Kandahar hijack
-
S Jaishankar: ఆ విమానంలో నా తండ్రి కూడా ఉన్నారు
జెనీవా: ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల విడుదలై వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ‘ఐసీ 814: ది కాందహార్ హైజాక్’వెబ్‌సిరీస్‌పై ఇంకా చర్చ జరుగుతున్న వేళ అలాంటి హైజాక్ ఉదంతంలో తన తండ్రి, మాజీ ఐఏఎస్ అధికారి కృష్ణస్వామి సుబ్రహ్మణ్యం కూడా బాధితుడిగా ఉన్నారని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రకటించారు. 1984 ఏడాదిలో జరిగిన విమాన హైజాక్ ఉదంతంలో తన కుటుంబం సైతం తీవ్ర ఉత్కంఠను ఎదుర్కొందని ఆయన వ్యాఖ్యానించారు. జెనీవాలో ఒక భారతీయసంతతి వ్యక్తులతో భేటీ సందర్భంగా జైశంకర్ తన కుటుంబం గతంలో పడిన వేదనను అందరితో పంచుకున్నారు. ఏడుగురు హైజాకర్లు చొరబడి.. ‘1984 జులై ఐదో తేదీన ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఐసీ 421 విమానం శ్రీనగర్ వెళ్లేందుకు ఢిల్లీ నుంచి టేకాఫ్ అయి మధ్యలో చండీగఢ్ సమీపంలోని పఠాన్‌కోట్‌లో ఆగింది. అప్పుడు ఏడుగురు హైజాకర్లు కాక్‌పిట్‌లోకి చొరబడి విమానాన్ని తమ అ«దీనంలోకి తీసుకున్నారు. విమానాన్ని హైజాక్ చేసిన వారంతా ఆలిండియా సిఖ్ స్టూడెంట్స్ ఫెడరేషన్‌కు చెందిన వాళ్లు. సిక్కు వేర్పాటువాది జరై్నల్ సింగ్ భింద్రన్‌వాలేతోపాటు ఇతర నేతలను విడుదలచేయాలని డిమాండ్ విధించారు. విమానాన్ని లాహోర్‌కు, తర్వాత కరాచీకి, చిట్టచివరకు దుబాయ్‌కు తీసుకెళ్లారు. విమానం విదేశీగడ్డపైకి వెళ్లడంతో భారత విదేశాంగ శాఖ సైతం రాయబారం నడిపేందుకు రంగంలోకి దిగింది. ఇండియన్ ఫారిన్ సరీ్వస్‌లో చేరిన తొలినాళ్లలో.. అప్పుడు నేను ఇండియన్ ఫారిన్ సరీ్వస్(ఐఎఫ్ఎస్) యువ అధికారిగా పనిచేస్తున్నా. ప్రయాణికులన విడిపించేందుకు హైజాకర్లతో చర్చలు జరపాల్సిన బృందంలో నేను కూడా సభ్యునిగా ఉన్నా. అత్యంత కీలకమైన పనిలో నిమగ్నంకావాల్సి ఉన్నందున ఇంటికి రాలేనని చెప్పేందుకు మా అమ్మకు ఫోన్ చేశా. అప్పుడు నా భార్య ఉద్యోగానికి వెళ్లింది. ఇంట్లో పసిబిడ్డగా ఉన్న నా కుమారుడిని మా అమ్మ ఒక్కరే చూసుకుంటోంది. ‘‘ఇంటికి రావడం కుదరదు. ఇక్కడ విమానాన్ని హైజాక్ చేశారు’’అని చెప్పా. అయితే పనిలో సీరియస్‌గా మునిగిపోయాక నాలుగు గంటల తర్వాత నాకో విషయం తెల్సింది. అదేంటంటే నా తండ్రి కృష్ణస్వామి కూడా అదే విమానంలో బందీగా ఉన్నారు. ఓవైపు హైజాక్ విషయం తెల్సి ప్రయాణికుల కుటుంబసభ్యులు భారత ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. బాధిత కుటుంబసభ్యుల్లో నేను ఉన్నా. మరోవైపు ప్రభుత్వం తరఫున మాట్లాడాల్సిన వ్యక్తిని కూడా నేను. ఇలాంటి విచిత్రమైన పరిస్థితి నాది. ఏదేమైనా 36 గంటల ఉత్కంఠ తర్వాత ఖలిస్తాన్ మద్దతుదారులు అధికారుల ఎదుట లొంగిపోవడంతో కథ సుఖాంతమైంది. విమానంలోని 68 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైజాక్ ఉదంతం విషాదాంతంగా ముగియకుండా ఒక సమస్యకు పరిష్కారంగా మలుపు తీసుకుంది’’అని అన్నారు. ‘‘నేనింకా కాందహార్ వెబ్‌సిరీస్ చూడలేదు. అయితే హైజాకర్లతో ప్రభుత్వం, మధ్యవర్తులు కాస్తంత వెనక్కి తగ్గి మాట్లాడినట్లుగా అందులో చూపించారట కదా. సినిమాల్లో హీరోను మాత్రమే అందంగా చూపిస్తారు. ప్రభుత్వం సరిగా పనిచేసినా చూపించరు’’అని అన్నారు. అణ్వస్త్ర విధానాల్లో సుబ్రహ్మణ్యం కీలకపాత్ర మాజీ ఐఏఎస్ అధికారి అయిన కృష్ణస్వామి హైజాక్ జరిగిన ఏడాది ఢిల్లీలోని డిఫెన్స్ స్టడీస్, అనాలసిస్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ తర్వాత భారత ‘అణ్వస్త్ర’విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ప్రముఖ అంతర్జాతీయ వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడిగా పేరొందారు. ‘‘అణ్వాయుధాలను తొలుత భారత్ తనంతట తానుగా ఏ దేశం మీదా ప్రయోగించకూడదు. ఒక వేళ భారత్ మీద ఎవరైనా అణ్వాయుధం ప్రయోగిస్తే ధీటైన సమాధానం చెప్పే స్థాయికి మనం ఎదగాలి’’అనే ప్రాథమిక సిద్ధాంతాల్లో రూపకల్పనలో ఈయన పాత్ర ఉందని చెబుతారు. జాతీయ భద్రతా మండలి సలహా బోర్డుకు తొలి కనీ్వనర్‌గా వ్యవహరించారు. హైజాకర్లతో చర్చల వేళ ‘‘కావాలంటే మొదట నన్ను చంపండి. ప్రయాణికులను ఏమీ చేయకండి’’అని హైజాకర్లతో కృష్ణస్వామి అన్నారని నాటి పాత్రికేయులు రాజు సంతానం, దిలీప్ బాబ్లు చెప్పారు. -
వివాదంలో మరో వెబ్ సిరీస్.. నెట్‌ఫ్లిక్స్‌కి కేంద్రం సమన్లు!
సినిమానో వెబ్ సిరీస్ అనేది చాలా జాగ్రత్తగా తీయాలి. లేదంటే ఈ కాలంలో ఎక్కడిలేనన్నీ వివాదాలు చుట్టుముడతాయి. అదే నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీస్తే మరింత కేర్‌ఫుల్‌గా ఉండాలి. కానీ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ మాత్రం తప్పు మీద తప్పు చేస్తూనే ఉంది. గతంలో పలు సినిమాలు, సిరీస్‌లతో వ్యతిరేకత ఎదుర్కొంది. ఇప్పుడు 'ఐసీ 814: కాందహార్ హైజాక్' సిరీస్‌తో మరో వివాదానికి కేరాఫ్ అయింది.1999లో భారతీయ విమానం హైజాక్ గురించి అంత త్వరగా జనాలు మర్చిపోలేదు. అదే స్టోరీని తీసుకుని తీసిన వెబ్ సిరీస్ 'ఐసీ 814: కాందహార్ హైజాక్'. విజయ్ వర్మ, నసీరుద్దీన్ షా, అరవింద స్వామి తదితరులు కీలక పాత్రలు పోషించారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజై అద్భుతమైన స్పందన సొంతం చేసుకుంది. రీసెంట్ టైంలో వచ్చిన వాటిల్లో బెస్ట్ అని ప్రశంసిస్తున్నారు.(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 8' షోలో తెలుగు వాళ్లకు అన్యాయం?)అయితే కాందహార్ హైజాక్ చేసింది పాకిస్థాన్‌కి చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదులే. అప్పట్లోనే నిందితుల పేర్లు బయటకొచ్చాయి. ఇబ్రహీం అక్తర్, సన్నీ ఖాజీ, సాహిద్ సయ్యద్, మిస్త్రీ జహూర్, షకీర్ అని అప్పుడే వాళ్లు ఫొటోలు కూడా రిలీజ్ చేశారు. కానీ తాజాగా రిలీజ్ చేసిన సిరీస్‌లో మాత్రం పేర్లు మార్చేశారు. భోళా, శంకర్, బర్గర్, డాక్టర్ అని వేరే పేర్లతో సంభోదించారు. ఇలా పనిగట్టుకుని ముస్లింలా పేర్లు మార్చి ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టించడంపై సోషల్ మీడియాలో విమర్శలు గట్టిగానే వస్తున్నాయి.ఈ క్రమంలోనే భారతీయ ప్రసార, బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖ.. నెట్‌ఫ్లిక్స్ సంస్థకు సమన్లు జారీ చేసింది. పేర్లు మార్పుపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మరి ఈ విషయంలో సదరు ఓటీటీ సంస్థ ఏమని సమాధానమిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లోకి వచ్చి రోజు కాలేదు.. అప్పుడే గొడవలు) -
దేశాన్ని కుదిపేసిన హైజాక్.. యదార్థ సంఘటనలతో వెబ్ సిరీస్
1999లో ఖాట్మండు నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఐసీ-814 ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారు. అందులో 188 మంది ప్రయాణికులతో పాటు 15 మంది సిబ్బంది సుమారు 7రోజులు పాటు బందీలుగా ఉంచారు. ఈ ఉదంతాన్ని అనుభవ్ సిన్హా ప్రేక్షకులకు చూపించనున్నారు. ప్రపంచ చరిత్రలోనే ఎప్పటికీ మరిచిపోలేని ఘటనల్లో ఫ్లైట్ 814 హైజాక్ ఒకటి అని చెప్పవచ్చు. ఇప్పుడు 'ఐసీ814:ది కాంధార్ హైజాక్' పేరుతో వెబ్ సిరీస్ విడుదల కానుంది. తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.1999లో ఖాట్మండు నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఐసీ-814 ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు అమృత్సర్, లాహోర్, దుబాయ్‌లలో కొద్దిసేపు ల్యాండింగ్ చేసిన ఉగ్రవాదులు ఆ తర్వాత తాలిబాన్ నియంత్రణలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్‌లో ఈ జెట్‌ను ఉంచారు. దేశాన్ని కుదిపేసిన ఈ ఘటన ఎప్పటికీ మరిచిపోలేము. అప్పుడు జరిగిన సంఘటనలను ‘ఐసీ814:ది కాంధార్ హైజాక్’ పేరుతో ఒక వెబ్ సిరీస్‌ను నిర్మించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఆగష్టు 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో విజయ్ వర్మ, అరవింద్ స్వామి, దియా మీర్జా, నసీరుద్దీన్ షా తదితరులు నటించారు. -
మసూద్ అజార్ హతం?
ఇస్లామాబాద్: కాందహార్ విమానం హైజాక్ సూత్రధారి మసూద్ అజార్ బాంబు పేలుడులో హతయ్యాడంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్‌గా మారాయి. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో పాకిస్తాన్‌లోని భావల్పూర్ మసీదు నుంచి వస్తుండగా బాంబు పేలిన ఘటనలో అతడు హతమైనట్లు ధ్రువీకరించని ట్వీట్ల ద్వారా తెలుస్తోంది. పేలుడుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అనంతరం పాక్ ఆర్మీ దావూద్ ఇబ్రహీం సహా పలువురు ఉగ్రవాదులపై దాడులు చేపట్టినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తోంది. భారత్‌లో మోస్ట్ వాంటెడ్‌గా ఉండి పాకిస్తాన్లో తలదాచుకుంటున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తదితర రెండు డజన్ల మంది వరకు ఉగ్రవాదులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. 2001 పార్లమెంట్‌పై దాడి ఘటనకు సంబంధించిన కేసుల్లో అజార్‌ను భారత్ వాంటెడ్‌గా ప్రకటించింది. 2008లో నేపాల్ నుంచి భారత్‌కు బయలుదేరిన ఇండియన్ఎయిర్ లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి, అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌కు తీసుకెళ్లారు. హైజాకర్ల డిమాండ్ మేరకు జైళ్లలో ఉన్న అజార్ సహా ముగ్గురు కరడుగట్టిన ఉగ్రవాదులను భారత్ ప్రభుత్వం విడిచిపెట్టింది. విమాన ప్రయాణికుల్లో ఒకరిని పొడిచి చంపిన ఉగ్రవాదులు, మరికొందరిని గాయపరిచారు. వారంపాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ అనంతరం అందులోని 176 మందిని ఉగ్రవాదులు సురక్షితంగా విడిచిపెట్టారు. -
కాందహార్ హైజాకర్.. ఇన్నాళ్లూ ఫర్నీచర్ షాప్ ఓనర్ ముసుగులో!
మిస్త్రీ జహూర్ ఇబ్రహీం.. ఈ పేరు వినగానే భారత్ రక్తం మరిగిపోతుంటుంది. ఎందుకంటే కాందహార్ హైజాక్‌లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ IC-814 విమానం దారిమళ్లించిన ముష్కరుల్లో ఒకడు వీడు. అంతేకాదు ఒక ప్రాణాన్ని సైతం బలిగొన్నాడు. భారత్‌కు పీడకలగా మిగిల్చిన ఈ హైజాకింగ్‌లో పాల్గొన్న మిస్త్రీ ఇప్పుడు హతమయ్యాడు. నాడు హైజాక్ కు పాల్పడిన ముష్కరుల్లో మిస్త్రీని ఎవరో హత్య చేశారు. కరాచీ అక్తర్ కాలనీలో నివసిస్తున్న మిస్త్రీ తలలో పాయింట్ బ్లాంక్ రేంజ్లో రెండు తుటాలు కాల్చారు గుర్తు తెలియని వ్యక్తులు. మార్చి 1వ తేదీనే ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు జహూర్ అంత్యక్రియలు కరాచీలోనే నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి జైషే ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజహార్ సోదరుడు, జైషే కీలకనేత అబ్దుల్ రౌఫ్ అస్ఘర్ హాజరయినట్లు సమాచారం. ఇన్నాళ్లూ తెలియలేదా? మిస్త్రీ మరణంపై అధికారిక ప్రకటన చేసిన పాక్ అధికారులు.. అతన్ని ఇంతకాలం గుర్తించకపోవడం విశేషం. జాహిద్ అఖుంద్‌గా పేరు మార్చుకుని అక్తర్ కాలనీలోనే ఏళ్లుగా ఉంటున్నాడు. పైగా కరాచీలోనే ఓ పెద్ద ఫర్నీచర్ షాప్ నిర్వహిస్తున్నాడు కూడా. అయినప్పటికీ పాక్ అధికారులు అతన్ని ట్రేస్ చేయకపోవడం విచిత్రం. కరాచీ నగరంలో ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో కాల్పుల దృశ్యాలు రికార్డయ్యాయి. హైజాక్ ఇలా.. 1999 డిసెంబర్ 24న సుమారు 180 మంది ప్యాసింజర్లు, 11 మంది బృందంతో వెళ్తున్న IC-814 విమానాన్ని .. ఐదుగురు ఉగ్రవాదులు దారి మళ్లించి హైజాక్ చేశారు. అమృత్సర్, లాహోర్, దుబాయ్ మీదుగా కాందహార్ కు చేరుకుంది. అక్కడ తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లింది. 25 ఏళ్ల ప్రయాణికుడు రూపిన్ కట్యాల్‌ను పొట్టనబెట్టుకున్నారు హైజాకర్లు. చివరికి డిసెంబర్ 31న.. కరడుగట్టిన ఉగ్రవాదులను భారత్ విడుదల చేయడంతో.. మిగతా ప్రయాణికులను అప్పగించారు. రూపిన్‌ను చంపింది మిస్త్రీనే అని అధికారులు సైతం ధృవీకరించారు అప్పట్లో. భార్యతో రూపిన్ కట్యాల్ ఇక కాందహార్ హైజాక్ ఘటన తర్వాత జహూర్ మిస్త్రీ... జాహిద్ అఖుంద్ పేరుతో పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలో స్థిరపడి ఫర్నిచర్ వ్యాపారం చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, అతడి హత్యను నిర్ధారించిన జియో టీవీ... ఓ వ్యాపారవేత్త హత్య అంటూ కథనం ప్రసారం చేయడం కొసమెరుపు. ఇదిలా ఉండగా.. మిస్త్రీ జహూర్ ఇబ్రహీంను ఎవరు లేపేసారన్నది తెలియాల్సి ఉంది. -
'ప్రపంచం త్వరలోనే వింతలను చూస్తుంది'
'అన్ని వైపుల నుంచి తీవ్ర మైన ఒత్తిడి ఎదురైతే ఎవరైనా ఏం చేస్తారు? ముస్లింలు కూడా అదే చెయ్యబోతున్నారు. ప్రపంచం త్వరలోనే కొన్ని వింతలను చూడబోతోంది..' అంటూ రాతపూర్వక బెదిరింపులకు దిగాడు జైష్ ఏ మహమ్మద్ చీఫ్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మౌలానా మసూద్ అజార్. జైషే అధికారిక ఆన్ లైన పత్రిక 'అల్ ఖలామ్'లో జూన్ 3న రాసిన వ్యాసంలో భారత్ పైనా తీవ్ర ఆరోపణలు గుప్పించాడు. కందహార్ విమానం హైజాగ్ ఘటన తర్వాత తనను పట్టుకునేందుకు భారత్ తాలిబన్లకు భారీగా డబ్బును ఎరచూపిందని, దివంగత తాలిబన్ చీఫ్ ముల్లా అఖ్తరే తనకీ విషయం చెప్పాడని అజార్ పేర్కొన్నాడు. 1999లో ఇండియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఐసీ-814 విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు తమ నాయకుడు మసూద్ అజార్ తోపాటు మరో ఇద్దరు కీలక నేతలు ముస్తాక్ అహ్మద, ఒమర్ సయూద్ లను విడిపించుకుపోయిన సంగతి తెలిసిందే. నాటి ఘటనలో కేంద్ర విదేశాంగ మంత్రి జశ్వంత్ సింగ్ స్వయంగా అజార్ ను తోడ్కొని వెళ్లి కందహార్ లో వదిలేశారు. ఓ వైపు ప్రయాణికుల బట్వాడ జరుగుతుండగానే, అజార్ ను తిరిగి పట్టించాలని కందహార్ ఎయిర్ పోర్టులోని వీఐపీ గెస్ట్ హౌస్ జశ్వంత్ సింగ్.. నాటి తాలిబన్ విమానయాన మంత్రి ముల్లా అఖ్తర్ తో బేరసారాలాడరని అజార్ రాసుకొచ్చాడు. 'హైజాక్ ఉదంతం ముగిసిన కొన్నేళ్లకి ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కరాచీ నుంచి కందహార్ వెళ్లాం. విమానయాన మంత్రిగా ముల్లా అఖ్తర్ అక్కడ మాకు ఘనస్వాగతం పలికారు. వీఐపీ గెస్ట్ హౌస్ లోని ఓ సోఫాలో తన పక్కనే కూర్చొబెట్టుకున్నారు. ఆయన నాతో.. 'సరిగ్గా నువ్వు కూర్చున్న చోటే భారత మంత్రి జశ్వంత్ కూర్చుని, నిన్ను పట్టివ్వమని, అందుకోసం ఎంత డబ్బైనా ఇస్తామని అడిగారు' అని చెప్పారు. ఇప్పుడు తాలిబన్ ప్రభుత్వం లేదు. ముల్లా కూడా గత నెలలో చనిపోయారు. తాలిబన్లను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి ఖతం చేశారు. ఇందులో అమెరికా తర్వాత ఇరాన్ దే ప్రముఖ పాత్ర. తమపై కొనసాగుతున్న దమనకాండను ఎదుర్కొనేందుకు ముస్లింలు ఒకతాటిపైకి వచ్చేరోజు ఎంతో దూరంలో లేదు. ప్రపంచం త్వరలోనే వింతలను చూస్తుంది' అని మసూద్ అజార్ తన వ్యాసంలో రాశాడు. అయితే అజార్ ఆరోపణలకు రా అధికారులు తిప్పికొట్టారు. కందహార్ హైజాక్ వ్యవహారంలో డబ్బుల ప్రస్తావన లేనేలేదని రా మాజీ చీఫ్ ఏఎస్ దౌలత్ స్పష్టం చేశారు. 'నాడు కందహార్ లో జశ్వంత్ సింగ్.. తాలిబన్ విదేశాంగ మంత్రి ముత్తా వకీల్ తో మాత్రమే మాట్లాడారు. అజార్ చెబుతున్నట్లు ముల్లా అఖ్తర్ ను కలుసుకోలేదు. దీనికి ఇద్దరే ఇద్దరు వ్యక్తులు సమాధానం చెప్పాలి. అందులో కరైన ముల్లా అఖ్తర్ చనిపోయాడు. రెండో వ్యక్తి జశ్వత్ సిన్హా ప్రస్తుతం కోమాలో ఉన్నారు. కాబట్టి ఆ ఆరోపణల్లో నిజం నిగ్గుతేలే అవకాశమేలేదు' అని మరో రా అధికారి ఆనంద్ అర్నీ చెప్పారు. -
'కాందహార్ హైజాకర్ల ముందు దద్దమ్మలైపోయాం'
న్యూఢిల్లీ: 'జైష్- ఏ- మహమ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజహర్ సహా మరో ఇద్దరు అగ్రనాయకులను విడిపించుకునేందుకు ఉగ్రవాదులు పన్నిన కాందహార్ విమానం హైజాక్ వ్యూహాన్ని చిత్తుచేసే అవకాశం ఉండికూడా మనవాళ్లు చేష్టలుడిగిపోయారు. సంక్షోభ నివారణ కోసం ఏర్పాటయిన ఉన్నతస్థాయి బృందం ఒకరినొకరు దూషించుకోవడం మినహా సమస్యను పరిష్కరించేందుకు కించిత్ ప్రయత్నమూ చేయలేదు. దీంతో హైజాకర్లముందు మనం దద్దమ్మలైపోయాం' అంటూ 1999లో జరిగిన కాందహార్ విమానం హైజాక్ ను గురించి మాటల బాంబులు పేల్చారు నాటి రా (రీసెంర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) చీఫ్ ఏఎస్ దౌలత్. ఆయన రచించిన 'కశ్మీర్: ది వాజపేయి ఇంయర్స్' పుస్తకావిష్కరణ గురువారం రాత్రి ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా ప్రసంగించిన దౌలత్ పలు ఆసక్తికమైన వ్యాఖ్యలు చేశారు. 'ఖాట్మండూ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే విమానం హైజాక్ అయినట్లు తెలిసింది. ఇంధనం కోసం విమానం కొద్దిసేపు అమృత్సర్ విమానాశ్రయంలో ఆగింది. నిజానికి అప్పటికే పంజాబ్ పోలీస్ చీఫ్ సరబ్జిత్ సింగ్.. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు పక్కా ప్లాన్ రూపొందించారు. ఇందుకోసం నిష్ణాతులైన కమాండోలను కూడా సిద్ధం చేసిఉంచారు. 'ఓకే' అనడమే తరువాయి ఆపరేషన్ మొదలయ్యేది. కానీ ఢిల్లీలో కూర్చొని మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోన్న ఉన్నతాధికారుల బృందం మాత్రం అందుకు 'నో' చెప్పింది. దీంతో ఉగ్రవాదులు విమానాన్ని లాహోర్‌కు అక్కడి నుంచి కాందహార్‌కు తీసుకెళ్లి తమ డిమాండ్లను నెరవేర్చుకున్నారు' అని దౌలత్ చెప్పారు. అయితే బాధ్యులైన అధికారుల పేర్లు వెల్లడించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు.