పేరుకే తెలుగు బిగ్‌బాస్. కానీ చూస్తుంటే మాత్రం అలా అనిపించట్లేదు. ఎందుకంటే మొత్తం 14 మంది హౌసులోకి అడుగుపెడితే అందులో ఏకంగా ఆరుగురు పరాయి భాషకి చెందిన వాళ్లే ఉన్నారు. వీళ్లందరూ తెలుగులో సీరియల్స్, షోలు, సినిమాలు చేశారు. ఇంతకీ వీళ్లెవరు? నిజంగానే షోలో తెలుగు వాళ్లకు అన్యాయం జరుగుతోందా? బిగ్‌బాస్ గేమ్ ప్లాన్ ఏంటనేది చూద్దాం!
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 8' లాంచ్ ఎపిసోడ్ హైలైట్స్.. 14 మంది హౌస్‌మేట్స్ వీళ్లే)
ఆదివారం కొత్త సీజన్ మొదలైంది. అమ్మాయిలు, అబ్బాయిలు ఏడు జంటలుగా హౌసులోకి అడుగుపెట్టారు. వీళ్లలో యష్మి గౌడ, నిఖిల్, ప్రేరణ, పృథ్వీరాజ్.. కర్ణాటకకు చెందినవాళ్లు. తెలుగులో సీరియల్స్ చేశారు. తెలుగు మాట్లాడటం వచ్చు. కానీ పూర్తిగా తెలుగు అయితే కాదు. అలానే నైనిక అనే డ్యాన్సర్ ఉంది. ఈమె చాన్నాళ్లుగా తెలుగు డ్యాన్స్, రియాలిటీ షోలు చేస్తోంది. సోషల్ మీడియాలో తెలుగమ్మాయి అని రాసుకుంది కానీ చూస్తుంటే ఇక్కడామె కాదనిపిస్తోంది.
అప్పట్లో 'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాతో తెలుగులో హీరోగా పేరు తెచ్చుకున్న ఆదిత్య ఓం.. చాన్నాళ్ల తర్వాత బిగ్‌బాస్ తెలుగు షోలో కనిపించాడు. ఇప్పటికీ ఇంకా తెలుగు ఇబ్బందిగానే మాట్లాడుతున్నారు. తెలుగు షోలో మాట్లాడాలన్నా, గొడవ పడాలన్నా సరే ఫ్లూయెంట్‌గా తెలుగు వస్తే ఆ మాజా వేరుగా ఉంటుంది. ఇలా వేరే భాషకు చెందిన వాళ్లని తీసుకొస్తే.. కొన్నిసార్లు వీళ్లు చెప్పింది పక్కనోళ్లకు అర్థం కాదు, వాళ్లు చెప్పింది వీళ్లకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లోకి వచ్చి రోజు కాలేదు.. అప్పుడే వాగ్వాదాలు)
దానికి తోడు వీళ్లు వేరే భాషలో మాట్లాడుకున్నా ప్రతిసారి.. తెలుగులోనే మాట్లాడండి అని బిగ్‌బాస్ చెప్పుకోవాల్సి వస్తుంది. వేరే ఏ భాషలోని బిగ్‌బాస్ షో తీసుకున్నా.. ఆయా ప్రాంతాలకు చెందిన వాళ్లే ఉంటారు తప్పితే తెలుగోళ్లు ఒక్కరూ కనిపించరు. అప్పట్లో ఓసారి బింధుమాధవి తమిళ బిగ్‌బాస్ షోలో కనిపించిందంతే.
ఈ సీజన్‌లో పాల్గొన్న 14 మందిలో ఆరుగురు వేరే భాషలకు చెందినవాళ్లు. అంటే తెలుగులో సరైన కంటెస్టెంట్సే లేరా? నిర్వహకులు కావాలనే ఇలా ప్లాన్ చేశారా అనేది క్వశ్చన్ మార్క్‌గానే మిగిలిపోయింది. మరి వీళ్లలో ఎవరు హౌసులో ఉంటారు? ఎవరు ఎలిమినేట్ అయి వెళ్లిపోతారనేది చూడాలి?
(ఇదీ చదవండి: కోట్లు ఇచ్చినా 'బిగ్‌బాస్'లోకి వెళ్లనంది.. ఇప్పుడేమో విష్ణుప్రియ ఇలా)
Comments
Please login to add a commentAdd a comment