మితిమీరిన వేగంలో సిసోడియా కారు | Sisodia's car found overspeeding, fined by traffic cops | Sakshi
Sakshi News home page

మితిమీరిన వేగంలో సిసోడియా కారు

Published Fri, Jun 19 2015 2:24 PM | Last Updated on Tue, Nov 6 2018 4:10 PM

Sisodia's car found overspeeding, fined by traffic cops

న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి ఆప్ నేత మనీశ్ సిసోడియా కారు పరిమితులకు మించిన వేగంతో దూసుకెళుతుండటాన్ని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఉత్తర ఢిల్లీలోని ఖాజురీ వద్ద వేగంగా వెళుతున్న కారును గుర్తించారు. ఆ వెంటనే మరో జంక్షన్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు ఆ సమాచారం అందించి వెంటనే ఆకారును నిలిపేయాల్సిందిగా కోరారు. దీంతో వారు ఆ కారును ఆపగా అందులో డిప్యూటీ సీఎం సిసోడియాను గుర్తించారు. అయితే, మితిమీరిన వేగంతో వెళ్లినందుకు ఆయనకు రూ.400 ఫైన్ వేశామని, ఆయన చెల్లించి వెళ్లారని పోలీసులు తెలిపారు. ఈ నెల 12న ఈ ఘటన చోటుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement