సినిమానో వెబ్ సిరీస్ అనేది చాలా జాగ్రత్తగా తీయాలి. లేదంటే ఈ కాలంలో ఎక్కడిలేనన్నీ వివాదాలు చుట్టుముడతాయి. అదే నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీస్తే మరింత కేర్‌ఫుల్‌గా ఉండాలి. కానీ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ మాత్రం తప్పు మీద తప్పు చేస్తూనే ఉంది. గతంలో పలు సినిమాలు, సిరీస్‌లతో వ్యతిరేకత ఎదుర్కొంది. ఇప్పుడు 'ఐసీ 814: కాందహార్ హైజాక్' సిరీస్‌తో మరో వివాదానికి కేరాఫ్ అయింది.
1999లో భారతీయ విమానం హైజాక్ గురించి అంత త్వరగా జనాలు మర్చిపోలేదు. అదే స్టోరీని తీసుకుని తీసిన వెబ్ సిరీస్ 'ఐసీ 814: కాందహార్ హైజాక్'. విజయ్ వర్మ, నసీరుద్దీన్ షా, అరవింద స్వామి తదితరులు కీలక పాత్రలు పోషించారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజై అద్భుతమైన స్పందన సొంతం చేసుకుంది. రీసెంట్ టైంలో వచ్చిన వాటిల్లో బెస్ట్ అని ప్రశంసిస్తున్నారు.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 8' షోలో తెలుగు వాళ్లకు అన్యాయం?)
అయితే కాందహార్ హైజాక్ చేసింది పాకిస్థాన్‌కి చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదులే. అప్పట్లోనే నిందితుల పేర్లు బయటకొచ్చాయి. ఇబ్రహీం అక్తర్, సన్నీ ఖాజీ, సాహిద్ సయ్యద్, మిస్త్రీ జహూర్, షకీర్ అని అప్పుడే వాళ్లు ఫొటోలు కూడా రిలీజ్ చేశారు. కానీ తాజాగా రిలీజ్ చేసిన సిరీస్‌లో మాత్రం పేర్లు మార్చేశారు. భోళా, శంకర్, బర్గర్, డాక్టర్ అని వేరే పేర్లతో సంభోదించారు. ఇలా పనిగట్టుకుని ముస్లింలా పేర్లు మార్చి ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టించడంపై సోషల్ మీడియాలో విమర్శలు గట్టిగానే వస్తున్నాయి.
ఈ క్రమంలోనే భారతీయ ప్రసార, బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖ.. నెట్‌ఫ్లిక్స్ సంస్థకు సమన్లు జారీ చేసింది. పేర్లు మార్పుపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మరి ఈ విషయంలో సదరు ఓటీటీ సంస్థ ఏమని సమాధానమిస్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లోకి వచ్చి రోజు కాలేదు.. అప్పుడే గొడవలు)
Comments
Please login to add a commentAdd a comment