
అంజలి పవన్.. ఈ బుల్లితెర నటి సోషల్ మీడియాలోనూ చాలా ఫేమస్. కూతురు చందమామ అలియాస్ ధన్వికతో ఫోటోషూట్స్ చేయిస్తూ పాపను కూడా పాపులర్ చేసేసింది. ఇకపోతే అంజలి ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి రానుందని ప్రచారం జరిగింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే చివరి నిమిషంలో వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇవ్వమని యాజమాన్యం కోరడంతో దానికి ఆమె తిరస్కరించినట్లు భోగట్టా!
కూతురికి అనారోగ్యం
ఈ క్రమంలో అసలు అంజలి హౌస్‌లో అడుగుపెడుతుందా? లేదా? అని ఫ్యాన్స్ గందరగోళంలో పడ్డారు. ఈ అనుమానాలన్నింటికీ తన యూట్యూబ్ వీడియో ద్వారా అంజలి సమాధానం ఇచ్చింది. అందులో ఆమె మాట్లాడుతూ.. 'నా భర్త పవన్‌కు, కూతురు ధన్వికకు ఆరోగ్యం బాగోలేదు. రెండుమూడునెలలుగా ఈ అనారోగ్య సమస్యలతోనే సతమతమవుతున్నాం. అందుకనే వీడియోలు పెట్టడం లేదు. పరీక్షలు చేయిస్తే ధన్వికి చికెన్ గున్యా అని, పవన్‌కు టైఫాయిడ్ అని తేలింది.
బిగ్‌బాస్ నుంచి పిలుపు
వర్షాకాలం కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. బిగ్‌బాస్ విషయానికి వస్తే గతంలో లాగే ఈ సీజన్ నుంచి కూడా పిలుపు వచ్చింది. వెళ్దామని అనుకున్నాను. కానీ ఇంట్లో వాళ్ల ఆరోగ్యం బాగోలేకపోవడంతో షోకి వెళ్లాలన్న ఆలోచన విరమించుకున్నాను. నా కుటుంబమే నాకు ముఖ్యం కాబట్టి ఇప్పుడైతే బిగ్‌బాస్‌కు వెళ్లడం లేదు' అని చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment