భారతదేశంలో బియ్యం ఎగుమతుల మీద విధించిన పరిమితులను ప్రభుత్వం తొలగించింది. దేశంలో ఇటీవల పడిన భారీ వర్షాల కారణంగా రాబోయే రోజుల్లో పంట దిగుబడి పెరుగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఉన్న భారత్.. 2022లో 40 శాతం లేదా 2.2 కోట్ల టన్నుల కంటే ఎక్కువ ఎగుమతి చేసింది. ఇండియా ప్రపంచంలోని దాదాపు 140 దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తోంది. భారత్ తరువాత ఎక్కువ బియ్యం ఎగుమతులు చేస్తున్న దేశాల జాబితాలో థాయ్‌లాండ్, వియత్నాం మొదలైనవి ఉన్నాయి.
భారత్ ప్రధానంగా బాస్మతీయేతర బియ్యాన్ని.. బెనిన్, బంగ్లాదేశ్, అంగోలా, కామెరూన్, జిబౌటి, గినియా, ఐవరీ కోస్ట్, కెన్యా, నేపాల్, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియాలకు ఎగుమతి చేస్తోంది. ఇతర దేశాల ఆహార భద్రతను తీర్చడానికి.. ఆ దేశ ప్రభుత్వాల అభ్యర్థన మేరకు భారత ప్రభుత్వం ఎగుమతులకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది.
ఇదీ చదవండి: చెట్టుకింద వచ్చిన ఆలోచన.. వేలకోట్లు సంపాదించేలా..
ప్రభుత్వం బాస్మతీయేతర బియ్యం ఎగుమతులను నిషేదించడమే కాకూండా.. కనీస ధరను కూడా నిర్ణయించింది. ఎగుమతికి సంబంధించిన ట్యాక్స్ నుంచి కూడా మినహాయింపు ఇచ్చింది. అయితే దేశంలో బియ్యం సరఫరాను పెంచడానికి 2023 జులై 20న బాస్మతీయేతర బియ్యం ఎగుమతులను నిషేధించింది. కాగా ఇప్పటికి ఆ పరిమితులను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment