Indian governement
-
భారత్ కీలక నిర్ణయం: ఊపిరి పీల్చుకున్న దిగ్గజ దేశాలు
భారతదేశంలో బియ్యం ఎగుమతుల మీద విధించిన పరిమితులను ప్రభుత్వం తొలగించింది. దేశంలో ఇటీవల పడిన భారీ వర్షాల కారణంగా రాబోయే రోజుల్లో పంట దిగుబడి పెరుగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఉన్న భారత్.. 2022లో 40 శాతం లేదా 2.2 కోట్ల టన్నుల కంటే ఎక్కువ ఎగుమతి చేసింది. ఇండియా ప్రపంచంలోని దాదాపు 140 దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తోంది. భారత్ తరువాత ఎక్కువ బియ్యం ఎగుమతులు చేస్తున్న దేశాల జాబితాలో థాయ్‌లాండ్, వియత్నాం మొదలైనవి ఉన్నాయి.భారత్ ప్రధానంగా బాస్మతీయేతర బియ్యాన్ని.. బెనిన్, బంగ్లాదేశ్, అంగోలా, కామెరూన్, జిబౌటి, గినియా, ఐవరీ కోస్ట్, కెన్యా, నేపాల్, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియాలకు ఎగుమతి చేస్తోంది. ఇతర దేశాల ఆహార భద్రతను తీర్చడానికి.. ఆ దేశ ప్రభుత్వాల అభ్యర్థన మేరకు భారత ప్రభుత్వం ఎగుమతులకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది.ఇదీ చదవండి: చెట్టుకింద వచ్చిన ఆలోచన.. వేలకోట్లు సంపాదించేలా..ప్రభుత్వం బాస్మతీయేతర బియ్యం ఎగుమతులను నిషేదించడమే కాకూండా.. కనీస ధరను కూడా నిర్ణయించింది. ఎగుమతికి సంబంధించిన ట్యాక్స్ నుంచి కూడా మినహాయింపు ఇచ్చింది. అయితే దేశంలో బియ్యం సరఫరాను పెంచడానికి 2023 జులై 20న బాస్మతీయేతర బియ్యం ఎగుమతులను నిషేధించింది. కాగా ఇప్పటికి ఆ పరిమితులను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. -
వివాదంలో మరో వెబ్ సిరీస్.. నెట్‌ఫ్లిక్స్‌కి కేంద్రం సమన్లు!
సినిమానో వెబ్ సిరీస్ అనేది చాలా జాగ్రత్తగా తీయాలి. లేదంటే ఈ కాలంలో ఎక్కడిలేనన్నీ వివాదాలు చుట్టుముడతాయి. అదే నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీస్తే మరింత కేర్‌ఫుల్‌గా ఉండాలి. కానీ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ మాత్రం తప్పు మీద తప్పు చేస్తూనే ఉంది. గతంలో పలు సినిమాలు, సిరీస్‌లతో వ్యతిరేకత ఎదుర్కొంది. ఇప్పుడు 'ఐసీ 814: కాందహార్ హైజాక్' సిరీస్‌తో మరో వివాదానికి కేరాఫ్ అయింది.1999లో భారతీయ విమానం హైజాక్ గురించి అంత త్వరగా జనాలు మర్చిపోలేదు. అదే స్టోరీని తీసుకుని తీసిన వెబ్ సిరీస్ 'ఐసీ 814: కాందహార్ హైజాక్'. విజయ్ వర్మ, నసీరుద్దీన్ షా, అరవింద స్వామి తదితరులు కీలక పాత్రలు పోషించారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజై అద్భుతమైన స్పందన సొంతం చేసుకుంది. రీసెంట్ టైంలో వచ్చిన వాటిల్లో బెస్ట్ అని ప్రశంసిస్తున్నారు.(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 8' షోలో తెలుగు వాళ్లకు అన్యాయం?)అయితే కాందహార్ హైజాక్ చేసింది పాకిస్థాన్‌కి చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదులే. అప్పట్లోనే నిందితుల పేర్లు బయటకొచ్చాయి. ఇబ్రహీం అక్తర్, సన్నీ ఖాజీ, సాహిద్ సయ్యద్, మిస్త్రీ జహూర్, షకీర్ అని అప్పుడే వాళ్లు ఫొటోలు కూడా రిలీజ్ చేశారు. కానీ తాజాగా రిలీజ్ చేసిన సిరీస్‌లో మాత్రం పేర్లు మార్చేశారు. భోళా, శంకర్, బర్గర్, డాక్టర్ అని వేరే పేర్లతో సంభోదించారు. ఇలా పనిగట్టుకుని ముస్లింలా పేర్లు మార్చి ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టించడంపై సోషల్ మీడియాలో విమర్శలు గట్టిగానే వస్తున్నాయి.ఈ క్రమంలోనే భారతీయ ప్రసార, బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖ.. నెట్‌ఫ్లిక్స్ సంస్థకు సమన్లు జారీ చేసింది. పేర్లు మార్పుపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మరి ఈ విషయంలో సదరు ఓటీటీ సంస్థ ఏమని సమాధానమిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లోకి వచ్చి రోజు కాలేదు.. అప్పుడే గొడవలు) -
కార్యాచరణ ముఖ్యం!
మారుతున్న రాజకీయాల కారణాలే ఈసారి బడ్జెట్‌ను ప్రభావితం చేసినట్టు న్నాయి. ఉపాధి లేని యువతకు పరి ష్కారం దిశగా అడుగులేసింది బడ్జెట్. విద్య, పారిశ్రామిక అవసరాలకు మధ్య పెరిగిన నైపుణ్య అంతరాన్ని తగ్గించే ప్రయత్నం కనిపిస్తోంది. జాతీయ ఆదా యంలో కీలకభూమిక పోషించే మహిళను వెన్నుతట్టి ప్రోత్సహించే కేటాయింపులు అనివార్యమయ్యాయి. ప్రైవేటు పెట్టుబడు లకు ఊతకర్ర ఇచ్చినా ఫలితాలు అంతంత మాత్రమేనని సర్కార్ గుర్తించింది. ప్రభుత్వ పెట్టుబడి వ్యయం పెంచడమే పరిష్కా రమని గుర్తించింది. సహజ వ్యవసాయ పద్ధతుల మేలుకొలుపు నకు బడ్జెట్ పెద్దపీట వేసింది. ఆశయాలు గొప్పవే. ఆశించిన పురోగతికి కేటాయింపులే గీటురాయి కావు. సరైన వ్యూహ రచన చేస్తేనే లక్ష్యాలను చేరుకోవడం సాధ్యం. దేశ తక్షణ అవసరాలను బడ్జెట్ గమనించింది. అయితే దీన్ని కార్యాచరణలోకి తెచ్చేముందు సవాళ్ళనూ గుర్తించాలి!స్థూల జాతీయోత్పత్తి లక్ష్యాలు తగ్గాయి. 2023–24లో జీడీపీ 8.2గా ఉంది. 2024–25లో ఇది 6.5–7.0గా ఉంటుందని అంచనా వేశారు. ద్రవ్యలోటును 5.6 శాతానికి తగ్గించేందుకే ఇలా చేసినట్టు కనిపిస్తోంది. ఇదే క్రమంలో రెవెన్యూ లోటును తగ్గించాలని భావించారు. కోవిడ్ తర్వాత ప్రైవేటు పెట్టుబడు లకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. దీనివల్ల పెద్దగా పెట్టుబడులు వచ్చిందేమీ లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పెట్టుబడి వ్యయాన్ని పెంచారు. స్థూల ఆర్థిక విధానాన్ని సుస్థిర పర్చేందుకు బడ్జెట్ ప్రయత్నించింది.సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నది కేంద్రం లక్ష్యం. బడ్జెట్ కేటాయింపులూ ఈ విధంగానే ఉన్నాయి. అయితే, ఏక కాలంలో ఈ విధానం అమలు చేయడం సరికాదు. దీనివల్ల ఆహార ఉత్పత్తి తగ్గుతుందని అనేక అధ్యయనాలు చెబుతు న్నాయి. ప్రస్తుత విధానాలు కొనసాగిస్తూనే మార్పు దిశగా అడుగులేయాలి. సహజ వ్యవసాయానికి ఊతమిచ్చే కొత్త వంగ డాల అభివృద్ధి అత్యంత కీలకం. దేశవ్యాప్తంగా 10 వేల బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ ప్రారంభిస్తామన్నారు. ఇది మంచి పరి ణామమే. ఇందులో శ్రమ సాంద్రత భాగస్వామ్యమవుతుంది. ఇందులో మహిళా శక్తి కీలకం. వారిని ప్రోత్సహించేలా ఉండాలి. దీనివల్ల గ్రీన్ జాబ్స్‌ను సృష్టించవచ్చు.దేశ ఆర్థికాభివృద్ధిలో మహిళా భాగస్వామ్యం కీలకం. పలు సర్వేలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఇది నిధుల కేటాయింపుతోనే సాధ్యం కాదు. వారిని ఉపాధి వైపు నడిపించేందుకు అవ సరమైన ప్రణాళికలు అవసరం. ‘కౌశల్ యోజన’ వంటి పథకా లను కేంద్రం బడ్జెట్లో ప్రస్తావించింది. నైపుణ్యం పెంచుతామని చెప్పింది. నిజానికి దేశంలో మహిళలు ఎంతమంది ఉపాధి పొందుతున్నారు? ఇందులో నైపుణ్యంతో కూడిన ఉద్యోగాలు ఎన్ని? బడ్జెట్లో మరో ముఖ్యాంశం కేర్ఎకానమీ. వృద్ధులు, పిల్లల సంరక్షణ ఇందులో భాగం. ఈ దిశగా ఉపాధి అవకాశాలూ పెరుగుతున్నాయి. ఈ విభాగాల్లో 70 శాతం మహిళలే ఉంటారు. కాబట్టి కచ్చితమైన ప్రణాళికలు ఉండాలి. భారత్ పురోభివృద్ధిలో ఉందని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. అయితే, భద్రతతో కూడిన ఉపాధి అవకాశాలుండాలని సూచిస్తోంది. ఇప్పటికీ భార త్లో 90 శాతం మహిళలు ఇన్ ఫార్మల్ ఉపాధిలోనే ఉన్నారు. ఈపీ ఎఫ్, సెలవులు వంటివి అందు కోవడం లేదు.పట్టాలున్న యువతలో సరిపోయే పరిజ్ఞానం లేనందువల్ల పరిశ్రమలు వారిని ఉద్యోగంలోకి తీసుకోవడం లేదు. దీంతో దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరిగిపోతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని యువతను సంతృప్తిపర్చాల్సిన అవసరం ఏర్పడింది. ఉపాధి అవకాశాలు, విద్యకు మధ్య నైపుణ్యం అంతరంగా ఉంది. చదువుతో పాటు నైపుణ్యం పెంచితే తప్ప సమస్య పరిష్కారం కాదు. ప్రైవేటు పెట్టుబడులు పెరిగితే, పరిశ్రమలు పెరుగు తాయని ఇంత కాలం ప్రభుత్వం భావించింది.కానీ ఎన్ని రాయితీలు ఇచ్చినా వచ్చిన పెట్టుబడులు తక్కువ. పెరిగిన ఉపాధి తక్కువే. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పెట్టుబడి వ్యయం పెంచింది. ముఖ్యంగా నైపుణ్యం పెంచడంపై దృష్టి పెట్టింది. అయితే, దీనికి కేటాయించిన నిధులు తక్కువే. ఇక్కడో ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి. నైపుణ్యం పెంపునకు కచ్చితమైన అధ్యయనం చేయాలి. అవసరమైన ప్రణాళికలు రూపొందించాలి. అప్పుడే యువతను నాణ్యమైన ఉద్యోగాల వైపు తీసుకెళ్ళడం సాధ్యం. ఏ సెక్టార్ నుంచి ఎలాంటి నైపుణ్యం కావాలనే విషయాన్ని గుర్తించాలి. దీంతో పాటు నాణ్యమైన విద్యా విధానాలను ముందుకు తేవాల్సిన అవసరం ఉంది.– ప్రొ. ఇ. రేవతి, వ్యాసకర్త, ‘సెస్’ డైరెక్టర్, హైదరాబాద్ -
సూడాన్ నుంచి మనోళ్ల తరలింపుకు ఆపరేషన్ కావేరి
న్యూఢిల్లీ: ఘర్షణలతో అట్టుడుకుతున్న సూడాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం ‘ఆపరేషన్ కావేరి’ని ప్రారంభించింది. ‘ఇందులో భాగంగా సుమారు 500 మంది భారతీయులు సూడాన్ పోర్టుకు చేరుకున్నారు. మరికొందరు వస్తున్నారు. వీరి కోసం అక్కడ ఓడలు, విమానాలను సిద్ధంగా ఉంచాం. సూడాన్‌లోని ప్రతి భారతీయుడికీ సాయంగా నిలుస్తాం’అని విదేశాంగ మంత్రి జై శంకర్ ట్వీట్ చేశారు. వైమానిక దళానికి చెందిన రెండు విమానాలను సౌదీ అరేబియాలోని జెడ్డాలో, నేవీకి చెందిన ఒక షిప్‌ను సూడాన్‌లోని ఒక పోర్టులో కేంద్రం ఇప్పటికే సిద్ధంగా ఉంచింది. మరోవైపు, సూడాన్‌లో ఉండిపోయిన తమ పౌరులు, దౌత్య సిబ్బంది తరలింపును పలు యూరప్, మధ్య ప్రాచ్య దేశాలు ముమ్మరం చేశాయి. ఫ్రాన్స్ ప్రభుత్వం సూడాన్ నుంచి వెనక్కి తీసుకువచ్చిన 28 దేశాలకు చెందిన 388 మందిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నట్లు ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయం సోమవారం వెల్లడించింది. సూడాన్ నౌకాశ్రయంలో భారతీయులు -
టిక్.. టిక్.. టిక్.. షేరింగ్‌కు సమయం లేదు మిత్రమా!
మన దేశంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ అలరించిన మొబైల్ ఫోన్ అప్లికేషన్(యాప్) టిక్‌టాక్. యాప్‌లో స్వయంగా వీడియోలు రూపొందించి, సోషల్ మీడియాలో పోస్టుచేసి, లైక్‌లు కొట్టేయడం, కామెంట్లు చూసుకొని మురిసిపోవడం ఒక మధురానుభూతి, ఒక జ్ఞాపకం. చైనాకు చెందిన ఈ యాప్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించడంతో ఇప్పుడు ఎవరికీ అందుబాటులో లేకుండాపోయింది. ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్‌ను నిషేధిస్తున్న దేశాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. అమెరికాలో సగానికిపైగా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల్లో యాప్ వాడకాన్ని నిషేధించారు. అమెరికా సైనిక దళాల్లో యాప్‌పై నిషేధం అమలవుతోంది. తాజాగా ఈ జాబితాలో కెనడా చేరింది. జనానికి నచ్చిన టిక్‌టాక్‌ను ప్రభుత్వాలే వారి నుంచి దూరం చేస్తుండడానికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం.. ఎందుకీ నిషేధం? ► టిక్‌టాక్‌ను నిషేధించడానికి ప్రభుత్వాలు చెబుతున్న ప్రధాన కారణం దేశ భద్రత. ► యూజర్ల డేటాతో పాటు బ్రౌజింగ్ హిస్టరీ, లొకేషన్ వంటి వివరాలు నేరుగా చైనా ప్రభుత్వానికి చేరే ప్రమాదం ఉందని వివిధ దేశాలు అనుమానిస్తున్నాయి. ► ఇతర దేశాలపై, అక్కడి ప్రభుత్వాలపై దుష్ప్రచారం చేయడానికి టిక్‌టాక్ యాప్ చైనా చేతిలో ఒక ఆయుధంగా మారు తుందని భావిస్తున్నాయి. ► తప్పుడు ప్రచారం సాగించి, ఎన్నికల ఫలితాలను సైతం ప్రభావితం చేసే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ► టిక్‌టాక్ వల్ల యూజర్ల డేటాకు భద్రత లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వాలు ఇచ్చే ఫోన్లలోనూ టిక్‌టాక్ వాడుతున్నారని, దానివల్ల జాతీయ భద్రత ప్రమాదంలో పడుతుందని అంటున్నారు. ► విదేశాల సమాచారం చైనా చేతుల్లోకి వెళ్తే అక్కడి కంపెనీలు దాన్ని ఒక అవకాశంగా వాడుకొని లబ్ధి పొందుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఏయే దేశాలు నిషేధించాయి? ► 2021 జనవరిలో భారత్ టిక్‌టాక్‌ను పూర్తిస్థాయిలో నిషేధించింది. డేటా ప్రైవసీ, జాతీయ భద్రత కోసమంటూ చైనాకు చెందిన ఇతర యాప్‌లపైనా నిషేధం విధించింది. ► ఇండోనేషియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో తాత్కాలిక నిషేధం విధించారు. నిర్ధారణ కాని, అనైతిక సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకే ఈ చర్య తీసుకున్నట్లు అక్కడి ప్రభుత్వాలు వెల్లడించాయి. ► అమెరికా, కెనడా, యూరోపియన్ యూనియన్(ఈయూ)లో ప్రభుత్వం ఇచ్చిన అన్ని ఫోన్ల నుంచి టిక్‌టాక్‌ను తొలగించాలంటూ ఉద్యోగులకు ఇటీవలే ఆదేశాలు అందాయి. ► అమెరికాలో 50కిపైగా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఎలక్ట్రానిక్ పరికరాల్లో టిక్‌టాక్‌ను బ్యాన్ చేశారు. కేవలం ప్రభుత్వ ఫోన్లలోనే కాదు, సాధారణ ప్రజలు సైతం టిక్‌టాక్ వాడకుండా పూర్తిగా నిషేధించాలని అమెరికాలో కొందరు పార్లమెంట్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ► అమెరికా సైనిక దళాల్లో టిక్‌టాక్ వాడకాన్ని ఇప్పటికే నిషేధించారు. ► తైవాన్‌లో ప్రభుత్వ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్ కంప్యూటర్లలో టిక్‌టాక్ యాప్ ఉపయోగించడాన్ని 2022 డిసెంబర్లో నిషేధించారు. టిక్‌టాక్ వాదనేంటి? ► తమ యాప్ వల్ల డేటా భద్రత ఉండదన్న వాదనను టిక్‌టాక్ యాజమాన్యం ఖండించింది. ► యాప్ కారణంగా డేటా చౌర్యం జరుగుతోందని తేల్చడానికి ఎలాంటి ఆధారాల్లేవని స్పష్టం చేసింది. ► యూజర్ల వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లే అవకాశమే లేదని, యాప్‌ను నిశ్చింతగా వాడుకోవచ్చని భరోసా ఇచ్చింది. ► కొన్ని దేశాలు టిక్‌టాక్‌ను నిషేధించడం విచారకరమని పేర్కొంది. డేటా ప్రైవసీకి తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించింది. ► యాప్‌ను నిషేధించడం యాజర్లను తప్పుదోవ పట్టించడమే అవుతుందని యాజమాన్యం ఆక్షేపించింది. ► నిషేధం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆరోపించింది. ► కొన్ని పాశ్చాత్య దేశాలు అభద్రతాభావంతో టిక్‌టాక్‌ను తొలగిస్తున్నాయని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని చైనా ప్రభుత్వం విమర్శిస్తోంది. యాప్‌పై నిషేధం విధించడం ఆయా దేశాల్లో వ్యాపార వాతావరణాన్ని దెబ్బతీయడం ఖాయమని తేల్చిచెప్పింది. అసలు ఏమిటీ యాప్? చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ అనే కంపెనీ ‘డౌయిన్’ పేరిట 2016 సెప్టెంబర్‌లో యాప్‌ను ప్రారంభించింది. తొలుత చైనాలోనే అందుబాటులోకి వచ్చిన ఈ యాప్ యూజర్లను విశేషంగా ఆకట్టుకుంది. రికార్డుస్థాయిలో డౌన్లోడ్లు జరిగాయి. దాంతో బైట్‌డ్యాన్స్ కంపెనీ 2017లో అంతర్జాతీయ వెర్షన్‌ను ప్రారంభించింది. దీనికి టిక్‌టాక్ అనే పేరుపెట్టింది. 2018 ఆగస్టు నుంచి యాప్ ప్రపంచమంతటా బాగా వ్యాప్తిలోకి వచ్చింది. చైనాలో ఇది డౌయిన్ పేరిటే కొనసాగుతోంది. తక్కువ నిడివితో కూడిన వీడియోల షేరింగ్ కోసం టిక్‌టాక్ యాప్‌ను రూపొందించారు. ప్రాథమికంగా లిప్ సింకింగ్, డ్యాన్సింగ్ వీడియోలను ఇతరులతో పంచుకొనే వీలుంది. 3 సెకండ్ల నుంచి 10 నిమిషాల నిడివిల వీడియోలు ఉంటాయి. యూజర్ల అభిరుచులు, ఆసక్తిని బట్టి వీడియోలు ప్రత్యక్షం కావడం ఇందులోని మరో ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా 40కిపైగా భాషల్లో టిక్‌టాక్ యాప్ అందుబాటులో ఉంది. -
వొడాఫోన్‌లో ప్రభుత్వానికి భారీ వాటా
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా వడ్డీ బకాయిల చెల్లింపుకింద ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఈక్విటీని జారీ చేయనుంది. సుమారు రూ. 16,133 కోట్లకుగాను రూ. 10 ముఖ విలువగల దాదాపు 1,613.32 కోట్ల షేర్లను కేటాయించనుంది. స్థూల సర్దుబాటు ఆదాయం(ఏజీఆర్) వాయిదా, స్పెక్ట్రమ్ వేలం చెల్లింపులపై వడ్డీ కింద వొడాఫోన్ ఐడియా ఈక్విటీ కేటాయింపునకు ప్రతిపాదించింది. ఇందుకు తాజాగా కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసింది. వెరసి వడ్డీ.. ఈక్విటీగా మార్పు చెందనుంది. ఇది కంపెనీ మొత్తం విస్తారిత ఈక్విటీలో 33.44 శాతం వాటాకు సమానంకానుంది. కంపెనీ మొత్తం చెల్లించిన మూలధన రూ. 48,252 కోట్లను మించనుంది. కంపెనీలో ప్రమోటర్లు వొడాఫోన్ గ్రూప్ వాటా 32.29 శాతానికి, ఆదిత్య బిర్లా గ్రూప్ వాటా 18.07 శాతానికి చేరనున్నాయి. 2018లో విలీనం తదుపరి 43 కోట్ల మొబైల్ వినియోగదారులతో వొడాఫోన్ ఐడియా 35 శాతం మార్కెట్ వాటాను పొందింది. తద్వారా అతిపెద్ద కంపెనీగా నిలిచిన సంస్థ ప్రస్తుతం 24.3 కోట్లమంది కస్టమర్లతో 21.33 శాతానికి మార్కెట్ వాటాకు పరిమితమై మూడో ర్యాంకుకు చేరింది. ఈ వార్తల నేపథ్యంలో వొడాఫోన్ షేరు బీఎస్ఈలో 4 శాతం పతనమై రూ. 7.94 వద్ద ముగిసింది. -
81 మంది చైనా పౌరులకు నోటీసులు 117 మందికి బహిష్కరణ
న్యూఢిల్లీ: భారత్‌లో వీసా నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా ఉంటున్న విదేశీయులపై భారత ప్రభుత్వం కొరడా ఝళిపించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రావు ఎంతమంది విదేశీయులపై చర్యలు తీసుకున్నారో వివరించారు. ఆయన మాట్లడుతూ...2019 నుంచి 2021 మధ్య కాలంలో భారత్‌లో వీసా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఉంటున్న సుమారు 81 మంది చైనా పౌరులకు భారత్‌ని వదిల వెళ్లేలా నోటీసుల, అలాగే మరో 117 మందిని మూడేళ్ల పాటు బహిష్కరించినట్లు వెల్లడించారు పైగా సుమారు 726 మంది చైనీయులను వీసా నిబంధనలను ఉల్లంఘంచిన ప్రతికూల జాబితాలో ఉన్నారని చెప్పారు. విదేశాల నుంచి భారత్‌కి వచ్చే వారి రికార్డును ప్రభుత్వం ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తుందన్నారు. కొంతమంది విదేశీయులు నిర్లక్ష్యంతోనో లేక చికిత్స నిమిత్తంగానో లేక మరేదైనా వ్యక్తిగత కారణాలతో వీసా గడువు ముగిసిపోయినా ఉండిపోతున్నారని చెప్పారు. కొన్ని అసాధారణ పరిస్థితుల్లో అనుకోకుండా నిబంధనలు ఉల్లంఘించి ఎక్కువ కాలం ఇక్కడ ఉండిపోతే జరిమాన విధించి వీసాను క్రమబద్ధీకరించడం లేదా గడువు పొడిగించడం జరుగుతుందన్నారు. అలా కాకుండా కావాలనే వీసా నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ కాలం ఉండిపోతే విదేశీయుల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా భారత్‌ని వదిలి వెళ్లేలా నోటీసులు జారీ చేసి జరిమాన విధించడం జరుగుతుందని తెలిపారు. (చదవండి: ఢిల్లీలో మరో కేసు... ఎనిమిదికి చేరిన కేసులు) -
విశాఖ రైల్వే జోన్ పట్టాలెక్కేనా!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల సుదీర్ఘ ఆకాంక్ష, విభజన చట్టంలోని హామీ అయిన విశాఖపట్నం రైల్వేజోన్ పట్టాలెక్కుతుందా!?.. లేదా మరోసారి నిరాశను మిగులుస్తూ కేంద్రం వెయిటింగ్ లిస్టులో పెడుతుందా!?.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో మంగళవారం ప్రవేశపెట్టనున్న 2022–23 వార్షిక బడ్జెట్‌పైనే యావత్ రాష్ట్రం దృష్టిసారించింది. నిజానికి దక్షిణ మధ్య రైల్వే గత ఏడాది సెప్టెంబరు 30న విజయవాడలో నిర్వహించిన సమావేశంలో వైఎస్సార్సీపీ ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌ను గట్టిగా వినిపించారు. రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నిలదీశారు. అలాగే.. రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల్లో న్యాయం చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమగ్ర నివేదికను సమర్పించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. పట్టాలెక్కుతుందా.. అటకెక్కిస్తారా! విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్రానికి ప్రత్యేక రైల్వేజోన్ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. రాష్ట్ర విభజన చట్టంలో కూడా దీని ఏర్పాటు గురించి హామీ ఇచ్చినప్పటికీ 2018 వరకు కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదు. గత సార్వత్రిక ఎన్నికల ముందు అంటే 2019 ఫిబ్రవరి 27న విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వేజోన్’ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించి ఈ అంశాన్ని పరిశీలించేందుకు ఓ ప్రత్యేక అధికారిని కూడా నియమించింది. మరోవైపు.. రైల్వే శాఖ ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను సిద్ధంచేసింది. భవనాలు, ఇతర అవసరాల కోసం విశాఖలో దాదాపు 950 ఎకరాలు అందుబాటులో ఉందని పేర్కొంది. కానీ, గత రెండు బడ్జెట్లలోనూ రైల్వేజోన్‌పై కేంద్రం మొండిచేయి చూపించింది. గత బడ్జెట్లో కేవలం రూ.40 లక్షలు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు.. ప్రభుత్వం అనుమతిస్తే దక్షిణా కోస్తా రైల్వేజోన్ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి ఏడాదిలో పూర్తిచేసేందుకు రైల్వేబోర్డు సిద్ధంగా ఉంది. కానీ, జోన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వమే రాజకీయంగా తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో.. మంగళవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. రైల్వేజోన్‌పై కేంద్రం స్పష్టతనివ్వాలని రాష్ట్రం కోరుకుంటోంది. కేంద్రం ఇప్పుడు ప్రకటిస్తే ఏడాదిలో కొత్త జోన్ ఏర్పాటు సాధ్యపడుతుంది. ప్రస్తుతం కేంద్రం ఎలాంటి ప్రకటన చేయకుంటే ఇక రైల్వేజోన్ అంశం అటకెక్కినట్లేనని కూడా నిపుణులు భావిస్తున్నారు. (చదవండి: Parliament Budget Session 2022) డివిజన్లపై మరింత స్పష్టత అవసరం విశాఖపట్నం రైల్వే జోన్‌తోపాటు దాని పరిధిలోని డివిజన్ల ఏర్పాటులోనూ రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. 2019లో కేంద్రం ప్రకటించిన దాని ప్రకారం.. విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేర్ డివిజన్‌ను రద్దు చేస్తున్నట్టు చెప్పింది. ప్రస్తుతం ఏపీ, ఒడిశాలలో విస్తరించి ఉన్న వాల్తేరు డివిజన్ భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వేజోన్‌లో ఉంది. వాల్తేర్ డివిజన్‌ను రెండుగా విభజిస్తారు. ఒడిశాలోని ప్రాంతాలతో రాయగడ కేంద్రంగా రైల్వే డివిజన్‌ను ఏర్పాటుచేసి తూర్పు కోస్తా రైల్వేజోన్‌లో ఉంటుంది. అలాగే, ఏపీలోని ప్రాంతాలను విజయవాడ కేంద్రంగా ఉన్న రైల్వే డివిజన్లో కలుపుతారు. దీనిపై ఉత్తరాంధ్రలో తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. వాల్తేరు డివిజన్‌లేని రైల్వేజోన్‌తో ప్రయోజనంలేదని స్పష్టంచేశారు. వాల్తేరు డివిజన్‌తో కూడిన విశాఖపట్నం రైల్వేజోన్ మాత్రమే కావాలని స్పష్టంచేస్తున్నారు. అంతగా కావాలంటే విజయవాడ, గుంటూరులలో ఉన్న రైల్వే డివిజన్లను ఏకంచేసి ఓ డివిజన్ చేయొచ్చని నిపుణులు సూచించారు. దాంతో ఏపీ పరిధిలో మూడు రైల్వే డివిజన్లే ఉంటాయని చెప్పారు. ఈ అంశంపై కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. రైల్వే జోన్‌తోపాటు బడ్జెట్లో రాష్ట్రం ఆశిస్తున్నవి.. ► కర్నూలు జిల్లా డోన్ కేంద్రంగా రైల్వే కోచ్‌ల సెకండరీ మెయింటెనెన్స్ లోకోషెడ్ ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అందుకు 100 ఎకరాలు కేటాయిస్తామని కూడా చెప్పింది. దాంతో రాయలసీమ ప్రాంతంలో రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేయొచ్చన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. ► రాష్ట్రానికి కనీసం రెండు కొత్త రైళ్లు కేటాయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. విశాఖపట్నం–బెంగళూరు, తిరుపతి–వారణాసి సూపర్‌ఫాస్ట్ రైళ్లు ప్రవేశపెట్టాలని కోరింది.ఇక విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా ఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్ వేయాల్సి ఉంది. విజయవాడ నుంచి సికింద్రాబాద్, విశాఖపట్నం నుంచి తిరుపతికి పగటిపూట నడిచే రైళ్లు కూడా వేయాలని ప్రతిపాదించారు. ► విజయవాడ–ఖరగ్‌పూర్ ప్రత్యేక ఫ్రైట్ కారిడార్ ఏర్పాటుచేస్తామని గత బడ్జెట్లో కేంద్రం పేర్కొంది. కానీ, ఇంతవరకు పట్టించుకోలేదు. ఆ కారిడార్ కోసం ప్రత్యేకంగా లైన్ నిర్మించే అంశంపై మంగళవారం బడ్జెట్లో స్పష్టతఇవ్వాలని కోరుకుంటోంది. ► మచిలీపట్నం–భీమవరం–నిడదవోలు డబ్లింగ్ పనులు, విజయవాడ–గూడూరు మూడో లైన్ పూర్తి కోసం పూర్తిస్థాయిలో నిధులు కేటాయించాల్సి ఉంది. ► రాష్ట్రంలో ఆర్వోబీలు నిర్మాణం సందిగ్ధంలో పడింది. గుజరాత్ తమ వాటా నిధులు మంజూరు చేయనప్పటికీ ఆ రాష్ట్రంలో ఆర్వోబీలను పూర్తిచేశారు. రాష్ట్ర విభజన, కరోనా పరిస్థితులతో రాబడి కోల్పోయిన ఏపీలో మాత్రం రాష్ట్ర వాటా నిధులతో ముడిపెడుతూ పనులు నిలిపివేయడంపై వైఎస్సార్సీపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. నిధుల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమనే విషయాన్ని రైల్వేశాఖ గుర్తించాలని వారు సెప్టెంబర్ సమావేశంలో కోరారు. -
‘విభజన చట్టం ప్రకారమే కేంద్రం గెజిట్ నోటిఫికేషన్’
మంగళగిరి: విభజన చట్టం ప్రకారమే నీటి ప్రాజక్టులపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ప్రకటించిందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చెప్పారు. మంగళగిరిలోని చేనేత వస్త్ర దుకాణాలను ఆదివారం సందర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. రెండు రివర్ మేనేజ్మెంట్ బోర్డులు నిర్ణయాలు చేసే ముందు ట్రిబ్యునల్ ప్రతిపాదనకు అనుగుణంగానే పనిచేస్తాయన్నారు. ప్రాజెక్టులపై కేంద్ర పెత్తనం అన్నది అభూతకల్పనేనన్నారు. నీటి వివాదాలకు అడ్డుకట్ట వేసేందుకే కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందని, పార్టీలు రాజకీయ కారణాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయని విమర్శించారు. ప్రాజెక్టుల నిర్వహణ అనేది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉంటుందని, కేంద్రం జోక్యం చేసుకోదన్నారు. కొత్త ప్రాజెక్టుల అనుమతులు కోసం అయినా, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు కావాలన్నా రెండు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర జలశక్తి మంత్రి చర్చించుకుని అనుమతులు పొందొచ్చని జీవీఎల్ వివరించారు. -
ఏపీకి రెండు జాతీయ అవార్డులు
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించి, శిశుమరణాలను నివారించేందుకుగాను కేంద్రం అమలు చేస్తున్న పోషణ్ అభియాన్ కార్యక్రమం అమల్లో ఆంధ్రప్రదేశ్‌కు రెండు జాతీయ అవార్డులు, క్షేత్రస్థాయిలో పలు అవార్డులు దక్కాయి. ఐసీడీఎస్ ప్రోగ్రాం అమల్లో ఏపీ జాతీయస్థాయిలో మొదటి స్థానం పొందింది. ఇందుకుగాను రూ.కోటి నగదు పురస్కారాన్ని దక్కించుకుంది. అదేవిధంగా పోషకాహారం పంపిణీలో ఏపీ రెండో స్థానం పొందింది. ఈ అవార్డులను శుక్రవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డా.దమయంతి, ఆ శాఖ సంచాలకులు డా.కృతిక శుక్లా అందుకున్నారు. నాయకత్వ విభాగంలో దక్కిన అవార్డును కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, ప్రాజెక్టు స్థాయిలో అనంతపురం జిల్లా శింగనమల సీడీపీవో జి.వనజ అక్కమ్మ, క్షేత్రస్థాయిలో గుంటూరు జిల్లా తెనాలి, చిత్తూరు జిల్లా పుత్తూరు కార్యకర్తలు అవార్డులను అందుకున్నారు. -
కొత్తగా 5 ఆర్ఏఎఫ్ కేంద్రాలు
న్యూఢిల్లీ: కొత్తగా 5 రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఆర్ఏఎఫ్ల సంఖ్య 15కు చేరుకోనుంది. ఈ కొత్త కేంద్రాలు వారణాసి (ఉత్తర ప్రదేశ్), జైపూర్ (రాజస్తాన్), మంగళూరు (కర్ణాటక), హజ్‌పూర్ (బీహార్), నూహ్ (హరియాణా)ల్లో ఏర్పాటు చేస్తున్నారు. యూపీలో ఆర్‌ఏఎఫ్‌కు వారణాసి నాలుగో స్థావరం. మంజూరైన కేంద్రాల పార్లమెంట్ నియోజక వర్గాల్లో వారణాసి నుంచి ప్రధాని మోదీ, హజ్‌పూర్ నుంచి కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ ప్రాతినిథ్యం వహిస్తుం డటం గమనార్హం. ఆర్ఏఎఫ్లో ఒక్కో బెటా లియన్‌కు 1000 మంది సైనికులు ఉంటారు. -
మన్మోహన దౌత్య విషాదం
బైలైన్: ఏదైనా దేశంతో సమస్య ఉంటేనే భారత్ దాన్ని పట్టించుకుంటుంది, అంతేగానీ స్నేహ హస్తాన్ని చాపితే మాత్రం కాదు. దక్షిణాసియా అంతటా భారత్‌పట్ల కనిపించే మూతి విరుపు ధోరణికి కారణం ఇదే. ఈ వ్యవహారం చూసి లోతుగా ఆలోచించే చైనా, భారత ప్రభుత్వం నుంచి తాను రాబట్టగలిగినదంతా రాబట్టుకుంటుంది, కోరుకున్నప్పుడల్లా అవమానిస్తుంటుంది. అది చూసి పాకిస్థాన్ సంతోషంతో నవ్వుకుంటుంది. ప్రతి దేశానికి దాని సొంత ఇరుగుపొరుగులు ఉండనే ఉంటా రు. దేశ భూభాగంతో పాటే దానికి ఆ ఇరుగుపొరుగులు కూడా సంక్రమిస్తారు. భౌగోళిక రాజకీయాలు ముడిపడి ఉన్నప్పుడు ఒక దేశపు ఇరుగుపొరుగులు మరొక దేశానికి ఆత్మీయులు కావడం జరుగుతుం టుంది. అలాంటప్పుడే సమస్య సంక్లిష్టంగా మారుతుంది. శత్రుత్వమే వాస్తవానికి అత్యంత సూటిగా ఉంటుంది. రెచ్చగొట్టడమనే దానికి స్పష్టమైన కొలబద్దలు ఉంటాయి. దానికి ప్రతిస్పందన కూడా సాధారణంగా ఊహించదగినదిగానే ఉంటుంది. భారత్, పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు ఇందుకు అత్యుత్తమ ఉదాహరణ. ఇంతపాటి అతిక్రమణకు ఈ మోతాదు మందుగుండు అంటూ రెండు దేశాల విదేశాంగశాఖల కార్యాలయాలు, సైన్యాలు కచ్చితమైన కొలమానాలతో కూడిన సూత్రాలను రూపొందించుకున్నాయి. ఖడ్గం ఖంగున మోగుతుంది, ఒక్కోసారి ఓ వేటును కూడా వేస్తుంది. అయితే గాటు మాత్రం ఎప్పుడూ ముందుగా నిర్ణయించుకున్న మేరకు మాత్రమే పడుతుంది. తప్పు ఎవరిదైనా గానీ అంతకు మించిన గాయం మాత్రం చేయరు. విరామచిహ్నాల్లాగా అప్పుడప్పుడూ మృత్యువు దర్శనమిస్తున్నా జీవితం సాగిపోతూనే ఉంటుంది. అధిక సందర్భాల్లో బాధిత దేశంగా ఉండే భారత్ గతి తప్పిన గడియారపు లోలకం డోలనాలను పరిగణనలోకి తీసుకుంటుంది. శాంతి ప్రయత్నాల వల్ల నెలకొనే సానుకూల వాతావరణం కంటే భారత పటాన్ని మార్చాలనే సంకల్పంతో ఉన్నవారు ప్రేరేపించే సంఘర్షణ ఎక్కువ కావడం జరుగుతూనే ఉంటుంది. అలా అని ఇరు దేశాల మధ్య వైషమ్య భావన ప్రబలంగా ఉండటానికి అది కారణం కాదు. ఇరువైపులా ఉండే బాధ్యతాయుత ప్రభుత్వాలు ఆత్మవిశ్వాసంతోనే ఉంటాయి. అయినాగానీ ఏ పరిస్థితిలోనైనాగానీ తిరుగులేని విజయంతో ఆటకట్టింపు జరగదని ఇరుపక్షాలు గుర్తిస్తాయి. కాబట్టే ప్రతిష్టంభన ప్రమాదకర యుద్ధంగా దిగజారిపోకుండా జాగ్రత్తవహిం చటానికి అవి బాధ్యత వహిస్తాయి. మిత్రులతో అనుబంధం విషయంలోనే ఊహాశక్తి, కఠోర శ్రమ రెండూ ఎక్కువగా అవసరమవుతాయి. మన దౌత్యవేత్తలు ఉపఖండంలోని ఉన్నతాధికారుల నుంచి ఆశించదగినంత స్థాయిలో వళ్లు వంచి పనిచేసేవారే. అయినాగానీ గత ఐదేళ్ల కాలంలో వాళ్లు ఎలాంటి ప్రయోజనమూ లేకుండానే పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రయోజనం అనేది ఎప్పుడూ విధానపు పర్యవసానమే. భారత ప్రభుత్వం తన విదేశాంగ విధానాన్ని దాటుళ్లు, గెంతులు, దుంకుళ్ల క్రీడగా మార్చింది. ఫలితాలు కళ్లకు కడుతూనే ఉన్నాయి. మనకు మిత్రులు కాదగినవాళ్లలో లేదా కావాల్సినవాళ్లలో కలవరపాటును లేదా సంశయం కలగడం కనిపిస్తూనే ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్‌లు అందుకు కొట్టవచ్చినట్టుగా కనిపించే రెండు ఉదాహరణలు. ఆ రెండు పొరుగు దేశాలతో ఒకప్పుడు మన సంబంధాలు చరిత్రలోనే అత్యంత అధ్వాన్న స్థితిలో ఉండేవి. అలాంటిది ఐదేళ్ల క్రితం ఆ దేశాలతో సంబంధాలు మునుపెన్నడూ ఎరుగనంతటి స్నేహపూర్వకమైనవిగా మారడానికి చేరువయ్యాయి. రాజీవ్‌గాంధీ ఆదేశాలపై అరకొర సన్నాహాలతో మన దేశం శ్రీలంకలో చేపట్టిన సైనిక జోక్యంతో రెండు దేశాల మధ్య సంబంధాలు అథఃపాతాళానికి దిగజారాయి. ఇంది రాగాంధీ ప్రభుత్వం ప్రభాకరన్ నేతృత్వంలోని తమిళ వేర్పాటువాద ఉద్యమానికి ఆయుధాలను, శిక్షణను అం దించినప్పటి లక్ష్యానికి పూర్తిగా విరుద్ధమైన లక్ష్యంతో రాజీవ్‌గాంధీ ఆ సైనిక చర్యను చేపట్టారు. ఆ విరోదాభాసాత్మకత తారస్థాయికి చేరి భారత్ భయానకమైన ఉచ్చు లో ఇరుక్కుపోయింది. అటు సింహళులు, ఇటు తమిళులు కూడా భారత్‌ను ద్వేషించారు. ఆ విషమ పరిస్థితి నుంచి 2009లో నాటి విదేశాంగ మంత్రి ప్రణబ్‌ముఖర్జీ మార్గదర్శకత్వంలో మనం బయటపడగలిగాం. తమిళ వేర్పాటువాదులకు వ్యతిరేకంగా శ్రీలంక ప్రభుత్వం చేపట్టిన చివరి నిర్ణయాత్మకమైన పోరాటానికి ప్రణబ్ దృఢంగా, సుస్పష్టంగా, పూర్తిగా మద్దతును తెలిపారు. ఏ ప్రచారార్భాటం లేకుండానే అది జరిగింది. శ్రీలంక సైన్యం ఎల్టీటీఈని ఓడిస్తున్నా, ప్రభాకరన్‌ను హతమారుస్తున్నా యూపీఏ ప్రభుత్వం మౌనం వహించింది. తన ముఖ్య మిత్రపక్షమై న డీఎంకే ఎంతగా వత్తిడి తెస్తున్నా అది పట్టించుకోలేదు. ఆనాడు మనం శ్రీలంక ప్రభుత్వానికి ఇచ్చిన మద్దతు రెండు దేశాల మధ్య పరస్పరం లాభసాటియైన సంబంధాలను విస్తరింపజేసుకోడానికి గొప్ప పెట్టుబడిగా ఉపయోగపడాల్సింది. అందుకు బదులుగా దాదాపు ఐదేళ్ల తర్వాత ప్రధాని మన్మోహన్సింగ్ నవంబర్‌లో జరగనున్న కామన్వెల్త్ దేశాధినేతల సమావేశానికి హాజరుకాకుండా ఉండాలేమో అనిపించేంత దుస్థితి నెలకొంది. కారణం? శ్రీలంక మానవ హక్కుల ఉల్లంఘన చర్చకు వచ్చే ఆ సమావేశానికి ప్రధాని హాజరుకావడం తమిళనాడుపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని యూపీఏ ఆందోళన చెందుతుండటమేనని స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఎల్టీటీఈపై యుద్ధంలో లంక సైన్యం మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిందన్న ఆరోపణల విషయమై తమిళనాట భావోద్వేగాలు వ్యాపించి ఉన్నాయి. మన్మోహన్ వైఖరి ఏమంత అర్థవంతమైనది కాదు అనిపిస్తుంది. అందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, లంక యుద్ధం చివరి దశలో ఏమైతే జరిగిందో ఆ విషయంలో భారత్‌కు భాగస్వామ్యం ఉంది. ఎందుకంటే ఏమి జరుగుతుందో తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగానే మన ప్రభుత్వం ఏమీ చేయరాదని నిర్ణయించింది. రెండోది, దేశంలోని ఎన్నికల లెక్కలకు విదేశాంగ విధానం బందీ అయ్యేట్టయితే ఓటర్లకు లేదా జాతీయ ప్రయోజనాలను ఎన్నటికీ మేలు కలగదు. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా తిరిగి ప్రధానిగా ఎన్నిక కావడం కూడా అంతే నాటకీయమైన విస్తృతిగల అవకాశాలను కల్పించింది. బంగ్లాదేశ్‌లో మనకు షేక్ హసీనా కంటే ఉత్తమమైన మిత్రులు దొరకరు. ఎందుకంటే ఆమె 1971 బంగ్లాదేశ్ విముక్తి నేత ముజిబుర్ రెహ్మాన్ కుమార్తె. అయినాగానీ అవకాశాల నుంచి అనర్థాలను రాబట్టడం ఎలాగనే పాఠ్యపుస్తకంలోని పాఠంలాగా మన ప్రభుత్వం సున్నితమైన నదీ జలాల సమస్యపై హసీనాను వంచించింది. మన్మోహన్ ఏమి వాగ్దానం చేశారనేదే తప్ప షేక్ హసీనా ఏం కావాలని కోరారు అనేది ఇక్కడ గీటురాయి కానేకాదు, అటు ఢాకాలోనూ, ఇటు కోల్‌కతాలోనూ కూడా భారత ప్రభుత్వ నిర్వహణ నైపుణ్యం దయనీయమైనంత అధ్వాన్నంగా ఉండటం వల్లనే మన్మోహన్ ప్రభుత్వం తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. కాబట్టి భారత్ పట్ల శ్రీలంక ఆందోళనకు, బంగ్లాదేశ్ సంశయానికి తగిన కారణమే ఉంది. అయితే అవి భారత్‌పట్ల ఆగ్రహంతో లేకపోవచ్చుననేది వేరే సంగతి. భారత్ అనుసరిస్తున్నది తుపాకీని ఎటుబడితే అటు విచక్షణారహితంగా గురిపెట్టే వైఖరి. భారత్‌కు సర్వకాల సర్వావస్థల మిత్ర దేశం ఏదైనా ఉందంటే అది భూటానే. ఆ దేశంతో సంబంధాలలోని శాశ్వతమైన వసంతం కాస్తా ఎప్పుడూ ఉరుములతో భయపెట్టే తుఫానుల వానాకాలంగా దిగజారిపోయింది. అయితే అది ఇంతవరకు ఎప్పుడూ కుంభవృష్టిగా మారింది లేదనే మాట నిజమే. ఏదేమైనా భూటాన్‌తో సంబంధాలను చెడగొట్టుకోడానికి అసాధారణమైన నేర్పు ఎంతో అవసరం. గత కొన్నేళ్లుగా మనం దాన్ని సైతం సాధించగలిగాం. మన్మోహన్ ప్రభుత్వం ఏ పొరుగు దేశం కోసమైనా సమయం వెచ్చించగలుగుతోందంటే అంటే అది అమిత్ర వైఖరిగల పాకిస్థాన్ లేదా నిరాశావహమైన చైనాల కోసం మాత్రమే. మిగతా దేశాలకు మన ప్రభుత్వం పంపే సందేశం సరళమైనది: ఏదైనా సమస్య ఉంటేనే భారత్ దాన్ని పట్టించుకుంటుంది, అంతేగానీ స్నేహ హస్తాన్ని చాపితే మాత్రం కాదు. దక్షిణ ఆసియా అంతటా భారత్‌పట్ల కనిపించే మూతి విరుపు ధోరణికి కారణాలను ఇది విశదం చేయగలుగుతుంది. ఈ వ్యవహారం చూసి లోతుగా ఆలోచించే చైనా, భారత ప్రభుత్వం నుంచి తాను రాబట్టగలిగినదంతా రాబట్టుకుంటుంది, కోరుకున్నప్పుడల్లా అవమానిస్తుంటుంది. అది చూసి సంతోషించే పాకిస్థాన్ నవ్వుకుంటూ సార్క్ దేశాల సౌహార్ద్రతను కూడగట్టుకుంటుంది.