కోట్లు ఇచ్చినా 'బిగ్‌బాస్'లోకి వెళ్లనంది.. ఇప్పుడేమో ఇలా | Anchor Vishnu Priya Comments Bigg Boss Show Telugu Old Video | Sakshi
Sakshi News home page

Vishnu Priya: బిగ్‌బాస్ కాన్సెప్టే నాకు నచ్చదు.. విష్ణుప్రియ వీడియో వైరల్

Sep 2 2024 10:32 AM | Updated on Sep 2 2024 11:49 AM

Anchor Vishnu Priya Comments Bigg Boss Show Telugu Old Video

తెలుగులో బిగ్‌బాస్ 8వ సీజన్ గ్రాండ్‌గా మొదలైంది. 14 మంది అది కూడా జంటలుగా ఈ సారి హౌసులో అడుగుపెట్టారు. వీళ్లలో జనాలకు తెలియని వాళ్లే ఎక్కువే ఉన్నారు. కొందరు సీరియల్ హీరోయిన్లతో పాటు యాంకర్ విష్ణుప్రియ కాస్తోకూస్తో జనాలకు తెలియొచ్చు. ఈ సీజన్‌లో వన్ ఆఫ్ ది ప్రామిసింగ్ కంటెస్టెంట్ అయిన విష్ణుప్రియ గతంతో ఇదే షోపై ఊహించని కామెంట్స్ చేసింది. అసలు షో కాన్సెప్టే నచ్చదని, కోట్లు ఇచ్చినా వెళ్లనని చెప్పింది. ఆ వీడియో ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ ఆఫర్‌ రిజెక్ట్‌ చేసిన సీరియల్‌ నటి అంజలి పవన్.. ఎందుకంటే?)

ఇంతకీ ఏమైంది?
బిగ్‌బాస్ 4 అంటే 2020. సీజన్ చివరకొచ్చేసరికి ఓ యూట్యూబ్ ఛానెల్ వాళ్లు.. ఓ ప్రోగ్రాంలో కనిపించిన యాంకర్ విష్ణుప్రియని బిగ్‌బాస్ షోపై అభిప్రాయం అడిగారు. దీంతో షో గురించి నిజాలు చెప్పేసింది. కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు, ఎలిమినేషన్.. ఇవన్నీ అస్సలు నచ్చవని చెప్పింది. అసలు ఇలాంటి షోనే ఎంకరేజ్ చేయనని చెప్పింది.

వీడియోలో ఏముంది?
'బిగ్ బాస్ కాన్సెప్టే నాకు నచ్చదు. ఆ కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు, ఎలిమినేషన్ అంటే నాకు ఇష్టం ఉండదు. అలాంటి షోకి డబ్బులు ఇస్తున్నారంటే ఎందుకు పోతా? లక్షలు కాదు.. ఎన్నికోట్లు ఇచ్చినా నేను బిగ్ బాస్ షోకి కంటెస్టెంట్‌గా వెళ్లను. బయట ప్రపంచం ఇంత అందంగా ఉన్నప్పుడు ఒక హౌస్‌లోకి వెళ్లి బంధీగా ఎందుకు ఉండాలి. మీ ఇళ్లు ఫ్యామిలీ ఇవన్నీ ఉన్నాయి కదా.. నేను బిగ్‌బాస్ పర్సన్‌ని కాదు.. చిన్నప్పటి నుంచి కూడా నేను బిగ్ బాస్ షో చూడలేదు. ఇలాంటి షోని నేను ఎంకరేజ్ చేయను'

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 8' లాంచ్ ఎపిసోడ్ హైలైట్స్.. 14 మంది హౌస్‌మేట్స్ వీళ్లే)

'నేను ఎప్పుడూ చేసే పని ద్వారా నా స్టాటస్ పెరగాలని అనుకోను. పది మంది గుర్తించాలని కూడా అనుకోను. నేను చేసిన పనిని నేను ఎంజాయ్ చేయాలి. నేను ఎంజాయ్ చేసిన తరువాతే అవతలి వాళ్లు కూడా ఎంజాయ్ చేస్తారు. నా గోల్ ఏంటంటే.. నేను నవ్వుతూ ఉండాలి.. నా చుట్టుపక్కల వాళ్లు కూడా నవ్వుతూ ఉండాలి. అది ఎలా అయినా సరే.. టీవీ కావచ్చు.. సినిమా కావచ్చు. నాకు వెంటనే డబ్బులు వచ్చేయాలి. పెద్ద సెలబ్రిటీ అయిపోవాలని అయితే లేదు. నేను ఎట్టిపరిస్థితుల్లోనూ బిగ్ బాస్ షోకి అయితే వెళ్లడం జరగదు. రాసిపెట్టుకోండి. వెళ్తే నన్ను బ్లేమ్ చేసుకోవచ్చు' అని విష్ణుప్రియ చెబుతున్న పాత వీడియో తాజాగా ఆమె షోలో అడుగుపెట్టిన నేపథ్యంలో వైరల్ అవుతోంది.

ఈసారి బిగ్ బాస్ షోలో 12వ కంటెస్టెంట్‌గా విష్ణుప్రియ అడుగుపెట్టింది. ఈమెతో పాటు యష్మి గౌడ, నిఖిల్ మళయక్కల్, అభయ్ నవీన్, ప్రేరణ కంభం, ఆదిత్య ఓం, సోనియా ఆకుల, బేబక్క (మధు నెక్కంటి), శేఖర్ భాషా, కిరాక్ సీత, నాగ మణికంఠ, పృథ్వీరాజ్, నైనిక, నబీల్ అఫ్రిది ఉన్నారు. వారాలు అయ్యేకొద్ది వీళ్లలో గెలిచి నిలిచేది ఎవరనేది చూడాలి?

(ఇదీ చదవండి: భార్య చెప్పిందని ఆఫర్‌ వదులుకున్న నటుడు? ఇంద్రనీల్‌ ఏమన్నాడంటే?)

Advertisement
 
Advertisement
Advertisement