూజివ్ మోడల్ ఎస్వీ రణథంబోర్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ. 4.98 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది కేవలం 12 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. అంటే 12మంది మాత్రమే దీనిని కొనుగోలు చేయగలరు.
రేంజ్ రోవర్ ఎస్వీ రణథంబోర్ ఎడిషన్ అనేది రాజస్థాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్క్ నుంచి ప్రేరణ పొందింది. ఈ కారును విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు కంపెనీ విరాళంగా అందించనున్నట్లు సమాచారం.
రణథంబోర్ ఎడిషన్ ఒక ప్రత్యేకమైన పెయింట్ స్కీమ్ పొందుతుంది. ఇది బ్లాక్ బాడీ కలర్‌లో రెడ్ షిమ్మర్‌తో నిండి ఉంది. డిజైన్ పులికి చిహ్నంగా రూపొందించారు. కాబట్టి పులి చారల వంటి డిజైన్ కూడా ఇందులో చూడవచ్చు. ఇది 23 ఇంచెస్ ఫోర్జ్డ్ డార్క్ గ్రే వీల్స్ పొందుతుంది.
ఇదీ చదవండి: భారత్ కీలక నిర్ణయం: ఊపిరి పీల్చుకున్న దిగ్గజ దేశాలు
ఇంటీరియర్.. కారావే అండ్ లైట్ పెర్లినో సెమీ-అనిలిన్ లెదర్ కలయికను పొందింది. సీట్లపై ఎంబ్రాయిడరీ పులి వెన్నెముక వెంట ఉన్న చారల మాదిరిగా కనిపిస్తుంది. ఇందులో రిక్లినబుల్ సీట్లు, పవర్డ్ క్లబ్ టేబుల్, డిప్లోయబుల్ కప్‌హోల్డర్స్, రిఫ్రిజిరేటెడ్ కంపార్ట్‌మెంట్ మొదలైనవి ఉన్నాయి.
ఈ కారు ప్రత్యేకమైన డిజైన్, ఫీచర్స్ కలిగి ఉన్నప్పటికీ ఇంజిన్లో ఎటువంటి మార్పు లేదని తెలుస్తోంది. కాబట్టి ఇందులో 3.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 500 Nm టార్క్, 394 Bhp పవర్ అందిస్తుంది. కాబట్టి పనితీరు బాగుంటుందని భావిస్తున్నాము.
Comments
Please login to add a commentAdd a comment