'బిగ్‌బాస్'లోకి వచ్చి రోజు కాలేదు.. అప్పుడే వాగ్వాదాలు | Bigg Boss Telugu 8 Day 1 Promo Shekar Basha Sonia Akula | Sakshi
Sakshi News home page

Bigg Boss Promo: ఓవైపు గొడవలు.. మరోవైపు గేమ్స్ షురూ

Sep 2 2024 11:04 AM | Updated on Sep 2 2024 11:59 AM

Bigg Boss Telugu 8 Day 1 Promo Shekar Basha Sonia Akula

బిగ్‌బాస్ 8వ సీజన్ లాంచ్ అయిపోయింది. ఆదివారం ఎపిసోడ్‌లో 14 మంది, అది కూడా 7 జంటలుగా హౌసులోకి అడుగుపెట్టారు. వీళ్లలో తలో ఏడుగురు అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నారు. హౌసులోకి వెళ్లేటప్పుడు నవ్వుతూ వెళ్లారు. కానీ రోజు కూడా పూర్తవలేదు. అప్పుడే గొడవలు షురూ అయిపోయాయి. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: కోట్లు ఇచ్చినా 'బిగ్‌బాస్'లోకి వెళ్లనంది.. ఇప్పుడేమో విష్ణుప్రియ ఇలా)

ఫ్రెషప్ అయిన తర్వాత నారింజ పండుతో కొందరు క్యాచ్ పట్టుకునే గేమ్ ఆడారు. దీన్నంతా దూరం నుంచి చూస్తూ వచ్చిన సోనియా ఆకుల.. ఇక ఉండబట్టలేక తినే ఫుడ్‌తో ఆటలేంటి అని ఫైర్ అయింది. ఈమె చెప్పడాన్ని తట్టుకోలేకపోయిన శేఖర్ భాషా.. గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. సోమవారం వీళ్లిద్దరి మధ్య గొడవనే కాస్త హైలైట్ అయ్యేలా ఉంది.

మరోవైపు తొలిరోజు ఎలిమినేషన్ లాంటిది ఏం పెట్టకుండా బ్యాలెన్సింగ్ గేమ్ పెట్టాడు బిగ్ బాస్. 'పట్టుకునే ఉండండి' పేరుతో టాస్క్ పెట్టాడు. ఇందులో భాగంగా తాళ్లు ఉంటాయి. వాటిపై ఉండాల్సి ఉంటుంది. బయట కూర్చున్న సభ్యులు.. ఒక్కో రంగు తాడుని కట్ చేస్తూ ఉంటారు. పైన ఉన్నవాళ్లు కింద కాళ్లు పెడితే ఔట్. మరి ఇందులో ఎవరు గెలిచారనేది రాత్రికి తెలుస్తుంది.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 8' లాంచ్ ఎపిసోడ్ హైలైట్స్.. 14 మంది హౌస్‌మేట్స్ వీళ్లే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement