![25609 traffic violations since 2022: TSRTC](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/TSRTC.jpg.webp?itok=CKulMR-j)
2022 నుంచి 25,609 ట్రాఫిక్ ఉల్లంఘనలు
పోలీసులు విధించిన జరిమానా రూ.1.84 కోట్లు
ఇప్పటి వరకు సంస్థ చెల్లించింది రూ.74.03 లక్షలే..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఉల్లంఘనలో ప్రైవేట్ వాహనాలతో ఆర్టీసీ బస్సులు పోటీ పడుతున్నాయి. టీజీఎస్‌ఆర్టీసీ బస్సులపై ఏటా ట్రాఫిక్ పోలీసులు వేల సంఖ్యలో ఈ–చలాన్లు జారీ చేస్తున్నారు. 2022 నుంచి గత నెల 27 వరకు ఆర్టీసీ బస్సులకు 25,609 ఈ–చలాన్లు జారీ చేశారు. వీటికి సంబంధించి ఆర్టీసీ రూ.కోటికి పైగా చెల్లించాల్సి ఉంది. స్వచ్ఛంద సంస్థ యుగాంతర్ ఫౌండేషన్‌కు చెందిన యూఆర్టీఐ సంస్థ సమాచార హక్కు చట్టం కింద ట్రాఫిక్ పోలీసు విభాగం నుంచి ఈ సమాచారం సేకరించింది.
ప్రయాణీకుల కోసమే ఉల్లంఘనలు..
ఆర్టీసీ బస్సుల ట్రాఫిక్ ఉల్లంఘనల్లో ఎక్కువగా ప్రయాణికుల కోసం చేస్తున్న పొరపాట్లే ఉంటున్నాయి. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ బస్సులు ఆపడం, బస్‌బేలను పట్టించుకోకపోవడం, స్టాప్‌లైన్ క్రాసింగ్, ఫ్రీ లెఫ్ట్ వయలేషన్ వంటి ఉల్లంఘనలపై పోలీసులు అధికంగా చలాన్లు విధిస్తున్నారు. కొందరు ప్రయాణికులు ఎక్కడపడితే అక్కడ బస్సులను ఆపాలని కోరుతున్నారు.]
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/pppatika_0.jpg)
సంస్థ ఆదాయం గురించి ఆలోచిస్తున్న డ్రైవర్లు.. చెయ్యెత్తిన చోట బస్సులు ఆపుతుండటంతో ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తున్నారు. బస్ స్టాపుల్లో ఆటోలు తిష్టవేస్తుండటంతో బస్సులు రోడ్ల పైనే ఆగాల్సి వస్తోంది. కాగా, ట్రాఫిక్ జరిమానాలను చెల్లించడంలో ఆర్టీసీ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ప్రైవేటు వాహనాల మాదిరిగా ట్రాఫిక్ పోలీసులు ఆర్టీసీ బస్సులపై కఠిన చర్యలు తీసుకోకపోవటంతో చలాన్లు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment