Overspeed
-
హైదరాబాద్‌లో స్పీడ్ లిమిట్ 60 దాటితే ఫైన్.. ఏ రూట్లో తెలుసా?
హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో బైక్ రైడర్లు రయ్..రయ్ అంటూ దూసుకెళ్తున్నారు.. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వీరి స్పీడ్‌కు అద్దూఅదుపు లేకుండాపోతోంది. దీంతో తరచూ వీరు ప్రమాదాల బారీనపడటమే కాకుండా ఇతరుల ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీంతో వీరికి ముకుతాడు వేసేందుకు ట్రాఫిక్ అధికారులు లేజర్గన్లను ఏర్పాటు చేసి 60కి మించి వేగంతో వెళ్లిన వారికి జరిమానాలు విధిస్తూ ప్రమాదాలు అరికట్టేందుకు చర్యలు చేపట్టారు.బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రహదారులపై రయ్.. రయ్‌మంటూ మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్న స్పీడ్ రైడర్లకు ట్రాఫిక్ పోలీసులు ‘లేజర్ గన్’తో ముకుతాడు పెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అదుపుతప్పిన వేగంతో దూసుకెళ్లిన వాహనదారులపై కొరడా ఝళిపిస్తున్నారు. లేజర్ గన్ ద్వారా స్పీడ్ లిమిట్ దాటిన వాహనాలను గుర్తించి వారికి జరిమానాలు కూడా విధిస్తున్నారు. ఇటీవల కాలంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ రహదారులపై అతి స్పీడ్ కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వీటిని అదుపు చేసేందుకు రోడ్డు పక్క న సీక్రెట్‌గా స్పీడ్‌ను నమోదు చేస్తూ హద్దులు దాటిన వారిని గుర్తిస్తున్నారు.1324 మందిపై కేసులుదీనిలో భాగంగానే బంజారాహిల్స్ రోడ్డునెంబర్–2లోని కేబీఆర్ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ పోలీసులు లేజర్ గన్ ఏర్పాటు చేశారు. ఈ నెల 1వ తేదీ నుంచి స్పీడ్ లిమిట్ దాటిన వారిని గుర్తించి చలాన్లు విధిస్తున్నారు. ఈ రోడ్డులో స్పీడ్ లిమిట్ 60కి మించరాదని నిబంధనలు విధించారు. 18 రోజుల్లో ఇప్పటి వరకు లిమిట్ 60 దాటిన 1324 మందిపై కేసులు కూడా నమోదు చేశారు. ఒక్కొక్కరికీ రూ.1000 చొప్పున జరిమానా విధించారు.చదవండి: ప్యారడైజ్ వద్ద ట్రాఫిక్ కష్టాలకు త్వరలో చెక్..! ప్రతిరోజూ 100 నుంచి 150 మంది వరకు మితిమీరిన వేగంతో లిమిట్ 60 దాటి దూసుకుపోతున్నట్లుగా లేజర్ గన్ ద్వారా తేలింది. ఈ రోడ్లలో స్పీడ్ లిమిట్ 60 దాటితే జరిమానాలు విధిస్తామని పోలీసులు వెల్లడించారు. ప్రతిరోజూ ఇక్కడ ఉంటే ట్రాఫిక్ పోలీసు స్పీడ్‌గా వెళ్లే వాహనాలపై నిఘా పెడతారని పేర్కొన్నారు. కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు వెళ్లే వాహనాలు ఇక నుంచి నిర్దేశించిన స్పీడ్‌లోనే వెళ్లాలని పేర్కొంటున్నారు. -
ఏంది స్వామీ ఆ స్పీడు.. అదేం షూటింగ్ కాదు..కాస్తా తగ్గించు!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం విడాముయార్చి చిత్రంలో నటిస్తున్నారు. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ కీ రోల్ పోషిస్తున్నారు.ఇదిలా ఉండగా.. అజిత్‌కు కారు, బైక్ రేసులు అంటే మహా సరదా. కాస్తా షూటింగ్ విరామం దొరికితే చాలు.. బైక్ రైడింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. సినిమాలకు కాస్తా గ్యాప్ రావడంతో తాజాగా తన లగ్జరీ కారుతో రైడ్‌కు వెళ్లారు. ఆడి కారులో ఏకంగా 234 కిమీ స్పీడ్‌తో డ్రైవ్ చేస్తూ కనిపించారు. అయితే సీటు బెల్ట్ కూడా లేకుండా.. ఏమాత్రం భయం లేకుండా అంత స్పీడులో అజిత్ కారును నడపడం విశేషం.అయితే ఇది చూసిన అజిత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో ఇలాంటి స్టంట్స్ చేయడం మంచిది కాదని సూచిస్తున్నారు. రోల్ మోడల్‌గా ఉన్న మిమ్మల్ని చూసి యువత అదే స్పీడులో వెళ్లితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ కారును నడిపింది ఇండియాలోనా లేదా విదేశాల్లోనా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే సీటు బెల్ట్ లేకుండా అంత వేగంతో వెళ్తే మనదేశంలో అయితే ట్రాఫిక్ రూల్స్ వర్తిస్తాయా అన్నదే డౌటానుమానం. ఏదేమైనా కారు అంత స్పీడుతో నడపడం మంచిది కాదని చాలామంది నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. New video of #Ajithkumar during the racing🏎️Speed👀🔥pic.twitter.com/Qsyi6BYtgZ— AmuthaBharathi (@CinemaWithAB) August 28, 2024 -
వాహనాల వేగానికి కళ్లెం
సాక్షి, గుంటూరు : అతివేగం వలన జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు జిల్లా రవాణాశాఖ అధికారులు రంగంలోకి దిగారు. స్పీడ్ గన్‌తో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులపై నిర్దేశించిన వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే వాహనాలను స్పీడ్‌గన్‌తో గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లాకు ఒక స్పీడ్ గన్ను ప్రభుత్వం 2018లో అందించింది. ప్రతి రోజు ఒక మోటల్ వెహికల్ ఇన్స్పెక్టర్కు స్పీడ్ గన్‌తో జిల్లాలోని వివిధ రహదారుల్లో తనిఖీలు నిర్వహించే బాధ్యతను అప్పగించారు. స్పీడ్ గన్‌లో సంబంధిత రహదారిపై నిర్దేశించిన వేగాన్ని ముందుగానే సెట్టింగ్ చేస్తారు. రహదారిపై వాహనాలను స్పీడ్ గన్‌తో పరిశీలిస్తారు. నిర్దేశించిన వేగం కంటే అధిక వేగంతో ప్రయాణించే వాహనం ఫొటో తీసుకుంటారు. వాహనం నంబరు ఆధారంగా యజమానికి రూ.1500 అపరాధ రుసుం విధిస్తారు. అపరాధ రుసుం విధించిన వాహనాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయటం వలన వాహనంపై జరిగే ఇతర లావాదేవీలు అపరాధ రుసుం చెల్లిస్తేనే సాధ్యం అవుతాయి. అపరాధ రుసుం వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో అందించిన ఫోన్ నంబరుకు సంక్షిప్త సమాచార రూపంలో అందిస్తారు. జిల్లాలో అతివేగంగా ప్రయాణించే వాహనాలపై 2018 సంవత్సరంలో 1,559 కేసులు నమోదు చేసి, రూ.21.82 లక్షల అపరాధ రుసుం విధించారు. 2019 జూన్ 9వ తేదీ వరకు 1,881 కేసులు నమోదు చేశారు. రూ.26.33 లక్షల జరిమానా వేశారు. అధిక వేగంతో అనర్థాలు వాహన ప్రమాదంలో ప్రాణ నష్టానికి వేగం ప్రధాన కారణం. వాహనాలు గంటకు 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినప్పుడు రహదారిపై ప్రమాదం జరిగిన వాహనంలో ప్రయాణిస్తున్న వారికి జరిగే గాయాల శాతం తీవ్రత తక్కువుగా ఉంటుంది. వీటి మరణాలు శాతం కూడా 10శాతానికి మించి ఉండదు. కాని వాహన వేగం 60 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల వరకు ఉంటే మాత్రం గాయాల శాతం తీవ్రత ఎక్కువుగా ఉండటంతో పాటు మరణాలు 90శాతం ఉంటుంది. ఇక 100 కిలోమీటర్లకు మించి వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమదాలు జరిగితే మాత్రం వాహనంలో రక్షణ పరికరాలైన ఎయిర్‌బెలున్సు ఉన్న అవి ఫెయిల్ అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. రహదారుల పరిస్థితి కూడా వాహనాలు వేగంపై ప్రభావం చూపుతుంది. జిల్లాలోని అంతర్గత సింగిల్, డబుల్ రోడ్లు, స్థానిక పరిస్థితుల బట్టీ కూడా వాహన వేగం నియంత్రించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన వాహనాల్లో స్పీడ్ గంటకు 150 కిలోమీటర్ల పైనే ప్రయాణించే వీలు ఉంటుంది. స్థానికంగా ఉండే రహదారుల నిర్మాణం, పరిసరాల పరిస్థితుల ఆధారంగా అతి వేగంతో ప్రయాణించే వాహనం నియంత్రణ కోల్పోతుంది. వాహనాలు పక్కకు వెళితే చెట్లకు గుద్దుకోవటం, పక్కన ఉన్న కాల్వలోకి దూసుకుపోయి ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి.జాతీయ రహదారులకు 100 కిలోమీటర్లు, ఎక్స్‌ప్రెస్ హైవేలకు 120 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించే అవకాశం ఉంది. అన్ని రహదారులపై జనసమ్మర్థంగా ఉండే ప్రాంతాలు, మూలమలుపుల వద్ద, నారో బ్రిడ్జ్‌ల వద్ద, రోడ్డు క్రాసింగ్‌లు, సర్వీసు రోడ్డులకు వెళ్లే ప్రాంతాల్లో మాత్రం 10 కిలోమీటర్లు నుంచి 5 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించాల్సి ఉంది. వేగం నిర్దేశించిన రహదారుల్లో లైట్ మోటర్ వెహికల్(నాన్ ట్రాన్స్‌పోర్టు) నో లిమిట్, లైట్ మోటర్ వెహికల్ (ట్రాన్స్‌పోర్టు) 65 కిలోమీటర్లు, మోటర్ సైకిల్ 50 కిలోమీటర్లు, ప్యాసింజర్/ గూడ్స్ వెహికల్ 65 కిలోమీటర్లు, మీడియం/హెవీ వెహికల్స్ 65 కిలోమీటర్లు, ట్రైలర్ 50 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించాలని నిబంధన ఉంది. -
అతివేగానికి ఈ- చలాన్‌తో చెక్
సాక్షి, న్యూఢిల్లీ : అతివేగం, రెడ్ లైట్ ఉల్లంఘనులకు ఈ - చలాన్లు జారీ చేయాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించారు. మారుతి సుజుకితో ఈ మేరకు రాజధాని పోలీసులు ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ (టీఎస్ఎంఎస్) అమలు కోసం ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. రింగ్రోడ్లోని 14 కిమీ పరిధిలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. టీఎస్ఎంఎస్ రెడ్‌లైట్ వయలేషన్ డిటెక్షన్ సిస్టమ్, స్పీడ్ వయలేషన్ డిటెక్షన్ సిస్టమ్ వంటి అత్యాధునిక కెమేరాలను కలిగి ఉంటుంది. ఈ వ్యవస్థ ద్వారా ఆటోమేటిక్‌గా నెంబర్ ప్లేట్‌ను గుర్తించే పరికరాలనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కెమెరాల ద్వారా రెడ్‌లైట్ ఉల్లంఘనతో పాటు వేగ పరిమితిని ఉల్లంఘించే వాహనాన్ని ఏకకాలంలో గుర్తించవచ్చు. ట్రాఫిక్ సేఫ్టీ మేనేజ్మెంట్ వ్యవస్థను మారుతి సుజుకి నెలకొల్పి రెండేళ్ల పాటు దాని నిర్వహణ బాధ్యతను చేపడుతుంది. గత ఏడాది ఢిల్లీలో రోడ్డు ప్రమాదాల కారణంగా దేశంలోనే అత్యధికంగా 1495 మంది మృత్యువాత పడ్డారు. ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా వాహనదారుల్లో క్రమశిక్షణ నెలకొంటుందని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. -
మితిమీరిన వేగంలో సిసోడియా కారు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి ఆప్ నేత మనీశ్ సిసోడియా కారు పరిమితులకు మించిన వేగంతో దూసుకెళుతుండటాన్ని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఉత్తర ఢిల్లీలోని ఖాజురీ వద్ద వేగంగా వెళుతున్న కారును గుర్తించారు. ఆ వెంటనే మరో జంక్షన్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు ఆ సమాచారం అందించి వెంటనే ఆకారును నిలిపేయాల్సిందిగా కోరారు. దీంతో వారు ఆ కారును ఆపగా అందులో డిప్యూటీ సీఎం సిసోడియాను గుర్తించారు. అయితే, మితిమీరిన వేగంతో వెళ్లినందుకు ఆయనకు రూ.400 ఫైన్ వేశామని, ఆయన చెల్లించి వెళ్లారని పోలీసులు తెలిపారు. ఈ నెల 12న ఈ ఘటన చోటుచేసుకుంది.