ఏంది స్వామీ ఆ స్పీడు.. అదేం షూటింగ్‌ కాదు..కాస్తా తగ్గించు! | Ajith Kumar Drives His Car At Shocking Speed Video Goes Viral, Check Out Netizens Reactions | Sakshi
Sakshi News home page

Ajith Kumar: హీరో అజిత్‌ కుమార్‌.. మీ స్పీడుకు లిమిట్‌ లేదా?

Published Fri, Aug 30 2024 7:31 AM | Last Updated on Fri, Aug 30 2024 9:30 AM

Ajith Kumar drives His Car At Shocking Speed Video Goes Viral

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం విడాముయార్చి చిత్రంలో నటిస్తున్నారు. మగిజ్‌ తిరుమేని దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీ దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌ కీ రోల్ పోషిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. అజిత్‌కు కారు, బైక్ రేసులు అంటే మహా సరదా. కాస్తా షూటింగ్ విరామం దొరికితే చాలు.. బైక్‌ రైడింగ్‌ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. సినిమాలకు కాస్తా గ్యాప్‌ రావడంతో తాజాగా తన లగ్జరీ కారుతో రైడ్‌కు వెళ్లారు. ఆడి కారులో ఏకంగా 234 కిమీ స్పీడ్‌తో డ్రైవ్ చేస్తూ కనిపించారు. అయితే సీటు బెల్ట్ కూడా లేకుండా.. ఏమాత్రం భయం లేకుండా అంత స్పీడులో అజిత్ కారును నడపడం విశేషం.

అయితే ఇది చూసిన అజిత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో ఇలాంటి స్టంట్స్‌ చేయడం మంచిది కాదని సూచిస్తున్నారు. రోల్‌ మోడల్‌గా ఉన్న మిమ్మల్ని చూసి యువత అదే స్పీడులో వెళ్లితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ కారును నడిపింది ఇండియాలోనా లేదా విదేశాల్లోనా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే సీటు బెల్ట్ లేకుండా అంత వేగంతో వెళ్తే మనదేశంలో అయితే ట్రాఫిక్ రూల్స్‌ వర్తిస్తాయా అన్నదే డౌటానుమానం. ఏదేమైనా కారు అంత స్పీడుతో నడపడం మంచిది కాదని చాలామంది  నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement