భార్య చెప్పిందని ఆఫర్‌ వదులుకున్న నటుడు? ఇంద్రనీల్‌ ఏమన్నాడంటే? | Actor Indra Neel Gives Clarity On His Bigg Boss 8 Telugu Entry, Deets Inside | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్‌ 8లోకి ఎంట్రీ..? పచ్చళ్ల ప్రమోషన్‌ కోసం...! ఇంద్రనీల్‌ ఏమన్నాడంటే?

Published Fri, Aug 30 2024 11:34 AM | Last Updated on Fri, Aug 30 2024 1:16 PM

Actor Indra Neel Gives Clarity on Bigg Boss 8 Telugu Entry

రెండు రోజుల్లో బిగ్‌బాస్‌ షో ప్రారంభం కానుంది. కంటెస్టెంట్లు వీళ్లేనంటూ ఎంతోమంది పేర్లు ప్రచారంలోకి చ్చాయి. వారిలో ఆదిత్య ఓం, అంజలి పవన్‌, నిఖిల్‌, అభిరామ్‌ వర్మ, బెజవాడ బేబక్క, కిర్రాక్‌ సీత, శేఖర్‌ భాషా, నైనిక, మణికంఠ, కల్యాణి, రవితేజ, విష్ణు ప్రియ ఉన్నారు. వీరే కాదు, కృష్ణ ముకుంద మురారీ సీరియల్‌లో నటించిన ప్రేరణ, యష్మిని గౌడ కూడా ఈ సీజన్‌లో సందడి చేయనున్నారట! అలాగే దర్శకుడు పరమేశ్వర్‌ను సంప్రదించారని ప్రచారం జరుగుతోంది.

బిగ్‌బాస్‌ టీమ్‌ సంప్రదింపులు
మొన్నటివరకైతే మొఘలిరేకులు ఫేమ్‌ ఇంద్రనీల్‌ కూడా బిగ్‌బాస్‌కు రాబోతున్నాడని ఓ వార్త వైరలయింది. దీనిపై ఇంద్రనీల్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో స్పందించాడు. అతడు మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ టీమ్‌ నన్ను సంప్రదించిన మాట వాస్తవమే.. కానీ నాకు ఆసక్తి లేదని చెప్పేశాను. నాలాంటివాళ్లకు ఇలాంటి రియాలిటీ షోలు సెట్టవవు. అయితే కొందరు మా గురించి వింతగా మాట్లాడారు. మా ఆవిడకు ఇష్టం లేదని, తను వద్దని చెప్పడంతో నేను షోలో పాల్గొనడం లేదని ఓ రివ్యూయర్‌ కామెంట్లు చేసింది. అది చూసి నవ్వుకున్నాం.

మా లైఫ్‌లోకి దూరొద్దు
ఇంకొకరైతే బిగ్‌బాస్‌కు వస్తే మా పచ్చళ్ల బిజినెస్‌ పెరుగుతుందని ఫూలిష్‌గా మాట్లాడారు. ఎవరైనా షోకి వెళ్లి పచ్చళ్లు అమ్ముకుంటారా? అసలు మాకు లేని ఆసక్తి మీకెందుకు? నా కెరీర్‌లో ఇప్పటివరకు అన్ని నిర్ణయాలు నా సొంతంగానే తీసుకున్నాను. నా భార్య ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. మేమిద్దరం ఎవరి కెరీర్‌ వాళ్లం చూసుకుంటున్నాం. అనవసరంగా ఏదేదో ఊహించుకుని మాట్లాడొద్దు. మా వ్యక్తిగత జీవితంలోకి దూరొద్దు. ఈసారైతే బిగ్‌బాస్‌కు వెళ్లడం లేదు అని క్లారిటీ ఇచ్చాడు.

చదవండి: ఏంది స్వామీ ఆ స్పీడు.. అదేం షూటింగ్‌ కాదు..కాస్తా తగ్గించు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement