సాక్షి, న్యూఢిల్లీ : అతివేగం, రెడ్ లైట్ ఉల్లంఘనులకు ఈ - చలాన్‌లు జారీ చేయాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించారు. మారుతి సుజుకితో ఈ మేరకు రాజధాని పోలీసులు ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ (టీఎస్‌ఎంఎస్) అమలు కోసం ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. రింగ్‌రోడ్‌లోని 14 కిమీ పరిధిలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. టీఎస్‌ఎంఎస్ రెడ్‌లైట్ వయలేషన్ డిటెక్షన్ సిస్టమ్, స్పీడ్ వయలేషన్ డిటెక్షన్ సిస్టమ్ వంటి అత్యాధునిక కెమేరాలను కలిగి ఉంటుంది. ఈ వ్యవస్థ ద్వారా ఆటోమేటిక్‌గా నెంబర్ ప్లేట్‌ను గుర్తించే పరికరాలనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కెమెరాల ద్వారా రెడ్‌లైట్ ఉల్లంఘనతో పాటు వేగ పరిమితిని ఉల్లంఘించే వాహనాన్ని ఏకకాలంలో గుర్తించవచ్చు.
ట్రాఫిక్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ వ్యవస్థను మారుతి సుజుకి నెలకొల్పి రెండేళ్ల పాటు దాని నిర్వహణ బాధ్యతను చేపడుతుంది. గత ఏడాది ఢిల్లీలో రోడ్డు ప్రమాదాల కారణంగా దేశంలోనే అత్యధికంగా 1495 మంది మృత్యువాత పడ్డారు. ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా వాహనదారుల్లో క్రమశిక్షణ నెలకొంటుందని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment